Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
కళ్ళ సోయగాన్ని ఇలా సొంత చేసుకోండి....

1. రోజుకి కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం అది ఒక్కొక్కరి శరీర తత్త్వాన్ని బట్టి మారుతుంది. తక్కువ నిద్రపోతే కంటి కింద నల్లటి ఛాయలు ఏర్పడతాయి. ఇవి అందాన్ని దెబ్బతీయడమే కాకుండా అనారోగ్యానికి చిహ్నాలు కూడా.
2. బయటి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కళ్లను శుభ్రంగా కడుక్కోవాలి. కనురెప్పల కింద దూదితో తుడిచి మృదువుగా కొబ్బరినూనెతో మర్దన చేయాలి. దాంతో హాయిగా నిద్రపడుతుంది. కంటి క్రింద వలయాలు తగ్గుముఖం పడతాయి.
3. కీరదోస వల్ల కూడా చక్కని ఉపశమనం లభిస్తుంది. కీర రసం తీసి అందులో దూదిని ముంచి రోజూ రెండు పూటలా కంటి భాగంలో తుడిస్తే ఆ ప్రాంతంలోని మృతకణాలు దూరమవుతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.
4. బాదం పలుకులు కూడా సమస్యను తగ్గించేస్తాయి. బాదం పలుకులను పాలలో నానబెట్టి మర్నాడు మెత్తగా చేసి నల్లగా మారిన చోట పూతలా పూసి గంట తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
5. కళ్ళు అలసటకి గురవుతున్నాయని అనిపించినప్పుడల్లా చల్లని నీతితో కళ్ళను కడుక్కుంటూ వుండాలి.
6. రెండు టీస్సూన్ల టమోట రసంలో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి కళ్ల కింద నెమ్మదిగా రాయాలి. కొద్దిసేపటి తర్వాత దూదితో తుడిచి కడగాలి.
గులాభీ నీళ్లలో దూదిని ముంచి కళ్ల మీద అరగంట పాటు ఉంచాలి. ఇలా చేస్తే అలసిన కళ్లకు హాయిగా ఉండటమే కాదు సమస్య దూరమవుతుంది.
7. నాలుగు మెంతి ఆకులను మెత్తగి రుబ్బి కళ్లకింద నల్లటివలయాల మీద పూతలా వేసి మర్దన చేస్తే ఆ ప్రాంతంలో రక్తప్రసరణ సక్రమంగా జరిగి చర్మం మీద నలుపు పోతుంది.
8. రెండు చెంచాల టమాటారసంలో తగినంత పసుపు నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి మిశ్రమంలా తయారు చేసి నల్లగా ఉన్న ప్రాంతంలో పూత వేయాలి. ఆరాక కడిగేస్తే సరిపోతుంది.
9. కంటికి మేకప్ సామాగ్రే విషయంలో మార్కెట్ లో దొరికే ప్రతి వస్తువునూ కొని ఉపయోగించకూడదు. మస్కారా, ఐ లైనర్, కాటుక వంటివి కొనేటప్పుడు పేరున్న కంపెనీలవి మాత్రమే ఉపయోగించాలి.
10. ఒక టీస్పూన్ పెసర పిండి తీసుకుని అందులో చిటికెడు పసుపు, ఒక టీస్పూన్ టొమాటో గుజ్జు, అర టీస్పూన్ నిమ్మరసం కలిపి పేస్టుల చేసుకుని కళ్ళ చుట్టూ ప్యాక్ ల వేసుకోవాలి. ఒక అరగంట తరువాత తడిపిన దూదితో తొలగించాలి.



Click it and Unblock the Notifications