Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బ్రాల ఎంపిక సరైనదైతే అందంతో పాటు ఆరోగ్యం కూడా...
ప్రస్తుతం నడుస్తున్న ఈ ఫాస్ట్ జనరేషన్ లో కూడా అనేకమంది మహిళలు బ్రా కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. అందుకు కారణం పురుషులు సేల్స్ మెన్ లుగా ఉండే షాపుల్లో అయితే పరిస్థితి మరీ దారుణం. బ్రాలను అడిగి, పరిశీలించి కొనుగోలు చేయాలన్నా సిగ్గుపడుతూ, చేతికి అందినదాన్ని తీసుకుని తిరుగుముఖం పడుతున్నారు.

తీరా ఇంటికి వచ్చిన తర్వాత వేసి చూసుకుంటే అది వదులుగానో, బిగుతుగానో ఉండటాన్ని గ్రహించి, దానిని బయటకు చెప్పుకోలేక లేదా తిరిగి వెళ్ళి మార్పు చేసుకోలేక అలాగే ధరిస్తున్నారు. బ్రా అంటే కేవలం అందం కోసమేనని అందరూ అనుకుంటారు కానీ, అది ఆరోగ్యానికి కూడా పలు రకాలుగా మేలు చేస్తుందన్న విషయాన్ని చాలా మంది విస్మరిస్తున్నారు. సరైన సైజు బ్రాలు వాడితే మెడనొప్పి, వెన్నునొప్పి, తలనొప్పి వంటివాటిని దూరంగా ఉంచవచ్చు. అంతేకాదు.. బ్రా ఎంపిక లోపాలే రొమ్ము క్యాన్సర్ కు పలు సందర్భాల్లో కారణభూతమవుతుందని చాలా మంది నిపుణులు అంటున్నారు.
బ్రాలలో పలు రకాలు: సాధారణంగా మహిళలు ధరించే బ్రాలలో సాధారణ బ్రా, స్పాంజ్ బ్రా వంటి అనేక రకాలైన కప్ సైజులతో ఉంటాయి. అందులో నైలాన్, కాటన్ బ్రాలు ముఖ్యమైనవి. మీరు ఎన్నుకొనే బ్రా కొంచెం కూడా స్తన భాగం బయటకు రాకుండా ఉండేవిధంగా ఉండాలి. కప్ సైజ్ బ్రాను కొనుగోలు చేయడంలో ఉన్న ఆసక్తిని, స్ట్రాప్ ఎంపికలోనూ చూపాలి. వెడల్పు తక్కువగా ఉండే స్ట్రాప్ లు వక్షోజాలను సరైన రీతిలో ఉంచలేవు.
అలాగే ముందువైపు హుక్కులు ఉండే బ్రాలు కూడా వాటికి ఇబ్బంది కలిగిస్తాయి. స్త్రీలు అటువంటి సమయాల్లో సరైన సైజుగల బ్రాలను వాడటం చాలా అవసరం. బ్రాలను వాడకపోతే వక్షోజాలు వదులుగా, జారిపోయినట్లుగా ఉంటాయి. పాలు పట్టే పిల్లల తల్లులైతే డబుల్ కప్ టైప్ బ్రా తొడుక్కోవడం ఎంతైనా అవసరం. వ్యాయామం చేసేటపుడు కూడా బ్రాను కచ్చితంగా తొడుక్కోవాలి. ఎటువంటి కాలంలోనైనా కాటన్ బ్రాలు తొడుక్కోవడం మంచిది.
బ్రాల ఎంపిక ఎలా ఉండాలి..? ఎల్లప్పుడూ ఐదు రకాల బ్రాలు అందుబాటులో ఉండేటట్లు చూసుకోవాలి. 1. అన్ని రకాల ఆకృతులకు సరిపోయే ఫుల్ కప్ సైజు బ్రాలు, 2. మెడవరకూ ఉండే జాకెట్ తొడుక్కునేటప్పుడు దానికి తగిన బ్రా, 3. పాలు ఎక్కువగా పట్టే సమయంలో కూడా తొడుక్కునేందుకు వీలైన బ్రా, 4. నైటీ వంటి దుస్తులు ధరించినపుడు అందుకు సరైన విధంగా ఉండే ఈజీ బ్రా, 5. చుడీదార్, మిడ్డీ వంటి దుస్తులను ధరించినపుడు వాటికి అనువుగా ఉండే బ్రా. ఇటువంటి రకాలైన బ్రాలు ఒకే రంగులో కాకుండా అనేక రంగుల్లో ఉండటం కూడా అవసరం.



Click it and Unblock the Notifications