For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాలెంటైన్ డే.. అందమైన అధర సౌందర్యం..!

|

Lipstick Application Tips
అందంతో పాటు ఆత్మ సౌందర్యం పెంపొందించుకోవాలంటే ఆయా శరీరాల స్వభావాన్ని బట్టి సౌందర్య సాధనాలను ఉపయోగించాలి. మాట మనసుని ఆకర్షిస్తే పెదాలు కంటిని కవ్విస్తాయి. పెదాలతో సైగలు చేస్తే చాలు కొన్నిసార్లు మాటలు అవసరముండవు. చిరు నవ్వు నవ్వినా, కోపాన్ని, సంతోషాన్ని వ్యక్తపరిచే వాటిలో పెదవులూ పాలు పంచుకుంటాయి. బుంగ మూతికి అంత అందాన్ని తెచ్చిపెట్టేవి కూడా పెదవులే. అటువంటి అధర సౌందర్యం మరింత పెంచుకోవడం కోసం...

1. పింక్ లేదా ఎర్రటి గులాబి రంగు లేదా: రెండు రంగుల లిప్‌ స్టిక్‌ లు గాఢమైన అనుభూతిని ఇస్తాయి. అయితే ఎర్రని రంగు కలిగిన ఉన్నవారికి అయితే ఈ రంగులు బాగా సూట్ అవుతాయి. అందుకే పెదవుల రంగుతోపాటు శరీర రంగును కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రంగుల లిప్‌ స్టిక్‌ లను వాడితే సరిపోతుంది.
2. ఆరెంజ్ లేదా ఎల్లో: ఈ రంగులు సున్నితమైన భావాలను కలిగిస్తాయి. ముదురురంగు శరీరం కలిగినవారు ఈరంగు లిప్‌స్టిక్‌లను వాడితే సరిపోతుంది. అంటే తెలుపు, లేదా ఎరుపురంగు చర్మంగలవారు వీటిని ఉపయోగించాలి. పాలిపోయిన రంగు శరీరం కలవారికి ఈ రంగుల లిప్‌స్టిక్ నప్పదు.
3. బ్లూ, గ్రీన్: ఈ రంగు లిప్‌ స్టిక్‌ లు అవతలివారిని ఇట్టే ఆకర్షిస్తుంది. గాఢమైన ప్రభావం కలిగిన బ్లూ రంగు లిప్‌ స్టిక్‌ లను రాత్రిపూటకంటే, పగటి సమయాల్లో వాడితేనే మంచిది.
4. సిల్వర్‌, బూడిద రంగు: ఇవి రాత్రిపూట ఎక్కువగా ఉపయోగించేందుకు వీలుగా వుంటాయి. ఎందుకంటే ఇవి పెదవులకు మెరుపును ఇస్తాయి తప్ప గాఢమైన ప్రభావాన్ని కలిగించవు. దీనివల్ల పెదవులు సున్నితమైన మెరుపును కలిగి ఉంటాయి.

పెదవులు అందం ఎప్పటికీ నిలిచి ఉండాలంటే లిప్‌ స్టిక్‌ని అపై్ల చేసే ప్రతీసారి సన్‌స్క్రీన్‌ లోషన్‌ వాడాలి. సూర్యకిరణాలు పడినప్పుడు ఎక్కువగా కమిలేవి పెదవులే. పెదవులు మెరుస్తూ కనిపించాలంటే లిప్‌స్టిక్‌ని అపై్ల చేసిన తరువాత లిప్‌గ్లాస్‌ని అపై్ల చేయాలి. దానిమీద కొద్దిగా పెట్రోలియం జెల్లీని బ్రష్‌ చేయాలి.

English summary

Lipstick Application Tips for VDay..! | అందమైన అధర సౌందర్యం....!

Whether you're happily single or blissfully bonded, Valentine's Day is bound to have you seeing red. Plush velvet hearts, bouquets of roses and store displays all showcase the color of love.
Story first published:Tuesday, February 14, 2012, 17:41 [IST]
Desktop Bottom Promotion