Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
గోళ్ళ సంరక్షణ పద్దతులు...ఆహారం....!

క్యూటికల్ కటర్ తో గోరు చుట్టూ ఉండే డెడ్ స్కిన్ ను తొలగించాలి. క్యూటికల్ కటర్ విడిగా కొనుక్కోవచ్చు లేదా నెయిల్ కటర్ తో పాటు వచ్చే క్యూటికల్ కటర్ ను వాడవచ్చు. ఇది నెయిల్ కటర్ చివర వంపు తిరిగి ఉండే సాదనం. దీనితో క్యూటికల్స్ కట్ చేసిన తర్వాత గోరు వెంబడి ఉండి గోరు మీద పరుచుకున్నట్లు ఉండే చర్మాన్ని లోపలికి పుష్ చేయాలి.
తర్వాత గోరును అందంగా షేప్ కట్ చేయాలి. ఎక్కువమందికి ఓవెల్ షేప్ నప్పుతుంది. కొంతమందికి ఫ్లాట్ షేప్ కుదురుతుంది. వేలు తీరును బట్టి ఏది నప్పుతుందో చూసుకోవాలి. ముందుగా ఒక వేలికు ఓవెల్ షేప్ కట్ చేసి చూసుకోని నప్పలేదనిపిస్తే ఫ్లాట్ షేప్ చేసుకోవచ్చు. గోరును షేప్ చేసెటప్పుడు మొదటిగా మద్యలో కట్ చేయాలి. తరువాత పక్కల కట్ చేయాలి మరీ పొడవుగా వుండేటప్పుడు ఒకేసారి లోపలికి కట్ చేయకూడదు కొద్ది కొద్దిగా కట్ చేస్తూ పొట్టిగా చేయాలి .
షేప్ చేసిన తర్వాత గోరును ఫైలర్తో రుద్దాలి. ఫైలెర్ కూడా నైల్ కటర్లోనే వుంటుంది(చాకులాగ ఉండి సన్నని నొక్కులుండే సాదనం). దీనితో రిద్దితే గోరుకు ఉన్న గరుకుతనం పోయి నునుపు వస్తుంది. ఇప్పుడు గోళ్ళకు మసాజ్ ఆయిల్ కాని, లోషన్ కాని రాసి మరొక చేతి బొటనివేళితో గోరుమీద వలయాకారంలో తిప్పుతూ ప్రతీ గోరుకూ విడిగా మర్దనా చేయాలి. గోళ్ళకు పూర్తయ్యాక వేళ్ళకు ప్రతీ కణుపుకూ మర్దనా చేయాలి ఒక చేతికి మరొక చేతితో అలా రెండు చేతులకూ మర్దనా చేసుకోవాలి.
ఇంకా ఫోలిక్ ఆమ్లం, విటమిన్ సీ ఉండే పదార్థాలను తీసుకున్నట్లయితే గోళ్లు పెళుసుబారి విరిగిపోకుండా ఉంటాయి. వాటితోపాటుగా ఆపిల్, కోడిగుడ్లు, అల్లం, ద్రాక్ష, డ్రైఫ్రూట్స్, మొలకెత్తిన గింజలు, తృణధాన్యాలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications