Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పరిమళ భరతమైన బాడీ మసాజ్...!

రబ్బర్ గ్లాస్, డ్రాపర్ టాప్స్ ఉండే ఎస్పెన్సియల్ ఆయిల్స్ కి దూరంగా ఉండటమే మంచిది. ఎసెన్షియల్ ఆయిల్స్ ఎంతో చిక్కనైనవి. రబ్బరును జిగురుగా మార్చేస్తాయి. ఫలితంగా నూనె ఉపయోగపడకుండా పోతుంది. ఆరోమా థెరెఫీ గురించి సాధ్యమైనంత వరకు చదివి తెలుసుకోవడం మంచిది. ఆరోమా థెరఫీ మొదలు పెట్టడం ఎంతో సులభం. అయితే వాటిని వినియోగించడంలో కొన్ని భద్రతలను తీసుకోవాలి.
ముఖ్యంగా ఆరోమా థెరపీ గురించి తెలుసుకొన్నాకా..మార్కెట్లో ఏవి పడితే అవి కొనేయకుండా, ఎసెన్సియల్ ఆయిల్స్ ను ఎంపిక చేసుకుని కొనడం మంచిది. ఎసెన్సియల్ ఆయిల్ నాణ్యత విషయంలో కంపెనీకి కంపెనీకి మధ్య తేడాలుంటాయి. ఆయిల్స్ కొనేటప్పుడు నిజమైనవి పసిగట్టడం నేర్చుకోవాలి. అదేలాగంటే అనిస్, ల్యావెండర్, బే, సెడార్ వుడ్, యూకలిప్టస్ ఎసెన్షియల్ ఆయిల్స్ తయారు చేయడానికి వాడే మొక్కల సాధారణ పేర్లు. ఉదాహరణకు రెండు ఒకేరకమైనవైనా ధరల్లో ఎలా వ్యత్యాసం ఉంటుందో అలాగే వాటి గుణంలో, సువాసనల్లో చాలా తేడాలుంటాయి.
ఆరోమా థెరపీకి వినియోగించే ఆయిల్స్ ఏదేశానివో, ఏ కంపెనీవో కనుక్కొని, మంచి బ్రాండ్ ఉన్న వాటినే కొనుగోలు చేసుకోవాలి. అవికూడా సహజసిద్దంగా తయారు చేసినవా లేక స్థానికంగా అందుబాటులో ఉన్న సహజవనరులతో చేసినవా అన్న విషయం గుర్తుంచుకోవాలి. అక్కడక్కడా రోడ్లమీద పెట్టుకుని అమ్మే వారి దగ్గర, ప్రదర్శనల్లో తక్కువ కాలపు సందర్భాల్లో ఆయిల్స్ కొనకపోవడమే మంచిది. ఆరోమా థెరఫీ తైలాలను నల్లటి గ్లాసులో నింపి చల్లటి చీకటి ప్రదేశంలో భద్రపరచాలి. చెక్కబాక్సుల్లో భద్రపరచుకుంటే అవి ఉపయోగించాలనుకొన్నప్పుడు వాటిని ఒకచోటునుంచి మరొక చోటికి సులభంగా తీసుకెళ్ళవచ్చు.



Click it and Unblock the Notifications