Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
ఎత్తు చెప్పులు/హై హీల్స్ వాడకంతో అనారోగ్యం పాలు....

ప్రస్తుతం మార్కెట్లోకి హైహీల్స్, పెన్సిల్ హీల్ ఇలా రకరకాల చెప్పులు వచ్చాయి. ఏ చెప్పులు కొనాలా? అని షాపుల్లో అమ్మాయిల హడావుడి. వీరికి తోడు ఇప్పుడు అబ్బాయిలు కూడా జత కూడారు. హై షూస్ వాడేస్తున్నారు. ఇవి చూడ్డానికి చాలా బాగుంటాయి. కానీ ఇలాంటివి ధరించి తమ ఆరోగ్యం, సమయం వృధా చేసుకుంటున్నారు. మునివేళ్ళ మీద నడవటం వల్ల చూడడానికి బాగానే వుంటుంది కానీ... ఇది చూపించే దుష్ప్రభావాలు కూడా అలానే ఉంటాయి.
1. ఎత్తు చెప్పులను ధరించడం వల్ల కాళ్ళ నొప్పులు, ఆ తర్వాత కీళ్ళ నొప్పులు కూడా వచ్చే ప్రమాదము ఉంటుంది. ఈ చెప్పులను వేసుకొని ఎక్కువసేపు నడిచినా, ఎక్కువసేపు నిలబడి ఉన్నా కీళ్ళనొప్పులతో పాటు నడుమునొప్పి, బోన్ క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన రోగాలు వస్తాయట.
2. ముని వేళ్ల మీద నడవడం వల్ల ఒత్తిడి పెరిగి బొటన వేళ్ళు వంకర పోవడం, మోకాళ్ల నొప్పులు, కీళ్లు మరియు కాలి మడమలు అరిగిపోవడం, నరాలు తొలిగిపోవడం, పాదాలు దెబ్బతినడం గోళ్ల ఇన్ ఫెక్షన్ రావడం వంటి ప్రమాదాలున్నాయని ఆర్థోపిడిషియన్స్ అంటున్నారు.
3. అందుకే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఫ్లాట్‌గా ఉన్న చెప్పులు వాడటమే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఎత్తై చెప్పులు ఆరోగ్యానికే కాదు, నడకకు కూడా సౌకర్యవంతంగా ఉండవు. పెన్సిల్ హీల్ వంటి వాటితో జారిపడి కాళ్ళు ఫ్యాక్చర్ అయ్యే అవకాశం ఎక్కువ. దీంతో ఆడవాళ్ళు 40 సంవత్సరాలు కూడా రాకముందే కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారట. దీనికి కారణం ఎత్తుచెప్పులు వాడటమే. కాబట్టి ఎత్తు చెప్పులను కొని అనారోగ్యాల పాలు కావడం కంటే, ప్లాట్ చెప్పులు వేసుకొని ఆరోగ్యంగా ఉండడమే మంచిది.



Click it and Unblock the Notifications
