Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
దుస్తులు బిగువయ్యాయా? అందాలు చిందించండి!

బిగువు దుస్తులు ధరించగోరే వారికి కొన్ని ఫ్యాషన్ టిప్స్:
షర్టు బిగువైందా? దానిని జాకెట్ గా వేసి పైన ఒక ఆకర్షణీయమైన టి షర్టు వేయండి. లోపలి షర్టుకు బటన్స్ విప్పండి. కింద జీన్స్ పేంట్ వేస్తే ఎంతో ఆకర్షణ. ఇక షర్టు టైట్ అని ఎవరికి తెలుస్తుంది.
మరో చిట్కాగా, బిగువైన షర్టు పై డార్క్ కలర్ లో వున్న స్లిప్ ఓవర్ వేయండి. ఇదొక ఇన్ ఫార్మల్ అవుట్ ఫిట్ గా వుంటుంది. దీని బయటకు షర్టు కాలర్, చేతులు కనపడితే, ఇదోక ఫ్యాషన్. కొంతమంది స్లిప్ ఓవర్స్ ను షర్టులకే అతుకు పెట్టి వాడేస్తారు కూడాను. ఇది ఆఫీసుల్లో ఫ్రై డే డ్రస్సింగ్ గాను, వీక్ ఎండ్స్ లో పబ్ కి వెళ్ళటానికి చక్కగా వుంటుంది.
మరో ఫ్యాషన్ గా బిగువు దుస్తులు వేసినపుడు మెడ చుట్టూ ఒక స్కార్ఫ్ కట్టేయండి. స్టైల్ గా వుంటుంది. అయితే, కలర్ కాంబినేషన్లు శ్రధ్ధవహించండి. ఈ స్టైల్ లో చక్కటి ఫ్రెంచి వనితలా వుంటారు. సాధారణంగా స్కార్ఫ్ లు వివిధ రకాలుగా ఫ్రెంచి మహిళలు ఉపయోగిస్తారు. బిగువైన దుస్తులనిపించకుండా వుండాలంటే, మరో మార్గం దానిపై వదులుగా వుండే చున్నీ ధరించడం లేదా మెడకు పెద్ద నెక్లెస్ లేదా పెద్ద పూసల గొలుసులు రెండు మూడు వరుసలవి ధరించి అందం తెచ్చుకోవచ్చు.
మీ ఫేవరేట్ జీన్స్ టైట్ అయ్యాయా? మరేం పరవాలేదు. వాటిపై లాంగ్ టాప్స్ వేయండి. లేదా కుర్తా కమీజ్ వేయండి లేదా మగవారి లూజ్ షర్ట్ ఖచ్చితంగా మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది. ఈ చిట్కాలు ఆచరిస్తే దుస్తులు ఎంత బిగువైనా వాటిలో మహిళలు సరికొత్త అందాలు చిందిస్తారనటంలో సందేహం లేదు.



Click it and Unblock the Notifications