Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
వర్షాకాలంలో పాదాలు పదిలపరుచుకోండిలా....!

పాదాలను శుభ్రపరచుకోవడానికి గోరువెచ్చని నీరు మంచిది. సువాసనపూరితమైన యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుతో గోరువెచ్చని నీళ్లతో కాళ్లు కడుక్కోండి కాళ్లు కడిగాక నీరు దానంతట అదే ఆరుతుందంటూ అలా వదిలేయకండి. శుభ్రమైన పొడిబట్టతో పాదాలు తుడుచుకోవాలి. మరీ ముఖ్యంగా కాలివేళ్ల మధ్య తడి అంతా ఆరి పొడిబారేలా తుడుచుకోవాలి. లేకపోతే పాదాలు చెడటం మరింత ఎక్కువవుతుంది పొడిబారిన పాదాలపై టాల్కమ్ పౌడర్ వేసుకోండి. దాంతో పాదాలు చాలా సేపు పొడిగా ఉంటాయి. దాంతో ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ.
వర్షాకాలంలో ఎత్తు చెప్పులు(హీల్స్) వేసుకోక పోవడమే మంచిది. లేదు మీరు హీల్సే ధరించాలనుకొంటే, స్లిప్ కాకుండా ఉండే సాండిల్స్ ను ధరించడం మంచిది. అయితే మీల్ కాలి మడమ కంటే ఎక్కువ ఎత్తు ఉండకూడదు.
వర్షంలో ధరించడానికి ప్రత్యేకంగా రైన్ బూట్స్ , గమ్ బూట్ప్ అని మార్కెట్లో దొరుకుతాయి. వాటిని వినియోగించడం మంచిది. అవి ధరించడం వల్ల కాళ్ళకు మట్టి, బురద, బురదనీళ్లు కాళ్ళ మీద పడకుండా భద్రత కల్పిస్తాయి. అవి రబ్బర్ తో తయారు చేసినటు వంటి వాటర్ ఫ్రూవ్ కలిగినవి. లిక్రా బూట్స్ ఇవి వర్షాకాలంలో చాలా సౌకర్యవంతంగా ుంటాయి. బ్యాలెట్ ప్లాట్స్ అన్ని రకాల కాలాలు సౌకర్యవంతమైనటువంటివి.
వర్షాకాలంలో పాదాలు నీటిలో తడవడం వల్ల పాదాలు ఇన్ఫెక్షన్ కు గురై, దురద పెడుతుంటే వెంటనే ఉల్లిపాయ గుజ్జును రాస్తే తక్షణ ఉపశమనమిస్తుంది. అలాగే వర్షంలో తడిసి ఇంటికి రాగానే మురికి నీళ్ళ ప్రభావం పాదాలపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందుగా పాదాలను మంచి నీళ్లు, లేదా గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం, వెనిగర్ వేసి శుభ్రం చేసుకోవాలి. దాంతో ఇన్ఫెక్షన్ దురద వంటివి దరిచేరకుండా ఉంటాయి.
కాళ్లు ఎక్కువగా నీటిలో తడవడం వల్ల కాళ్ల వేళ్ళ మద్య నుండి చెడు వాసన వస్తుంటే, చిన్న టబ్ లో 5ఎంఎల్ పెప్పర్ మెంట్ ఆయిల్ వేసి, కాళ్ళు పొనిగేంత గోరు వేచ్చని నీళ్ళు పోసి, అందులో గుప్పెడు వేపఆకులు వేసి బాగా మిక్స్ చేయలి. తర్వాత మీ పాదాలను అందులో పదినిమిషాల పాటు నాననివ్వాలి. పదినిమిషాల తర్వాత కాళ్ళు బయటకు తీసి పొడి బట్టతో తుడిచి తడి ఆరిన తర్వాత కాళ్ళ మీద టాల్కమ్ పౌడర్ ను స్ప్రే చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చేమట పట్టకుండా చేయడమే కాకుండా వాసన కలిగించే బ్యాక్టీరియా నుండి ఉపశమనం కలిగిస్తుంది.
ఒక లోతైనటవంటి తట్ట లేదా పాత్ర లేదా బకెట్ లో పాదాలు మునిగేటన్ని నీళ్లు పోసి అందులో ఒక కప్పు వెనిగర్, కొన్ని చుక్కల థైమ్ ఆయిల్ కలపాలి. ఆ మిశ్రమంలో పాదాలను 20 నిమిషాల పాటు ఉంచాలి. థైమ్ ఆయిల్‌లోని యాంటీసెప్టిక్ గుణం పాదాలు చెడటాన్ని తగ్గిస్తుంది. అందులోని సువాసన గుణం పాదాల నుంచి వచ్చే చెడువాసనను అరికడుతుంది ఈ పాదాలకు కాటన్ సాక్స్ వేసుకోవడం మంచిది. నైలాన్ సాక్స్ వాడటం అంత సరికాదు. ఆ కాటన్ సాక్స్‌ను ప్రతిరోజూ మార్చాలి.



Click it and Unblock the Notifications