Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
అలసిన పాదాలకు..రిలాక్సింగ్ మసాజ్....

ప్రతి నిత్యం మనం నడుస్తూ కాళ్లను ఎంత ఒత్తిడికి గురి చేస్తున్నామో ఎప్పుడైనా ఆలోచించారా? పలుచగా సున్నితంగా ఉండే పాదాలపైన 60-65 కిలోల బరువున్న మనిషి రోజుకు 2.5 మిలియన్ పౌండ్ల ఒత్తిడి కలగజేస్తాడట. ఇంకాస్త బరువెక్కుతుంటే ఒత్తిడి కూడా ఇంకా పెరుగుతుందన్న మాట. ఈ వత్తిడి కారణంగా పాదాల పగుళ్లు, ఇన్ఫెక్షన్లు, కీళ్ళనొప్పులు రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈసారి కాస్త ఎక్కువ నడిచి కాళ్లు, పాదాలు నొప్పులు పుట్టినప్పుడు కాస్త సమయం కేటాయించి ఈ విధంగా చేయండి. నొప్పులు మటుమాయం అవడమే కాదు, హాయిగా నిద్రపడుతుంది.
శారీరక బరువు పడేకొద్దీ మడమల్లోని కొవ్వు పక్కలకు వ్యాపించాలని ప్రయత్నించి చర్మాన్ని పగుళ్లు బారేలా చేస్తుంది. దీనికి ఇతర ప్రేరకాలు తోడైతే కాలి పగుళ్ల సమస్య దీర్ఘకాలపు ఇబ్బందిగా మారుతుంది. శరీరంలో మామూలు ప్రదేశాల్లో చర్మం నునుపుగా సమాంతరంగా ఉంటుంది. అయితే ఒత్తిడి పడేచోట మాత్రం అదనపు రక్షణకోసం మందంగా తయారవుతుంది. కాలి పగుళ్ల సమస్య పురుషుల్లో కంటే స్త్రీలలో అధికంగా కనిపిస్తుంది. వీటికి కారణాలు పాదాలు నీళ్లలో నానుతుండటం, ఇంట్లో చెప్పులు లేకుండా తిరుగుతుండటం, హార్మోన్లలోపాలు మొదలైనవి.
1. ముందుగా పాదాల్ని గోరువెచ్చేని నీటిలో 5-10నిమిషాల పాటు నాననివ్వాలి. తర్వాత బయటకు తీసి పొడి బట్టతో తడిని పూర్తిగా తుడిచేయాలి.
2. తర్వాత కుర్చీలో కూర్చొని రిలాక్స్ అవ్వాలి. కాళ్ళు, చేతులు ఫ్రీగా వదిలి కూర్చోవాలి. కూర్చొనే చోటు కూడా మసాజ్ చేయడానికి వీలుగా ఉండేటట్లు చూసుకోవాలి.
3. ఒక కుర్చీలో కూర్చుని ఒక మోకాలి మీద మరో పాదాన్ని చేర్చండి. ఏదైనా నూనె లేదా మాయిశ్చరైజింగ్ లోషన్ తీసుకొని పదానికి రాయండి. ఆయిల్ పాదం మొత్తం పైన, క్రింద బాగా రాయాలి.
4. రెండు చేతుల బొటనవేళ్లలో పాదం వంపు దగ్గర నుంచీ పైకి మెల్లగా ఒత్తండి. ఇలా ఐదుసార్లు చేయాలి.
5. ఇప్పుడు చెయ్యి గుప్పట మూసి కాలి మడమల దగ్గర నుంచి పైకి వేళ్ళవైపుకు ఐదుసార్లు రుద్దాలి. అలాగే పాదం మిడిమ దగ్గర పట్టుకిని కాళ్ళ ఫ్రీగా వదిలి కప్పులా కాళ్ళను నిదానంగా తిప్పాలి.
6. కాలివేళ్లను ఒక్కోదాన్ని కూడా మెల్లగా మర్దనా చేసినట్లు రుద్దాలి. వేళ్ల మధ్యలో కూడా చేతివేళ్ళను పోనిచ్చి రుద్దితే రక్త సరఫరా బాగా జరుగుతుంది. పైపైన రుద్దకుండా కాస్త ఒత్తిడిని కలిగించాలి.
7. కాలివేళ్లన్నిటినీ చేత్తో పట్టుకుని అన్నిటినీ ఒకేసారి వెనక్కి వంచి ఓ పదిసెకన్లు అలాగే పట్టుకొని వదిలి వేయాలి. ఇలా రెండు మూడుసార్లు చేయాలి. ఈ విధంగా రెండు పాదాలకూ చేస్తే అలసట అనేది మటూమాయం అవుతుంది.



Click it and Unblock the Notifications