For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో ఉల్లాసాన్నిచ్చే ఆహారాలు...!

|

A healthy diet and exercise plan for Summer
కార్బోహైడ్రేట్లు అధికంగా లభించే ఆహారానికి దూరంగా ఉండి పీచు పదార్థాలకు ప్రాధాన్యం పెంచాలి. పదార్థాల్లో ఉప్పు శాతం తగ్గించడం తప్పనిసరి. క్యాల్షియం లభించే పాలు పెరుగు, పాలు, చీజ్ బీన్స్, బఠాణీలు, బాదం, పాలకూర వంటివి ఎక్కువగా తీసుకొంటే చెమట సమస్య నియంత్రణలో ఉంటుంది. అలాగే ఘాటు వాసనలు వచ్చే ఉల్లిపాయ, వెల్లుల్లి, మసాలాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ కాలంలో హెర్బల్ టీలు ఎంతో మేలు చేస్తాయి. తరచూ తీసుకోవడం వల్ల చెమట సమస్య తగ్గుముఖం పడుతుంది.

వేసవి కాలంలో ఇంట్లో ఉన్నా సరిగా నీళ్ళు తాగకపోతే డీహైడ్రేషన్ సమస్య భారిన పడే ప్రమాదం ఉంది. దాని వల్ల నిద్ర, అజీర్తి వంటి సమస్యలు వేధిస్తాయి. పుచ్చకామలు, కీరదోస, నిమ్మరసం, పండ్ల రసాలకు ప్రాధాన్యమిస్తే మంచిది. వీటితో పాటు టీ, కాఫీలను తీసుకోవడం తగ్గించాలి. ఒక వేళ తీసుకున్నా వాటిలో పంచదార శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. నిల్వ ఉన్న ఆహారం కాకుండా తాజాగా ఉండేదానికి ప్రాధాన్యమివ్వాలి.

ఈ కాలంలో దాహం ఎక్కువగా చేస్తుంది అందుకు మజ్జిగ, కొబ్బరినీళ్లు, పంచదార నీళ్ల వంటివి ఉపశమనాన్నిస్తాయి. అయితే వీటిని తీసుకొనే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వేసవిలో మజ్జిగ త్వరగా పులిసిపోతాయి. కొబ్బరి నీళ్లు నిల్వ ఉండకూడదు. వీటిని ఎప్పటికప్పుడు తాజాగా తీసుకోవడమే ఆరోగ్యానికి మేలు లేదంటే ఆ ప్రభావం జీర్ణాశయం మీద పడుతుంది.

వేసవి సెలవులు వచ్చేసాయంటే గహిణులకు ఇంట్లో పని చాలా వరకూ తగ్గుతుంది. ఉరుకులు పరుగులు తీస్తూ చిన్నారుల్ని సిద్దం చేయాల్సిన అవసరం ఉండదుఅయితే ఇలాంటప్పుడు చాలామందిని బద్దకం సమస్య వేదిస్తుంది. ఇది ఒక్కోసారి అనారోగ్య సమస్యలకూ కారణమయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎప్పుడూ చురుగ్గా ఉండాలంటే వ్యాయామం, యోగా వంటి వాటి మీద దష్టి పెట్టాలి.

ఇంట్లో తయారు చేసిన ఆహారం ప్రాధాన్యం పెంచాలి. ప్రిజ్ లో నిల్వ చేసినవి తగ్గించి..వేడి వేడిగా వండినవి తీసుకోవాలి. అదీ తక్కువ మోతదులోనే. తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. వాటితో పాటు నడవడం, ఈత, సైక్లింగ్ వంటి వాటి మీద దష్టి పెట్టాలి. వీటివల్ల శారీరక, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండవచ్చువేకువనే మేల్కొనడం వంటివి బద్దకాన్ని దూరం చేసి మెరుగైన ఆరోగ్యాన్ని ప్రసాధిస్తాయి. అనారోగ్యం, ఒత్తిడి వంటి సమస్యలున్నప్పుడు తగిన విశ్రాంతి తప్పనిసరి.

English summary

A healthy diet and exercise plan for Summer | వేసవిలో ఉల్లాసాన్నిచ్చే ఆహారాలు...!

A healthy diet and exercise can decrease your sweating. As we know obese people tend to sweat more than average. Excessive food and alcohol is very hard to break down. That's why your metabolism struggles and your body is heating up. Substitute unhealthy foods with vegetables and fruits, that are easily digested. Energy drinks and coffee can cause real sweating troubles.
Story first published:Friday, May 4, 2012, 12:26 [IST]
Desktop Bottom Promotion