Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
వేసవి కాలం వచ్చేస్తోంది....
వేసవికాలం వచ్చిందంటే చాలు ఎక్కడ చూసిన చెమటలు కార్చుకుంటూ ఇబ్బంది పడిపోతుంటారు. వేసవిలో శరీరం తాజాగా కాంతివంతంగా ఉండాలంటే మాయిశ్చరైజర్లు, యాంటీపర్‌స్పిరెంట్లు, డియోడరెంట్లు, పెర్ ఫ్యూములు, సన్ స్క్రీ

1. మాయిశ్చరైజర్స్: పొడి చర్మం వారికి వీటి అవసరం ఎక్కువ. వీటిలో రెండు రకాలుంటాయి. చర్మం నుంచి నీరు ఆవిరైపోకుండా అడ్డుకునే 'అక్లూసివ్స్' కొన్నైతే.. నీరును చర్మానికి అందించే 'హ్యుమాక్టిన్స్' కొన్ని. ఎక్కువగా వాడితే ఇవి చర్మం మీద ఉండే సూక్ష్మమైన రంధ్రాలను మూసివేస్తాయి. దీనివల్ల మొటిమలు విపరీతంగా పెరిగిపోతాయి. చీముపొక్కులూ వస్తాయి. కాబట్టి వీటిని మితంగా వాడాలి.
2. సన్ స్ర్కీన్ లోషన్లు: రాసుకుంటే బయటకు కనబడకుండా ఉండే రసాయనిక స్క్రీన్ లలో 'ప్యారాఅమినో బెంజాయిక్ యాసిడ్' వల్ల చాలా మందికి, 'సినమేట్స్'తో కొద్దిమందికి రియాక్షన్లు వస్తాయి. సన్ స్ర్కీన్ లోషన్ అన్ని కాలల్లోనూ చర్మ పరిరక్షణకు దోహదపడుతుంది. చల్లటి వాతావరణంలో విహరించడానికి అందరూ ఉత్సాహం చూపుతారు. అతి చల్లదనం చర్మానికి హానిచేస్తుందని మరవకండి. ప్రతి ఉదయం గోరువెచ్చని నీటితో స్నానం చేయడం చర్మానికి మంచిది. స్నానపు నీటిలో రెండు చుక్కలు బాదం నూనె వేసుకుని స్నానం చేస్తే పొడిబారకుండా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయాన్ని మరిచిపోకండి. తక్కువ సమయంలోనే స్నానాన్ని ముగించండి. సబ్బులు కూడా ఏవిపడితే అవి వాడకూడదు. శీతాకాలానికి అనువైనవి మాత్రమే ఎంచుకోండి.
3. పర్ ఫ్యూమ్: కేవలం అత్తర్లు, సెంటు, పర్ ఫ్యూములే కాదు.. ప్రతి సౌందర్య సాధనంలోనూ సువాసన కోసం వీటిని ఎంతోకొంత కలుపుతారు. ఇవి చర్మానికి తగిలినప్పుడు అలర్జీ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. వీటివల్ల చర్మం మీద రకరకాల అలర్జీలు, నలుపు లేదా తెలుపు మచ్చలు వస్తాయి. కాబట్టి పర్‌ఫ్యూములను దుస్తుల మీదే స్ప్రే చేసుకోవాలి. నేరుగా చర్మం మీద తగలనివ్వకుండా చూసుకోవటం చాలా అవసరం.
4. డియోడరెంట్స్: వాస్తవానికి వీటిని నేరుగా చర్మం మీద స్ప్రే చేసుకోకూడదు. బట్టల మీదో, దూరం నుంచో స్ప్రే చెయ్యాలి. కానీ చాలామంది నేరుగా వాడతారు. వీటిలో బిథియొనాల్ వంటి 'క్లోరినేటెడ్ ఫినాల్స్' ఉంటాయి. వీటిని స్ప్రే చేసుకుని, సూర్యరశ్మిలోకి వెళితే 'ఫోటో సెన్సిటైజేషన్' వచ్చి, నల్లగా అయిపోవచ్చు. చంకల్లో చర్మం నల్లగా, దళసరిగా మారటం, దురద, అక్కడి చర్మం బాగా పల్చబడి నీరుగారుతుండటం వంటి సమస్యలన్నీ వస్తాయి.



Click it and Unblock the Notifications
