Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నఖాలు.... సొగసు చూడతరమా....!

కొత్త పోకడలకు అనుగుణంగా గోళ్లకు వైవిధ్యమైన రంగులు వేసుకోవడం... టట్టూలు, ముద్రలతో అలంకరించుకోవడానికే చాలా మంది ప్రాధాన్యమిస్తుంటారు. కానీ ప్రాథమికంగా వాటి సంరక్షణ పట్ల దృష్టి పెట్టినప్పుడే అలంకరణ ఆహా అనిపిస్తుంది. అందుకు ఓ పద్దతి... కొన్ని చిట్కాలు వున్నాయి... వాటిని పాటిస్తే అందమైన గోళ్లను మీ సొంతం చేసుకోవచ్చు.
ఇప్పుడు వర్షాకాలం మొదలైంది. వర్షాకాలం అంతా మీ గోళ్లను అందంగా, మెరిసిపోయేటట్లు వుంచుకోవడానికి చిన్ని చిట్కా వుంది. కొద్దిగా చల్లని పాలలో చిటికెడు వంటసోడ కలిపి చేతి వేళ్లకు పట్టించి ఇరవై నిమిసాల పాటు ఆరనిచ్చి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చేతి వేళ్లు, గోళ్లు మిలమిల మెరుస్తూ వుంటాయి. మాయిశ్చరైజర్ కి ముందే ఈ విధంగా చేయాలి.
బయటకు వెళ్లి వచ్చిన వెంటనే బకెట్ గోరువెచ్చని నీటిలో కొద్దిగా మింట్ ఆయిల్ కలిపి అందులో చేతివేళ్లను, కాలి వేళ్లను నాననివ్వాలి. కావాలనుకుంటే కొద్దిగా అయొడిన్ ను కూడా ఇందులో కలుపుకోవచ్చు. ఈ విధంగా చేస్తే ఫంగస్ బారి నుంచి తప్పించుకోవచ్చు.
వారానికి ఒకసారైనా నెయిల్ పాలిష్ రిమూవర్ ను ఉపయోగించాలి. నెయిల్ పాలిష్ రిమూవర్ గోళ్లకున్న మట్టిని తీసివేయడమే కాకుండి చిన్నచిన్న పగుళ్లు వున్నా వాటిని సరిచేస్తుంది. క్రమం తప్పకుండా కాల్షియం, బికాంప్లెక్స్ మాత్రలు లేదా వాటి ప్రత్యామ్నాయాలను వాడాలి. ఇవి గోళ్లను అందంగా, దృడంగా వుంచడానికి దోహదపడతాయి.
సాధారణంగా గోళ్లు పసుపురంగులోకి మారవు. లేత గులాబీరంగు నుంచి పసుపు పచ్చని రంగులోకి మారాయంటే అది అనారోగ్య కారణమో లేదా మీ నెయిల్ పాలిష్ లోపంగానో భావించాలి. వెంటనే దాని వాడకం ఆపేయడంతో పాటు నెయిల్ పాలిష్ రిమూవర్ తో ఆ పాలిష్ ను శుభ్రంగా తీసివేసి నిపుణులను సంప్రదించడం మంచిది. తరచూ నెయిల్ పాలిష్ లను మార్చకూడదు. పేరున్న నెయిల్ పాలిష్ లనే కొనుగోలు చేయాలి తప్ప లోకల్ గా దొరికే బ్రాండ్ లను ఉపయోగించకూడదు. ముఖ్యంగా ఇలాంటి ప్రయోగాలు ఈ కాలంలో అస్సలు పనికిరావు.
నెయిల్ పాలిష్ రిమూవర్ ఉపయోగించాక చాలా మంది అలానే రంగు వేసుకుంటారు. దాన్ని వాడిన వెంటనే చేతులు శుభ్రపరచుకోవాలి. రిమూవర్ చర్మం పై పడటం అంత క్షేమం కాదు. అలానే పదిహేను రోజులకోసారి మృతచర్మాన్ని తొలగించుకోవాలి. పచ్చిపాలలో ఇయర్ బడ్స్ ను ముంచి గోళ్లకు, చర్మానికి మధ్యలో తుడవాలి. గోళ్ల రంగు, రిమూవర్ పూర్తిగా తొలిగిపోతుంది.
గోళ్లు ఎప్పటికప్పడు కత్తిరించుకుంటే ఏ సమస్యా ఉండదు. పొడవుగా పెంచుకోవాలనుకొంటే మాత్రం శ్రద్ద తప్పనిసరి. గోరు వెనుక భాగంలో నిమ్మరసంలో ముంచిన దూదితో తుడుచుకొంటే మృతకణాలు పేరుకు పోకుండా ఉంటాయి. వీటిని కత్తిరించడానికి కత్తెర, కట్టర్ వంటివి వాడుతుంటారు. వాటి వాడకం విషయంలోనూ జాగ్రత్తులు తీసుకోవాలి. అవి కొంచెం తప్పు పట్టినా ఉపయోగించకపోవడం మేలు. వాటి వల్ల చర్మ సంబంధిత సమస్యలు భాదించే ఆస్కారం ఉంటుంది.
ఘాటైన సబ్బులతో దుస్తులు ఉతకడం, గిన్నెలు తోమడం వంటి పనులు చేసినప్పుడు వెంటనే చేతులను సబ్బు నురగతో శుభ్రపరచుకోవాలి. కొబ్బరినూనె లేదా మాయిశ్చరైజర్ తో మర్దన చేసుకోవాలి. లేదంటే రసాయనాల ప్రభావం వల్ల అవి విరిగిపోవడం, పెళుసుగా మారడం జరుగుతుంది.
మేనిక్యూర్ చేయించుకొన్న రెండు మూడు రోజులు వరకూ తోట పని జోలికి వెళ్లకూడదు. వెళ్లినా గ్లవుజులు తప్పనిసరిగా ధరించాలి. ఒక వేళ గ్లవుజులు లేకుండా పని చేస్తే సబ్బులో గోళ్లను గుచ్చాలి. దాని వల్ల గోళ్లలో మట్టి చేరదు. పరిశుభ్రంగానూ ఉంటాయి.



Click it and Unblock the Notifications