For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంగస్తంభనకు చెక్..?

|
'Shock' Therapy May Improve Erectile Dysfunction
''వాషింగ్టన్: అంగస్తంభన సమస్యతో శృంగార జీవితాన్ని సాఫీగా కొనసాగించేలేపోతున్న వారికి ఈ వార్త ఊరట కలిగించేదే. అంగస్తంభన సమస్య ఎదుర్కొంటున్న వారి కోసం అమెరికా నిపుణులు సరికొత్త చికిత్సను కనుగొన్నారు. సహజసిద్ధమైన విధానాల ద్వారా పరిష్కారం లభించని వారికి ధ్వని తరంగాలతో చికిత్స జరపడం వల్ల ఫలితాలు రాబట్టినట్లు వీరు చెబుతున్నారు. చికిత్సకు 'ఎక్స్‌ట్రా కార్పోరియల్ షాక్‌వేవ్ థెరపీ'గా నామకరణం చేసిన శాస్త్రవేత్తలు ఈ అంశం పై హైఫాలోని 'రంబం ఆరోగ్య కేంద్రంలో' పరిశోధనలు జరిపారు.''

అధ్యయనంలో భాగంగా 60 సంవత్సరాలు పై బడిన 29 మందిని చికిత్సకు ఎంపిక చేసుకున్నారు. కిడ్నీలో రాళ్లను ముక్కుల చేయడానికి ఉపయోగించే శబ్ధ తరంగాలను వీరి పురుషాంగాల పై ప్రయోగించారు. ఈ ప్రక్రియ రెండు నెలలు పాటు జరిపిన అనంతరం బాధితుల్లో 70శాతం మేర సత్ఫలితాలు కనిపించగా, 30శాతం మందికి సమస్య పూర్తిగా నియంత్రణలోకి వచ్చినట్లు అధ్యయన కర్తలు గుర్తించారు.

పరిశోధనకు సంబంధించిన కధనాన్ని 'సెక్సువల్ మెడిసిన్ జర్నల్'లో ప్రచురించారు. అయితే ఈ పరిశోధన పరిమిత పరిధిలో జరిగిందని, మరింత విస్తృతస్థాయిలో పరిశీలించాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ పరిశోధన పై వైద్యులు భిన్న వాదనను వినిపిస్తున్నారు. ధ్వని తరంగాలతో పురషాంగానికి చికిత్స జరపడం వల్ల నష్టమే ఎక్కువుగా ఉంటుందని వారిస్తున్నారు.

English summary

'Shock' Therapy May Improve Erectile Dysfunction | అంగస్తంభనకు చెక్..?

Shocking the penis with sound waves may help those who have severe erectile dysfunction that has not respond well to drug treatments, a new study finds.Among men in the study, "extracorporeal shock wave therapy" significantly improved sexual function, the researchers said. The patients continued to see improvements two months after the treatment had stopped, and close to 30 percent of them achieved normal sexual function and no longer required medications.
Story first published:Monday, October 31, 2011, 12:15 [IST]
Desktop Bottom Promotion