For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డియోడరెంట్స్..పెర్‌ప్యూమ్స్‌ వాడకంలో మెలకువులు...!

|

How to Use Perfumes and Deodorants
ప్రస్తుతం సుసపన్న స్త్రీలు మాత్రమే కాదు..మధ్యతరగతి స్త్రీలు, టీనేజ్ గర్ల్స్, కాలేజ్ గర్ల్స్, ఉద్యోగినులు ఇలా ఒక్కరేంటి ప్రతి ఒక్కరూ ఫెర్ ఫ్యూమ్స్, సెంట్స్, డియోడెరెంట్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అత్తరులూ, సెంట్స్‌, పెర్‌ఫ్యూమ్స్‌, ఎలాంటి 'ఫ్యూమింగ్‌ గరల్స్‌' నయినా, ఎంతటి 'బూమింగ్‌ పార్ట్‌నర్స్‌' నయినా, 'కూల్‌' చెయ్యకుండా ఉండవు. కనుక, వాళ్ల ఇష్టాఇష్టాలూ, టేస్ట్స్‌ అడగకుండానే తెలుసుకుని, పెర్‌ ఫ్యూమ్స్‌ ప్రైజెస్‌ తో, సర్‌ ప్రైజ్‌ చేస్తుంటారు కొందరు లవర్స్...

అందంగా అలంకరించుకుంటే ఉన్న అందానికి తోడు మరింత అందం సొంతమవుతుంది. నలుగురిలో వున్నప్పుడు అలాంటి అందం ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది. మనం వాడే సెంటు అందాన్నివ్వకపోవచ్చు. కానీ అలంకరణ కంటే ప్రత్యేకతను సొంతం చేస్తుంది. పది అడుగుల దూరం నుండి సెంటు పరిమళాన్ని గుర్తించి మనిషిని చూడకుండా ఎవరొస్తున్నారో తేలిగ్గా చెప్పేయొచ్చు. సువాసనకు అంత గుర్తింపు ఉంది.

పెర్ఫ్యూమ్స్, సెంట్ వాసనలు ఎక్కువ సేపు ఉండాలంటే సెంటును స్ప్రే చేసే చోట కాస్త పెట్రోలియం చెల్లీని అప్లై చేయాలి. లేదా పెర్ ఫ్యూమ్ ని స్ప్రే చిసిన తర్వాత అక్కడ కొద్దిగా టాల్కం పౌడర్ ని అద్ది తిరిగి సెంట్ స్ప్రే చేస్తే సెంటు వాసన చాలా సేపు నిలిచి ఉంటుంది.

డియోడరెంట్స్‌: వాస్తవానికి వీటిని నేరుగా చర్మం మీద స్ప్రే చేసుకోకూడదు. బట్టల మీదో, దూరం నుంచో స్ప్రే చెయ్యాలి. కానీ చాలామంది నేరుగా వాడతారు. వీటిలో బిథియొనాల్‌ వంటి 'క్లోరినేటెడ్‌ ఫినాల్స్‌' ఉంటాయి. వీటిని స్ప్రే చేసుకుని, సూర్యరశ్మిలోకి వెళితే 'ఫోటో సెన్సిటైజేషన్‌' వచ్చి, నల్లగా అయిపోవచ్చు. చంకల్లో చర్మం నల్లగా, దళసరిగా మారటం, దురద, అక్కడి చర్మం బాగా పల్చబడి నీరుగారుతుండటం వంటి సమస్యలన్నీ వస్తాయి.

పర్‌ ఫ్యూమ్‌: కేవలం అత్తర్లు, సెంటు, పర్‌ ఫ్యూములే కాదు.. ప్రతి సౌందర్య సాధనంలోనూ సువాసన కోసం వీటిని ఎంతోకొంత కలుపుతారు. ఇవి చర్మానికి తగిలినప్పుడు అలర్జీ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. వీటివల్ల చర్మం మీద రకరకాల అలర్జీలు, నలుపు లేదా తెలుపు మచ్చలు వస్తాయి. కాబట్టి పర్‌ ఫ్యూములను దుస్తుల మీదే స్ప్రే చేసుకోవాలి. నేరుగా చర్మం మీద తగలనివ్వకుండా చూసుకోవటం చాలా అవసరం.

English summary

How to Use Perfumes and Deodorants...? | డియోడరెంట్స్..పెర్‌ప్యూమ్స్‌ వాడుతున్నారా..?

People have always wanted to smell good. Millions of people around the world use perfumes to make themselves, their homes, cars and other valuables smell good. Perfume and the outdoors have their advantages and disadvantages. The advantages are that you can wear perfumes that smell just like our favorite flowers, fruits, or even places. The downside to this is that wearing perfumes that are sweet and strong can cause a big problem. There are certain bugs and insects that find these scents particularly appealing.
Story first published:Thursday, March 22, 2012, 13:30 [IST]
Desktop Bottom Promotion