Latest Updates
-
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.?
బీటా కెరొటిన్ తో ఆరోగ్యకరమైన నయన సౌందర్యం

కళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో బీటా కెరొటీన్‌ను మించిన పదార్థం లేదు. ఇది కొన్నిరకాల పోషకాలను విటమిన్ ఏగా మార్చి, కళ్లకు ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు తోడ్పడుతుంది. రే చీకటిని దూరం చేస్తుంది. కంటిచూపునూ మెరుగుపరుస్తుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో క్యారెట్లు, ఆప్రికాట్లు, బొప్పాయి, మామిడి, పాలకూరలను ఎక్కువ మోతాదులో ఉండేలా చూసుకుంటే.. మిలమిలలాడే ఆరోగ్యకరమైన నయన సౌందర్యం సొంతమవుతుంది.
అదేవిధంగా శారీరక వ్యాయామంతో కండరాలు ఆరోగ్యంగా మారతాయనేది ఎంత నిజమో, కనుపాపపై ఏర్పడే ఒత్తిడి దూరమవుతుందనేదీ అంతే నిజం. కంటిపై ఒత్తిడి తీవ్రమైతే గ్లూకోమా సమస్య వచ్చే అవకాశముంది. దానికి వ్యాయామమే విరుగుడు. అందుకే తేలిక పాటి వ్యాయామాన్ని ఎంచుకుని, క్రమం తప్పకుండా చేయడం ప్రారంభించాలి.
అలాగే మంచినీళ్లు తక్కువగా తాగితే కంటిపై ప్రభావం పడుతుంది. ఎక్కువ నీళ్లు తాగకపోతే శరీరంలో తేమ తగ్గుతుంది. కళ్లు జీవం కోల్పోయినట్లు కనిపిస్తాయి. కళ్లకింద ఉబ్బడం మొదలవుతుంది. అలాంటప్పుడు వెంటనే నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. చల్లగా ఉండే టీ బ్యాగులు, చల్లని పాలల్లో ముంచిన దూదిని అప్పుడప్పుడు కళ్లపై పెట్టుకోవడం మంచిది. నల్లగా మారి, ఉబ్బిన కళ్లకు ఇలాంటివి చక్కగా పనిచేస్తాయి.



Click it and Unblock the Notifications