Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అందంతో పాటు సామర్థ్యాన్ని తెలిపే పెదాలు...!

మృదువుగా, అందంగా ఉండే పెదాలు మంచి ఆరోగ్యానికి చిహ్నాలని చెప్పవచ్చు. అయితే పెదాలు తడిగా ఉండేందుకు అక్కడ నూనె గ్రంధులేవీ ఉండనందువల్ల అవి తరచు పొడిగా మారుతుంటాయి. పెదాలను నాలుకతో తడిచేసుకోవడం చాలామందిలో మనం గమనిస్తున్నదే. కాని అలా చేయడం మంచిది కాదని వైద్యులు చెబుతుంటారు. చలికాలంలో చర్మం పొడిగా మారి చాలా చోట్ల పగుళ్లు ఏర్పడడం, చిట్లిపోవడం జరుగుతుంటుంది. పెదాలు చిట్లిపోయి రక్తం కూడా కారుతుంది. పెదాలు చిట్లిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. విటమిన్ల లోపం, శరీరంలో నీటి నిల్వలు తగ్గిపోవడం, వాతావరణ మార్పులు ఇందులో ముఖ్యమైనవి.
వర్షా కాలంలో పెదాల సంరక్షణకు తీసుకోవలసిన సూచనలు ఇవి:
1. కీరా ముక్కను పెదాలపై రాయడం వల్ల పెదాలు మృదువుగా ఉంటాయి.
2. కలబంద రసాన్ని పూయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.
3. ఆలివ్ ఆయిల్‌ను రాయడం వల్ల కూడా పెదాల పగుళ్లు తగ్గుతాయి.
4. చవకరకం లిప్ స్టిక్స్ వాడవద్దు. పెట్రోలియం జెల్లీని రాసుకోవాలి. విటమిన్ ఇ ఆయింట్‌మెంట్ రాసుకుంటే పెదాల పగుళ్లు మానుతాయి.
5. రాత్రుళ్లు పడుకునే ముందు పెదాలపై పేరుకుని ఉన్న నెయ్యి రాయడం వల్ల ఉదయానికి పెదాలు మృదువుగా, మెరుస్తూ కనపడతాయి.
6. మార్కెట్లో దొరికే టీ బ్యాగును గోరువెచ్చని నీటిలో ముంచి పెదాలపై నాలుగైదు నిమిషాల సేపు ఉంచడం వల్ల పెదాలకు కావలసిన తేమ ఏర్పడి నిగారింపు వస్తుంది.
7. విటమిన్ ఎ, బి,సి, బి2, ఇ లోపాల వల్ల కూడా పెదాలు చిట్లిపోయి రక్తం కారుతుంది. ఈ విటమిన్లు దొరికే కూరగాయలు, పండ్లు తీసుకోవడంతోపాటు విటమిన్ టాబ్లెట్లు తీసుకోవాలి.
8. కొన్ని అలర్జీల వల్ల కూడా పెదాలు అందవిహీనంగా తయారయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితులలో వైద్యుని పర్యవేక్షణలో మందులు తీసుకోవడం మంచిది.
9. పెదాలు చిట్లిపోతే తడిగా ఉండేందుకు నాలికతో తడిచేసుకోవద్దు. అలా చేయడం వల్ల తాత్కాలిక ఉపశమన ఉంటుంది కాని తడి ఆరిన తర్వాత నొప్పి అధికం అవుతుంది.
బాగా నీరు తాగాలి. కనీసం రోజుకు పది గ్లాసుల నీరు తాగాలి.
10. సాధారణంగా శరీరంలో మృత చర్మానికి చాలా జాగ్రత్త తీసుకొంటాం. అయితే పెదాలపై మృత చర్మం గురించి అంతగా పట్టించుకోము. అటువంటప్పుడు పెదాలు చీలడం, రక్తం కారడం వంటివి జరగుతాయి. అలాజరగకుండా అప్పుడప్పుడూ పెదాల మీద మృత చర్మాన్ని తొలగిస్తుండాలి. అందుకు పళ్ళు రుద్దుకొనే బ్రష్ తీసుకొని పెదాల మీద సున్నితంగా రుద్దినట్లైతే మృత చర్మం తొలగిపోయి. పెదాలు తాజాగా కనబడుతాయి.



Click it and Unblock the Notifications