For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పరిమళ భరతమైన బాడీ మసాజ్...!

|

Essential Oils for Aromatherapy Massage
మార్కెట్ లో మనకు చాలా రకాల తైలాలు దొరుకుతాయి. చాలా వరకు పరిమళ తైలాలు, ఎసెన్షియల్ అయిల్స్ లాగే ఉన్నా..అవి వైద్య పరమైన లాభాలను పూర్తిగా అందజేయవు. ఎసెన్సియల్ ఆయిల్స్ కొనేముందు ఒకటికి రెండు సార్లు పరీక్షించుకోవడం మంచిది. సువాసనల కోసం జీవనశైలిలో ఆరోమా థెరపీని వాడాలని అనుకొన్నప్పుడు, మనం వాసనలు చూసే సువాసనలైన, పరిమళ భరితమైన నూనెలు చికిత్సాపరమైన లాభాలు సమకూర్చుతాయి. అంతే కానీ సువాసనులు వచ్చే సాధార నూనెలు వాడటం నిరుపయోగమే..

రబ్బర్ గ్లాస్, డ్రాపర్ టాప్స్ ఉండే ఎస్పెన్సియల్ ఆయిల్స్ కి దూరంగా ఉండటమే మంచిది. ఎసెన్షియల్ ఆయిల్స్ ఎంతో చిక్కనైనవి. రబ్బరును జిగురుగా మార్చేస్తాయి. ఫలితంగా నూనె ఉపయోగపడకుండా పోతుంది. ఆరోమా థెరెఫీ గురించి సాధ్యమైనంత వరకు చదివి తెలుసుకోవడం మంచిది. ఆరోమా థెరఫీ మొదలు పెట్టడం ఎంతో సులభం. అయితే వాటిని వినియోగించడంలో కొన్ని భద్రతలను తీసుకోవాలి.

ముఖ్యంగా ఆరోమా థెరపీ గురించి తెలుసుకొన్నాకా..మార్కెట్లో ఏవి పడితే అవి కొనేయకుండా, ఎసెన్సియల్ ఆయిల్స్ ను ఎంపిక చేసుకుని కొనడం మంచిది. ఎసెన్సియల్ ఆయిల్ నాణ్యత విషయంలో కంపెనీకి కంపెనీకి మధ్య తేడాలుంటాయి. ఆయిల్స్ కొనేటప్పుడు నిజమైనవి పసిగట్టడం నేర్చుకోవాలి. అదేలాగంటే అనిస్, ల్యావెండర్, బే, సెడార్ వుడ్, యూకలిప్టస్ ఎసెన్షియల్ ఆయిల్స్ తయారు చేయడానికి వాడే మొక్కల సాధారణ పేర్లు. ఉదాహరణకు రెండు ఒకేరకమైనవైనా ధరల్లో ఎలా వ్యత్యాసం ఉంటుందో అలాగే వాటి గుణంలో, సువాసనల్లో చాలా తేడాలుంటాయి.

ఆరోమా థెరపీకి వినియోగించే ఆయిల్స్ ఏదేశానివో, ఏ కంపెనీవో కనుక్కొని, మంచి బ్రాండ్ ఉన్న వాటినే కొనుగోలు చేసుకోవాలి. అవికూడా సహజసిద్దంగా తయారు చేసినవా లేక స్థానికంగా అందుబాటులో ఉన్న సహజవనరులతో చేసినవా అన్న విషయం గుర్తుంచుకోవాలి. అక్కడక్కడా రోడ్లమీద పెట్టుకుని అమ్మే వారి దగ్గర, ప్రదర్శనల్లో తక్కువ కాలపు సందర్భాల్లో ఆయిల్స్ కొనకపోవడమే మంచిది. ఆరోమా థెరఫీ తైలాలను నల్లటి గ్లాసులో నింపి చల్లటి చీకటి ప్రదేశంలో భద్రపరచాలి. చెక్కబాక్సుల్లో భద్రపరచుకుంటే అవి ఉపయోగించాలనుకొన్నప్పుడు వాటిని ఒకచోటునుంచి మరొక చోటికి సులభంగా తీసుకెళ్ళవచ్చు.

English summary

How to Choose Essential Oils for Aromatherapy Massage...! | మత్తెక్కించే మసాజ్...!

Sometimes the body’s muscle or bone injuries and one position in a collision, accident, or stroke. If it is so, chemical drugs will not fully help you. Therefore we need the massage therapy. The objective is to restore the position of the bone / muscle as before, or fix it so as not to become more badly. By utilizing the effects of aromatherapy, massage which also a combination of various techniques is more complete with aromatherapy benefits provided. Each aromatherapy has its own advantages, there is which effect of relaxation there is which cure or treatment. With the application of this aromatherapy massage, then the effect will be the maximum.
Story first published:Tuesday, April 24, 2012, 13:53 [IST]
Desktop Bottom Promotion