Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చీకట్లో వెలుగులు జిమ్మే టార్చ్ లైట్లే...!

1. ఒక కప్పు ఉసిరిపొడిని నీటిలో నానబెట్టాలి. మర్నాడు వడకట్టి అదనంగా మరో కప్పు నీరు చేర్చి కళ్లపై చల్లుకోవాలి.
2. కొద్దిగా గులాబీ నీటిని తీసుకుని నాలుగైదు చుక్కల ఆముదాన్ని కలపాలి. ఇందులో దూదిని ముంచి కళ్లపై ఇరవై నిమిషాలు ఉంచుకుంటే అలసిన కళ్లు ఆరోగ్యంగా కనిపిస్తాయి.
3. పల్చటి డికాషన్ నీటిని కళ్లపై అద్దుకుని ఆ తర్వాత తుడుచుకున్నా ప్రయోజనం ఉంటుంది.
4. కంటికి సరిపడా నిద్ర, విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. తగినంత నిద్ర, విశ్రాంతి వల్ల కళ్ళు కలువ పువ్వుల్లాగా ఉంటాయి. ముఖ్యంగా రాత్రిల్లో ఎక్కువ సమయం వేచి ఉండటం లేదా పొద్దు పోయాక ఇంటికి రావడం వంటివి చేయకూడదు. లేట్ నైట్ నిద్ర కళ్ళు, మొదడు పైన ప్రభావాన్ని చూపెడుతుంది. నిద్ర లేవగానే కళ్ళును చల్లటి నీటితో తడుపుకోవడమో లేదా కడుక్కోవడమో చేయాలి.
5. కళ్ళు ఆరోగ్యంగా, కళ్ళక్రింది ముడతలు లేకుండా ఉండాలంటే ఆల్కాహాల్, టుబాకో, పాన్ పరాగ్, హాన్స్ వంటివి తీసుకోకూడదు.
6. కళ్ళు ఆరోగ్యంగా ఉండటం కోసం ఇంట్లో సహజసిద్దంగా దొరికే బంగాళదుంప మరియు కీరదోసకాయ వంటివి చక్రాల్లా కట్ చేసి కళ్ళుకు పెట్టుకొంటే కళ్ళు రిలాక్స్ అవ్వడమే కాకుండా కళ్ళు చల్లాగా అనిపిస్తూ అందంగా ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
7. వాతావరణంలోని దుమ్ము ధూళి వల్ల కల్లు ఉబ్బడం, కళ్ళు దురద పెట్టడం, కళ్ళమంట, అలర్జీ వంటి వాటి నుండి ఉపశమనం పొందాలంటే హేర్బల్ ఐ డ్రాప్స్ ఉపయోగించవచ్చు.
8. కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు గడిపేటట్లైతే ముఖ్యంగా కళ్ళ భద్రత కోసం యాంటీ గ్లాస్ ఉపయోగించడం మంచిది. అలాగే మీ పిసి కి యాంటీ రేడియేషన్ స్క్రీన్ ను అమర్చుకోవడం మరీ మంచిది. అలాగే ఒకే డైవర్షన్ లో పనిచేయకుండా ప్రతి పదిహేను నిమిషాల కొకసారి ఒక నిమిషం పాటు కళ్ళను పక్కకో, పైకో, క్రిందికో మరల్చాలి. అలాగే డిమ్ గా ఉన్న లైట్ వెలుతుర్లో చదవకూడదు. వ్రాయకూడదు.
9. ఒక చిన్న టేబుల్ స్పూన్ లో కొద్దిగా బాదాం నూనె, అంతే మోతాదులో తేనె రెండూ బాగా మిక్స్ చేసి కళ్ళ చుట్టూ, బ్లాక్ సర్కిల్స్ ఉన్న ప్రదేశంలో తరచూ రాస్తుంటే కళ్ళక్రింద ముడతలు, నలుపుదనం పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ‘విటమిన్ ఇ' ఆయిల్ ను కళ్ళకు రాయడం వల్ల ముడతలు, నల్ల మచ్చలు తొలగిపోతాయి.
10. ఒక్కరోజులో ముఖం రెండు లేదా మూడు సార్లు చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అలానే స్నానం చేసిన తర్వాత చల్లటి నీటిని చేతి నిండుగా తీసుకొని అందులో కళ్ళను ముంచినట్లు చేయాలి. ఇలా చేయడం వల్ల కళ్ళకు రక్షణ కలుగుతుంది.
11. ప్రతి రోజూ నిద్రకు ఉపక్రమించే ముందుగా కళ్ళును రోజ్ వాటర్ లో దూదిని ముంచి కళ్ళ చుట్టూ సున్నితంగా తుడిచేస్తే దుమ్ము, ధూళి తొలగిపోయి కళ్ళు ప్రకాశవంతంగా ఉంటాయి.
12. టమోటో జ్యూస్ మరియు కీరదోసకాయ రసం రెండూ సమపాళ్ళలో తీసుకొని బాగా మిక్స్ చేసి కళ్ళ చుట్టూ అప్లై చేయాలి. అలాగే ఉండనిచ్చి అరగంట తర్వాత ముందు చల్లటి నీళ్ళు తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications