Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కీరదోసతో అందం చందం..ఆరోగ్యం...జుట్టు పెరుగుదల...

ఆరోగ్యం: కీరదోసలో ఖనిజలవణాలు ఎక్కువ. సలాడ్ గానే కాదు సూప్ గానునూ తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి, మధుమేహంతో బాధపడే వారికి, ఎసిడిటి, కీళ్ళనొప్పులు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. కీరదోసలో విటమిన్ సి, పీచు, పొటాషియం, మెగ్నిషియం సమృద్ధిగా లభిస్తాయి. అవి శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి.
చర్మం మెరుగుదల : ఇందులోగల అధిక ' సి ' విటమిన్ వల్ల చర్మ పరిస్థితి ని మెరుగుపరుస్తుంది . సౌందర్య పోషకాలలో కీరదోషకాయ తప్పక ఉంటుంది.
1. కీరదోస తురుమును ముఖానికి రాసుకుంటే చర్మంపై జిడ్డు పోతుంది. మొటిమలు, నల్లమచ్చలు దూరమవుతాయి.
2. కీరదోస రసానికి నిమ్మరసం, రోజ్‌వాటర్, కలిపి ముఖానికి రాసుకుంటే, చర్మానికి నిగారింపు వస్తుంది.
3. రెండు చెంచాల కీరరసానికి చెంచా పాలు, రోజ్ వాటర్ చేర్చి.. ముఖానికి రాసుకుని మర్దనా చేస్తే, మృతచర్మం తొలగిపోతుంది.
జట్తు పెరుగుదల : కీరదోసకాయలో గల సిలికాన్ , సల్ఫర్ ఖనిజలవణాలు జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది
1. వారానికోసారి కీర, క్యారెట్ రసాలను తలకు రాసుకుంటే, జుట్టు రాలకుండా ఆరోగ్యంగా ఉంటుంది.
2. గుడ్డులోని తెల్లసొనకు రెండు చెంచాల ఆలివ్ నూనె, కొద్దిగా కీరగుజ్జును కలిపి కుదుళ్లకు పట్టించి, అరగంటయ్యాక తలస్నానం చేస్తే సరిపోతుంది.
కళ్ళు చలువ: కీరదోషకాయ గుండ్రని ముక్కలుగా తరిగి కళ్ళపై ఉంచితే మంటలు తగ్గి ఉపశయనంతో పాటు కళ్ళు చల్లగా ఉంటాయి. వేడి తగ్గుతుంది. కళ్ళ వాపు తగ్గుతుంది.



Click it and Unblock the Notifications