For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూకలిప్టస్ ఆయిల్ తో చర్మ సౌందర్యం......!

By B N Sharma
|

భారత దేశంలో ఖ్యాతిగాంచిన నీలగిరి కొండలు అందరకూ బాగా తెలుసు. ఎందుకంటే అక్కడ ‘యూకలిప్టస్' మొక్కలు అధికం. యూకలిప్టస్ ఆయిల్ శరీరానికి ఎన్నో ప్రయోజనాలనిచ్చే ఘాటైన నూనె. యూకలిప్టస్ నూనెను చర్మం చాలా అధికంగాను వేగంగాను పీల్చేసుకుంటుంది. ఎంతో తాజాదనాన్ని ఇస్తూ, శరీరాన్ని చల్లబరచి బాక్టీరియా, ఇతర క్రిములను నశింపజేస్తుంది. యూకలిప్టస్ నూనె శరీర మర్దనకు మంచి నూనె. చర్మం మంటలు, పురుగులు కుట్టిన నొప్పులు, లేదా బొబ్బలు మొదలైనవి రెండు చుక్కలు వేస్తే చాలు నయమైపోతాయి. ఆరోగ్యరీత్యా చాలా మంచిది. దీనికిగల మరికొన్ని ప్రయోజనాలను చూద్దాం-

Eucalyptus Oil In Massage Therapy!

1. యూకలిప్టస్ ఆయిలో సహజ సువాసన కలది. చర్మంపై వచ్చే అనేక వ్యాధులను, మ్యూకస్ విడుదల, పుండ్లు, యోని సంబంధిత ఇతర వ్యాధులు నయం చేస్తుంది. చర్మం సెప్టిక్ అయినా, లేదా చీము పట్టినా దీని వాడకం మంచి ఫలితాన్నిస్తుంది.

2. నొప్పుల నివారణకు సహజ ఔషధం. శారీరక, కీళ్ళ నొప్పులు తగ్గించి మైండ్ కు రిలాక్సేషన్ ఇస్తుంది. బకెట్ వేడి నీటిలో కొద్ది చుక్కలు వేసి స్నానం చేస్తే ఎంతో హాయిగా వుంటుంది. మరిన్ని మంచి ఫలితాలు కావాలంటే దీనితో లవెండర్ కలపండి.

3. ఈ నూనె రాస్తే చర్మం నునుపు రావటం, చర్మంపై మచ్చలు పోవడం జరుగుతుంది. భుజాలు, వీపు భాగాలకు విటమిన్ ఇ ఆయిల్ తో కలిపి రాస్తే మంచి ఫలితాలుంటాయి.

4. చర్మ సంబంధిత వ్యాధులకు లేదా పురుషులు వారి షేవ్ తర్వాత ఆఫ్టర్ షేవ్ లోషన్ గాను వాడవచ్చు.

5. యూకలిప్టస్ ఆయిల్ ను శనగపిండి లేదా ముల్తాని మిట్టితో కలిపి రాస్తే చర్మం పొడిబారకుండా వుండి మెత్తగాను, ఎంతో అందంగాను కనపడుతుంది.

English summary

Eucalyptus Oil In Massage Therapy! | మసాజ్ మెరుపులు - అందాల విందులు!

Natural Body Care – Eucalyptus can be mixed with gram flour or multan mitti and can be used as a scrub. The non greasy oil nourishes skin, tones and polishes body making it soft and beautiful.
Story first published: Thursday, July 26, 2012, 14:57 [IST]
Desktop Bottom Promotion