For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వక్షోజాల ఆకృతిపై మహిళల ఆందోళన...?

|

How to increase Breast Size Naturally..?
సాధారణంగా కొంత మంది ఆడవారికి వక్షోజాలు ఆకృతిలో తేడాలు కనిపిస్తుంటాయి. దీంతో వారు ఆందోళన చెందుతుంటారు. కొంతమంది మహిళల్లో ఇవి అరుదుగా కనిపిస్తున్నాయి. రెండు వక్షోజాల పరిమాణంలో స్వల్ప తేడాలు ఉంటాయి. దీంతో గాబరా పడే ఆడవారు.. ప్లాస్టిక్ సర్జరీకి వైపు మొగ్గు చూపుతారు. సైజుల్లో తేడాలు ఉన్న ప్రతి ఒక్కరు సర్జరీని చేయించుకోవాల్సిన అవసరం లేదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే ఇది అధిక ఖర్చుతో కూడుకున్న పని. అందువల్ల పేద, మధ్య తరగతి యువతులకు ఇది అందని ద్రాక్షలాంటింది. కానీ.. ప్లాస్టిక్ సర్జరీకి ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నో ఉన్నాయంటున్నారు వైద్యులు. ఉదాహరణకు ఒక మహిళ తన వక్షోజాల పరిమాణంలో తేడాలు ఉన్నాయని గుర్తించిన పక్షంలో ఈ లోపాన్ని తాను ధరించే దస్తులు ద్వారానే భర్తీ సరి చేసుకోవచ్చు.

తాను ధరించే జాకెట్‌ లోపలి భాగంలో మన ఆకారానికి తగినట్లుగా ప్యాడ్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటితో సర్దుకోవచ్చు. చిన్నగా ఉండటానికి, పెద్దవిగా అవడానికి కూడా శరీరాకృతులు మార్చుకునే రీతిలో కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‌లు చేయవచ్చు. సాధారణంగా వక్షోజాల పరిమాణాన్ని పెంచుకునే పద్ధతిని మామోప్లాస్టీ ప్లాస్టిక్‌ సర్జరీ అంటారు.

తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే చేయించుకోవడం ఉత్తమం. నిపుల్స్ (చనుమొనలు) విషయంలో కూడా చాలా మంది ఆడవారికి భయాందోళనలు ఉంటాయి. సెక్స్ స్పందనలు లేనప్పుడు అవి లోపలికి కుంచించుకు పోతాయి. ఎపుడైతే తమలో కామవాంఛలు ఏర్పడతాయే.. ముందుకు పొడుచుకువస్తాయి. చాలా మంది ఈ విషయాన్ని సీరియస్‌ గా తీసుకుంటారు.

తమకు బ్రెస్ట్ క్యాన్సర్‌ సోకడం వల్లే చనుమొనలు లోపలికి ముడుచుకు పోయాయని భావిస్తారు. నిజానికి ఇదంతా అపోహ మాత్రమే. అయితే బ్రెస్ట్ క్యాన్సర్‌ లక్షణాలు వేరే విధంగా ఉంటాయి. చేతితో తడిమి చూసుకున్నప్పుడు గడ్డలుగా తగులుతుంటాయి. హార్మోన్లలో మార్పులు కూడా వక్షోజాల పరిమాణాన్ని నిర్ధేశిస్తుంటాయి. వీటన్నింటిని గమనిస్తూ ఉండాలి. అవసరమైతే లేడీ డాక్టర్‌ను సంప్రదించి తగిన వైద్య చికిత్స తీసుకోవాల్సి వుంటుంది.

English summary

How to increase Breast Size Naturally..? | వక్షోజాల పరిమాణంలో తేడాలా...?

Many women want larger breasts, but find it difficult to buy flattering clothes due to a flat chest. Estrogen is the main hormone responsible for breast growth and development. As a teen, a girl will start to grow breast tissue and usually require larger bra sizes each year. Some girls might hit a plateau during breast development. While the exact reason for underdeveloped breasts is unknown, some speculate that this is due to a decrease in estrogen in the female body and an increase in testosterone. Certain foods and exercises can help reverse these problems.
Story first published:Thursday, August 2, 2012, 8:40 [IST]
Desktop Bottom Promotion