Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించే అందమైన పెదాల కోసం..

ఎంత అందంగా మేకప్ వేసుకున్నా కూడా లిప్ స్టిక్ లేకపోతే ఏదో వెలితి, అందాన్ని ద్విగుణీకృతం చేయడంలో పెదవులు ప్రధానమైనవి. అన్ని రంగుల లిప్ స్టిక్‌లు అందరికీ నచ్చవు. చర్మానికి లిప్‌స్టిక్ సూటవ్వకపోతే ఉన్న అందం కూడా పోతుంది. 'కాస్మెటిక్స్ ఎన్ని వాడినా అధరాలకు అందం రావట్లేదు. నిర్జీవంగా కన్పిస్తున్నాయి' అనుకునే వారు ఈ కింది చిట్కాలపై ఓ కన్నేయండి.
1. స్నేహితులు వేసుకున్న లిప్ స్టిక్ రంగు బాగుందనో, మంచి బ్రాండ్ అని మీరు అలాంటి దానినే ఎంచుకుంటే అది మీ చర్మ తత్వానికి సరిపడక పోవచ్చు. తక్కువ నాణ్యత కలిగిన లిప్ స్టిక్ లు, పరిమళభరితమైన వివిధ రకాల లిప్ గ్లాసులు వాడటం వల్ల ఎలర్జీకి దారి తీయడం, పెదాలు నల్లగా మారటం జరుగుతుంది. ఒక్కోసారి ఇది క్యాన్సర్ కు దారితీసే అవకాశం ఉంది.
2. ఆకర్షణీయమైన రంగు గల టూత్ పేస్ట్ లు సైతం ఎలర్జీకి కారణమౌతాయి. సాధ్యమైనంత వరకు తెలుపు టూత్ పేస్ట్ కు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.
3. పెదాలపై చర్మం చాలా సున్నితంగా, మృదువుగా ఉంటుంది. కాబట్టి గాఢత ఎక్కువగా ఉన్న సబ్బులు నిత్యం వాడితే తేమ కోల్పోతాయి.
4. ఇతరులు ఉపయోగించిన గ్లాసులు, కప్పులు తిరిగి వాడటం వల్ల ఇన్ ఫెక్షన్ కు దారితీస్తుంది.
5. పెట్రోలియమ్ జెల్లీ లేదా లిప్ బామ్ ని తరచూ పెదాలపై రాస్తూ ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు తరచూ వెన్న రాసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications