For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శీతాకాలంలో పండంటి పాదాలకు పన్నెండు సూత్రాలు..

|

Easy Tips for Winter Season Foot Care...!
చలికాలంలో పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే... ఈ కాలంలో కాలి మడమలపై పగుళ్లు వచ్చి సమస్య మరింత పెరుగుతుంది. అదే డయాబెటిస్ ఉన్నవారికైతే ఈ సమస్య వచ్చినప్పుడు అదే తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి... ఈ కాలంలో పాదాలను జాగ్రత్తగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

1. ప్రతిరోజూ పాదాలను చల్లటి నీళ్లతో కాకుండా గోరువెచ్చటి నీటితో కడుక్కోవాలి.
2. పాదాలను, వేళ్ల మధ్య ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి.
3. రోజూ పాదాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.
4. కాలి బొటనవేలి గోరును జాగ్రత్తగా కట్ చేసుకోవాలి.
5. పాదరక్షలు సరిగ్గా సరిపోయేలా ఉండేలా చూసుకోవాలి. షూస్ ధరించేవారు బూట్లలో ఏదైనా ఉన్నట్లు స్పర్శకు తెలిస్తే వెంటనే బూట్లు తొలగించి ఆ వస్తువును తొలగించాకే మళ్లీ వేసుకోవాలి.
6. చెప్పులు లేకుండా నడవకూడదు.
7. పాదాలపై వేడినీళ్లు గుమ్మరించుకోకూడదు.
8. ఉతకని సాక్స్ ఎక్కువరోజులు వేసుకోకూడదు.
9. కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకుని దానికి నాలుగు చెంచాల ఓట్స్ మిల్క్ కలిపి పాదాలకు మర్దన చేసుకుని, ఒక అరగంట తరువాత కడిగేయాలి. ఇలా చేస్తూ ఉంటే పాదాలపైన మృతకణాలుతొలగిపోయి మృదువుగా తయారవుతాయి.
10. ఒక బకెట్లో పావు భాగం వరకు నీళ్ళు తీసుకుని అందులో ఒక స్పూన్ కొబ్బరి నూనె, ఒక స్పూన్ విటమిన్ ఇ నూనె, చెంచ వంటసోడా వేసి ఒక అరగంట పాటు కాళ్ళు అందులో ఉంచాలి. ఇలా చేస్తే పాదాలు మృదువుగా ఉంటాయి.
11. కాళ్ళు పగిలి బాధపెడుతుంటే రోజ్ వాటర్, గ్లిజరిన్ సమానంగా తీసుకుని పగిలిన చోట రాస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన పగుళ్ళు తగ్గుతాయి.
12. బాగా పండిన బొప్పాయి గుజ్జు తీసుకుని దానికి కొంచెం నిమ్మరసం కలిపి కాళ్ళకు మర్దన చేయడం వలన పగుళ్ళు నివారించబడి, పాదాలు మృదువుగా మారతాయి.

English summary

Easy Tips for Winter Season Foot Care...! | శీతాకాలంలో పండంటి పాదాలకు పన్నెండు సూత్రాలు..

It is said that feet play a very important role in the health of people, they maintain the pressure of your whole body in daily life, and there are many acupuncture points in the bottom of the feet link to your internal organs and body. We like to have healthy beautiful feet, not only because they are important to our body health, feet with pretty skin are also a wonderful thing to please us.
Story first published:Friday, December 16, 2011, 15:50 [IST]
Desktop Bottom Promotion