Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కేన్స్ 2012లో అందాల మెరుపులు...అద్భుత సౌందర్యం!
సాంప్రదాయ తీరు తెన్నుల కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో అందాల అతివ, ఒక బిడ్డ తల్లి అయిన ఐశ్వర్య రాయ్ ఎలీ సాబ్ రూపొందించిన దుస్తులలో ప్రతి ఒక్కరిని ఆశ్చర్య చకితులను చేసింది. ఎలీ సాబ్ ఆధునిక హంగులతో రూపొందించిన దుస్తులలో అయిశ్వర్యా రాయ్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పెట్ ను మరింత ఆకర్షణీయం చేసింది. ప్రసవం తర్వాత కొద్దిగా బరువు పెరిగినప్పటికి ఐశ్వర్య రాయ్ ఈ ఫిలిం ఫెస్టివల్ లో అందరి చూపులను ఆకట్టుకొంది. ఆమె ధరించిన నీలి రంగు గౌను ఆమె అందాలను ద్విగుణీకృతం చేసింది. చూపరులను అలరించింది.

తల్లి అయిన తర్వాత అయిశ్వర్య అందాలు వన్నె తగ్గాయనే వ్యాఖ్యాతలకు దీటుగా తన అందచందాలతో, ఆకర్షణీయ దుస్తులలో ఆమె మరోమారు సౌందర్యోపాసకుల అంచనాలను తల్లికిందులు చేసింది. రెండవమారు చేసిన ఫోటో షూట్ లో ఆమె ధరించిన నల్లని కాలి పట్టెలు, శాండల్స్, సన్ గ్లాసెస్ వంటివి ఎంతో ఆకర్షణీయం అనిపించాయి.
ఆమె ధరించిన గౌను పూవులు, జంతువుల బొమ్మల ప్రింటుతో చూడముచ్చటగా వుంది. 1970ల నాటి సిల్హౌటీ సిల్క్ కఫ్తాన్ పై ముందువైపు గల నీలి బొమ్మలు, వెనుక వున్న ఆకుపచ్చని పూవులు మరువలేని ఆకర్షణలు. ఆమె వేసిన ముందువైపు డీప్ వి నెక్ వెనుక వున్న కఫ్తాన్ లకు భుజాలపై వచ్చిన కటౌట్లు ఎంతో బాగున్నాయి. ఆమె కట్టిన నల్లని రిబ్బన్... ధరించిన దుస్తులకు ఎంతో నప్పింది. మేకప్ చాలా తక్కువ. నల్లని ముంగురులు, పింక్ రంగులో గల ఆమె పెదవులు కేన్స్ 2012 ప్రదర్శనకు ఆమెను ఒక ప్రత్యేక అప్సరసను చేశాయి.
2012 కేన్స్ ఫిలిం ఫెస్టివల్ మొదటి ఫొటో షూటింగ్ లో అయిశ్వర్య రాయ్ తన గౌనులో ఎంతో అందంగా వుంది. రెడ్ కార్పెట్ పై సైతం అతి తక్కువగా వున్న ఆమె మేకప్, ఆకర్షణీయమైన ఆమె దుస్తులు మరోమారు ఐశ్వర్య అందాల సుందరి అనుకునేలా చేశాయి.
ఈ అప్సరస తన ప్రసవం తర్వాత కొద్దిగా బరువు పెంచుకున్నప్పటికి, తన బరువైన శరీరాన్ని దాచకుండా వుండలేకపోయింది. ధరించే దుస్తులు, భారతీయ సాంప్రదాయకమైనవైనా, పాశ్చాత్య పోకడలవైనా, ఏవైనప్పటికి తన అంద చందాలను ప్రదర్శించి చూపరులను ఎలా ఆకట్టుకోవాలనేది అందాల సుందరి అయిశ్వర్యకే బాగా తెలిసిన అంశం అనాలి.



Click it and Unblock the Notifications