Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
అలసిన కళ్ళు కోసం

టీవీల ముందు, కంప్యూటర్లముందు గంటలతరబడీ గడపటంవల్ల క్రమంగా కంటికి సంబంధించిన సమస్యలబారిన పడతారు. సరైన నిద్రలేని కారణంగా కళ్లకింద నల్లటి చారలు, కంటిచూపు మందగించటం, కళ్లలో మంటలు, కళ్లలోంచి నీరు కారటం.. లాంటివన్నీ క్రమంగా ఒకదాని తరువాత ఒకటిగా వేధిస్తాయి. ఇలాంటి సమస్యల పాలవకుండా.. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే గాకుండా, మిలమిలా మెరిసే అందమైన కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
1. ఉదయం పూట రెండు బాదం పప్పులను కొంచెం పాలలో నానపెట్టాలి. రాత్రి వాటిని మెత్తగా చేసుకుని ఆ పేస్ట్‌ను కళ్ళచుట్టూ రాస్తే బ్లాక్ సర్కిల్స్ పూర్తిగా మాయమైతాయి.
2. ఎండవేడిని తట్టుకునేందుకు వాడే సన్ స్క్రీన్ లోషన్లు వంటి వాటిని బయటికి వెళ్ళేటప్పుడే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాడండి.
3. ఎప్పుడూ ఏదో ఒక వస్తువును తీక్షణంగా రెప్పవేయకుండా చూస్తూ కళ్ళపై ఒత్తిడి తీసుకురాకండి.
4. కళ్లకు విశ్రాంతినివ్వాలంటే.. ప్రతి రెండు గంటలకోసారి చేస్తున్న పనికి కాస్త బ్రేక్ ఇవ్వాలి. ఒకటి రెండు నిమిషాలు కళ్లు మూసుకుని, ఆ తరువాత చూపుడు వేలుని రెండు కళ్లమధ్య ఉంచి, కాసేపు తదేకంగా ఆ వేలుని చూడాలి. ఆపై వేలుని కళ్లకు మరీ దగ్గరగా, కాసేపు దూరంగా ఉంచి… కళ్లను పైకి, కిందకు, కుడి ఎడమలకు, గుండ్రంగా తిప్పుతూ చూడాలి. ఇది కళ్లకు చక్కటి వ్యాయామంగా పనిచేసి అలసటను దూరం చేస్తుంది. కళ్లకు సాంత్వన లభిస్తుంది.
5. కళ్ళ కిందభాగం ఉబ్బినట్టు ఉంటే రెండు టీ బ్యాగులను వేడినీటిలో కొంచెం సేపు నాంచి ఆ తర్వాత వాటిని కళ్ల మీద 20 నిమిషాలపాటు పెట్టుకోవాలి.



Click it and Unblock the Notifications
