For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెమట.. దుర్వాసన నుండి విముక్తి పొందండిలా...

|

స్త్రీల కంటే పురుషుల్లో చెమటతో వచ్చే దుర్గదం ఎక్కువ. చెమట పట్టడం మానవులలో ఒక విధంగా ఉష్ణోగ్రతను నియంత్రించే విధానం. అయితే పురుషుల స్వేదంలో కామ ప్రకోపాన్ని అధికం చేసే లక్షణాలున్నట్లుగా కనుగొన్నారు. చర్మం మీది చెమట ఆవిరిగా మారినప్పుడు శరీరం చల్లబడుతుంది. ఉష్ణ ప్రదేశాలలో శరీర వ్యాయామం చేసేటప్పుడు ఎక్కువ చెమట పడుతుంది. చెమట మానసిక ఒత్తిడి వలన ఎక్కువౌతుంది. చల్లని వాతావరణంలో తక్కువగా ఉంటుంది.

చెమట కొన్ని ప్రదేశాలలో ఎక్కువగా ఏర్పడుతుంది. తల, చంకలు మరియు ముఖంలో స్వేద గ్రంధులు ఎక్కువగా ఉండడం వలన ఈ ప్రదేశాలలో చెమట పడుతుంది. అందుకు కారణం మగవారిలో ఉన్నటువంటి టెస్టోస్టిరాన్ హార్మోన్ అధికస్థాయిలో ఉండటమే. ఆ కారణం చేత మగవారిలో దుర్వాసన ఎక్కువగా ఉంటుంది. ఈ దుర్వాసన నుండి బయటపడాలంటే పురుషులు కొన్ని ప్రత్యేకమైన పద్దతుల ను లేదా మార్గాలను ఎంపిక చేసుకోవాలి.

How Men Can Control Body Odour?

1. బాత్ టబ్ స్నానం కంటే షవర్ బాత్ చేయడం మంచిది: సాధారణంగా మహిళల బ్యూటీలో రకరకా బ్యూటీ స్పోప్స్ బాత్ టబ్ స్నానం చేసే ప్రకటనులు ఎన్నో గమనించే ఉంటాం. అయితే పురుషు వాణిజ్య ప్రకటణలు గమనించి నట్టైతే వారు షవర్ బాత్ తో స్నానం చేయడాన్ని ఎక్కువగా చూపిస్తుంటారు. ఎందుకంటే షవర్ బాత్ చేసుకోవడం వల్ల నీటి దార శరీరంపై ఫోర్స్ గా పడి శరీరంలోని మలినాలను వదలగొట్టి బాగా శుభ్రపరిస్తుంది. కాబటి మహిళలతో పోల్చితే పురుషులకు బాత్ టబ్ కన్నా షవర్ బాత్ మిన్న.
2. చేతి పిక్కలు(చంకల క్రింద)తరచూ షేవ్ చేస్తుండాలి: చెమట ఎక్కువగా బహుమూలల్లో నుండి వస్తుంది కాబట్టి. శరీరంలో బహుమూలన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రెగ్యులర్ గా షేవ్ చేస్తుండాలి. అప్పుడు చంకల క్రింద వెలువడే చెమట వాసన దూరం చేసుకోవచ్చు.

3. శరీరం నుండి వెలువడే చెమట వల్ల శరీరంపై ఉన్నబ్యాక్టీరియాతో చేరి చెమట దుర్వాసనగా మారడానికి దారితీస్తుంది. కాబట్టి చర్మ రంద్రాలను శుభ్రపరుచుకోవడానికి స్నానం చేసేటప్పుడు స్క్రబర్ ను ఉపయోగించి శరీరాన్ని బాగా రుద్ది స్నానం చేయడం వల్ల చర్మ రంధ్రాలు తెరచుకొని శుభ్రపడుతాయి. ఇలా వారానికి కనీసం రెండు సార్లు చేసినా సరే. దాంతో చెమట పట్టినా దుర్వాసనకు దారితియ్యదు. పురుషుల చర్మం చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి సాధారణ స్ర్కబ్ కంటే కొంచెం మేలైనది ఎంచుకోవాలి.

4. స్నానం చేసిన తర్వాత శరీరాన్ని పూర్తిగా కాటన్ టవల్ తీసుకొని తడి ఆరేదాక తుడిచిన తర్వాత శరీరానికి ఆస్ట్రిజెంట్ ను అప్లై చేయాలి. ఆస్ట్రిజెంట్ ను అప్లై చేయడం వల్ల చర్మం మీద ఉన్న అతి సూక్ష్మమైనటువంటి బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. ఆస్ట్రిజెంట్ చర్మంలోకి త్వరగా ఇంకిపోతుంది. కాబట్టి ఆస్ట్రిజెంట్ ను ఉపయోగించడం వల్ల కూడా చెమట నుండి బయట పడవచ్చు.

5. జింక్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి: పురుషుల్లో జింక్ లోపం కూడా శరీరంలో దుర్వాసనకు కారణం కావచ్చు. కాబట్టి జింక్ అధికంగా ఉన్నఆహారంను తీసుకోవాలి. జింక్ ఎక్కువగా ఉన్నటువంటి రెడ్ మీట్, ఆకుకూరలు, పాలు వంటి వాటిని ఎక్కువగా తినాలి.

7. కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి: కాఫీలో కెఫిన్ అధికంగా ఉంటుంది. టీ మరియు కోలా వంటి వాటిని తీసుకోవడం వల్ల పురుషుల్లో అధికంగా టెస్టోస్టిరాన్ హార్మో ఉత్పత్తి అయ్యి. చెమట పట్టడం, దుర్వాసనకు కారణం అవుతాయి. కాబట్టి కాఫీ, టీ, కోలా వంటి వాటిని మితంగా తీసుకోవడం మంచిది. వీటితో పాటు ఘాటు వాసన వచ్చే ఆహారపదార్థాలు వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండటమే మంచిది. సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా త్రాగాలి.

8. రెండుపూటలా స్నానం చేయండి.స్నానం చేసేటప్పుడు డెట్టాల్, యుడుకొలోన్, రోజ్ వాటర్ వీటిలో ఏదైనా కొన్ని చుక్కలు కలుపుకుని స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత మంచి కంపెనీకి చెందిన బాడీ స్ప్రే వాడండి. ఎవరికైతే తమ చెమటలోంచి భరించలేనంత దుర్గంధం వస్తుందో వారు బాత్ సాల్ట్ నీటిలో కలిపి స్నానం చేయండి. సువాసనను వెదజల్లే పౌడరు వాడండి. స్నానం చేసిన తర్వాత మీరు ధరించే బట్టలపై పర్ఫ్యూమ్ వాడండి. ఆ పర్ఫ్యూమ్ ఇతరులకు ఇబ్బందిగా ఉండకూడదు.

Read in English

English summary

How Men Can Control Body Odour? | చెమట నుండి విముక్తి పొందండిలా...

Do you agree that men stink much more than women? It is not a gender-war statement. It has been proved scientifically that men have more pungent body odour than women. It is a well known fact that men stink primarily due to the higher levels of testosterone (male hormone) in their body. To contour this problem, men must adopt different ways of fighting body odour.
Desktop Bottom Promotion