For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ భాగంలో మెటిమలా..?

|
Tips To Cure Butt Acne
ముఖంపై మెటిమ వ్యాపిస్తే సాధారణ సమస్యగానే భావిస్తాం, స్నేహితులతో సమస్యను షేర్ చేసకుటాం, అదే సమస్య పిరుదు (పిర్ర) భాగంలో వ్యాపిస్తే నలుగురికి చెప్పుకోగలమా..? వైద్యులను సంప్రదించగలమా..? నువ్వుకుంటరాన్న భయం.. హేళన చేస్తారన్న అనుమానం.. ఇటువంటి సిగ్గుతో కూడిన సమస్యలను ఆశ్రద్ధ చేయ్యటం వల్ల చర్మ సంబంధిత సమస్యలు మరిన్ని వ్యాప్తి చెందే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 'పిరుదు'భాగంలో వ్యాపించే పొక్కులను ఆదిలోనే నివారించే మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు.

- అనేక కారణాల వల్ల చర్మం పై పొక్కులు వ్యాపిస్తుంటాయి. ఆందోళణ చెందాల్సిన అవసరం లేదు.

- శరీరంలో వేడి కారణంగా పిరుదు భాగంలో వేడి రాషేస్ వ్యాపిస్తుంటాయి. వీటిని మన అచ్చ తెలుగులో 'ఉడుకు పొక్కు'లంటారు. నీటిని అధికమోతాదులో తీసుకోవటం వల్ల ఈ సమస్యను కొద్ది రోజుల్లోనే అదుపులోకి తేవచ్చు.

- ఇరుకైన నైలాన్ సింథటిక్ లోదుస్తులను ధరించటం కారణంగా ప్రయివేటు భాగాలో దురుదలతో పాటు ఇతర పొక్కులు వ్యాప్తి చేందతున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

- టైట్ ప్యాంట్లతో పాటు ఇరుకు లోదుస్తులను ధరించటం కారణంగా, ఆ భాగాలకు గాలి అందే శాతం తక్కువుగా ఉంటుందట. కంఫర్ట్ దుస్తులను ధరించటం మేలంటున్నారు నిపుణులు.

- చీముతో నిండిన పొక్కులు పిరుదు ప్రాంతంలో వ్యాపించినట్లయితే, చర్మ సంబంధిత నిపుణులను సంప్రదించి ప్రత్యేక మెడిసెన్ వాడాల్సి వస్తుంది.

English summary

Tips To Cure Butt Acne | ఆ భాగంలో మెటిమలా..?

Having acne is a normal phenomenon that you can discuss with friends to share notes. But imagine the embarrassment of discussing the cures for butt acne with anyone, even your friends or a doctor.
Story first published:Saturday, October 15, 2011, 16:36 [IST]
Desktop Bottom Promotion