Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
గోళ్ళు సంరక్షణ..ఆరోగ్యం..అందం...

1. కొంతమందికి గోళ్లు ఉబ్బెత్తుగా ఉండి వాలినట్లుగా ఉంటాయి. ఇలాంటివారు గోళ్లను రెండు మిల్లీమీటర్ల పొడవుకంటే ఎక్కువగా పెంచకూడదు. లేకపోతే గోర్లు పొడవైనకొద్దీ కిందికి వాలిపోయి పక్షుల గోర్లమాదిరిగా మారిపోతాయి. మరికొందరికి గోళ్లు పైకి లేచినట్లుగా ఉంటాయి. ఇలాంటివారుకు కూడా ఎక్కువ పొడవుగా పెంచకూడదు. వేళ్లు సన్నగా బాగా పొడవుగా ఉన్నవారు కూడా గోళ్లను ఎక్కువ పొడవుగా పెంచకూడదు.
2. గోళ్లచుట్టూ ఉండే చర్మానికి క్యూటికురా ఆయిల్‌తో మసాజ్ చేస్తుంటే ఆరోగ్యంగా ఉంటాయి. గోరుమీద కూడా ఆయిల్ వేసి మర్దనా చేస్తే ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి. నిమ్మముక్కతో రుద్దితే గోళ్లు మెరుస్తూ ఉంటాయి. గోళ్ళు బాగా ఆరోగ్యంగా పెరగాలంటే విటమిన్ సీ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
3. పాలీష్ చిక్కగా ఉండి, త్వరగా గట్టిపడటానికి పాలీష్ లలో 'ఫార్మాల్డిహైడ్' తప్పనిసరిగా వాడతారు. దీనివల్ల కొన్నిసార్లు అసలుకే మోసం వచ్చి గోరు ఊడిపోయే ప్రమాదం ఉంది. గోరుచుట్లు, గోరుపైని చర్మం వాచి నొప్పి, చీముకూడా పట్టొచ్చు. గోరు రూపమే మారిపోవచ్చు. మందంగా అవ్వచ్చు, లేదా పల్చబడిపోవచ్చు. ఎప్పుడన్నా ఒకసారి పాలీష్ వేసుకుంటే పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. కానీ వరసగా వేసుకుంటుంటే ఈ రసాయనాలు గోరులో పేరుకుపోయి.. కొంత కాలానికి సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంటుంది.
4. రెండోది- నెయిల్‌పాలీష్ వేసుకున్న వారు ఆ చేతితో ఏదో ఒక సమయంలో కళ్లు నులుముకోవటం, మెడ మీద గోకటం వంటివి చేస్తారు. దీంతో సున్నితమైన కంటి చర్మం దగ్గర, మెడ మీద రియాక్షన్లు వస్తాయి.
5. పాలీష్ రిమూవర్స్: దీనిలో ప్రధానంగా రంగును కరిగించే సాల్వెంట్ రసాయనం 'అసిటోన్' ఉంటుంది. దీనివల్ల గోరుచుట్టూతా ఎర్రగా వచ్చి దురదలూ, మచ్చలు, నీరు కారటం వంటి దుష్ప్రభావాలన్నీ ఉంటాయి. ఈ సమస్యలు అందరికీ రాకపోవచ్చు. కానీ అవి మొదలైనప్పుడు వెంటనే గుర్తించటం చాలా అవసరం.



Click it and Unblock the Notifications