Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పాదాలను సురక్షితంగా కాపాడుకోవడం ఎలా...?

పాదాలకు అతి త్వరగా ఇన్ఫెక్షన్ వ్యాపించే వారు నాణ్యమైన సాక్స్, షూ వేసుకోవడం వల్ల పాదాల పగుళ్ల నుండి కాపాడుకోవచ్చు. ఇంట్లో పనిచేసేటప్పుడు నీళ్ళల్లో తడవాల్సి వస్తే స్లిప్పర్స్, శాండిల్స్ వేసుకోవాలి. పని పూర్తైన వెంటనే పొడిబట్టతో పాదాలను బాగా తుడిచి తేమను పూర్తిగా తొలగించాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే కాలి వేళ్ళమధ్య తడిలేకుండా చూసుకోవాలి.
పగుళ్లు వచ్చిన వారు పాదాలను రాత్రి పడుకునేముందు గొరువెచ్చని నీటిలో ఉప్పు, పసుపు చిటికెడు వేసి నానబెట్టుకోవాలి. తరవాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడుచుకుని వైట్ పెట్రోలియం జెల్లీని రాసుకుంటే పాదాల పగుళ్లుపోవడమే కాకుండా మృదువుగా కూడా వుంటాయి.
నిమ్మరసం, దాల్చిన చెక్కపొడి, ఆలివ్ ఆయిల్, పచ్చిపాలు... ఒక్కొక్కటి రెండు టీ స్పూన్ల చొప్పున తీసుకుని సగం బకెట్ గోరువెచ్చని నీటిలో కలపాలి. ఆ నీటిలో పాదాలను 20 నిమిషాలపాటు ఉంచి, సబ్బు లేదా ఉడకపెట్టిన నిమ్మచెక్కలతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేస్తే పాదాలు పగుళ్లు తగ్గి అందంగా ఉంటాయి.
రాత్రి పడుకునే ముందు పాదాలను మాయిశ్చరైజర్ తో మసాజ్ చేసుకోవాలి. అయితే మాయిశ్చర్ ను వేళ్ళ మధ్యన రాయకుండా వదిలేయాలి. మాయిశ్చరైజర్ లేనివాళ్ళు ఆలివ్ ఆయిల్ ను గానీ, ఆల్మండ్ ఆయిల్ ను గానీ రాసుకోవచ్చు.
వారానికి ఒక్కసారి ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవాలి. గోరు వెచ్చటి నీళ్లలో నిమ్మరసం, హ్యాండ్ వాష్ లిక్విడ్ వేసి బాగా కలిపి అందులో పాదాలు పెట్టాలి. స్కబర్ తో పాదాలను శుభ్రం చేసుకోవాలి. గోర్లను శుభ్రం చేసుకోవాడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించవచ్చు. తర్వాత పాదాలను తడిలేకుండా తుడిచి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.
డెడ్ స్కిన్ వల్ల కాలి పగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. పాదాలకు ఉన్న మృతచర్మం తొలగిపోయేలా స్ర్కబ్బర్ తో రుద్దుకోవాలి.



Click it and Unblock the Notifications