For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొట్టనిండా ‘తిని’ ఈత కొడితే..?

|

Swim After Food Effects..?
పొట్టనిండా తిన్న తరవాత, ఈత కొట్టడం ఆరోగ్యానికి చేటని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం చేసిన వెంటనే శరీరంలోని జీర్ణవ్యవస్థకు రక్తప్రసరణ ప్రక్రియ వేగవంతంగా చోటుచేసుకుంటుంది. ఈ క్రమంలోనే జీర్ణాశయం, పేగుల వంటి జీర్ణ అవయవాలకు అధిక మోతాదులో రక్తం సరఫరా అవుతుంది.

అదే సమయంలో ఈత కొట్టడంతో పాటు ఇతర వ్యాయమాలకు పూనుకోవడం వల్ల, ఒంట్లోని కండరాలు శ్రమకు తగినట్లుగా రక్త సరఫరా కోసం ఎదురు చూస్తాయి. అప్పటికి జీర్ణ వ్యవస్థకు ఎక్కువ రక్తం ప్రసరించటం వల్ల కండరాల అవసరాలు తీరటం కష్టంగా మారుతుంది.

ఈ సమయంలో రక్త సరఫరా కోసం అటు జీర్ణ అవయవాలు, ఇటు కండరాలు పోటి పడతాయి. ఈ ప్రభావంతో ఆయాసం, కడుపునొప్పి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, కొన్ని సందర్భాల్లో ఈ సమస్యలు తీవ్రరూపం దాల్చుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈత కొడుతున్న సందర్భాల్లో ఈ సమస్య తలెత్తితే వెంటనే ఈతను ఆపేసి విశ్రాంతి తీసుకోవడం మంచిదని వీరు పేర్కొంటున్నారు.

English summary

Swim After Food Effects..? | పొట్టనిండా ‘తిని’ ఈత కొడితే..?

The theory is that the process of digestion increases blood flow to the stomach - away from the muscles needed for swimming - and leads to cramps, which increase the risk of drowning.
Story first published:Monday, October 10, 2011, 15:07 [IST]
Desktop Bottom Promotion