Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
పరిమళ భరితమైన శరీరం కోసం..వ్యక్తిగత పరిశుభ్రత
Body Care
oi-Saraswathi
By Sindhu

1. స్నానానికి పావుగంట ముందు ఏం చేయాలంటే..నిమ్మరసం, గ్లిజరిన్ సమపాళ్లలో తీసుకొని శరీరానికి రాసుకొని చూడండి తేటగా మారిన మేని కాంతి మీ సొంతమవుతుంది.
ప్రతిరోజూ యాంటీ బాక్టీరియా సబ్బుతో స్నానం చెయ్యాలి.
2. సిల్కు, పాలియస్టర్ వంటి బట్టల వాడకాన్ని తగ్గించాలి. ఇవి చెమటను పీల్చుకోవు. దానివల్ల శరీరం చెమట వాసన వచ్చే ప్రమాదముంది. కాబట్టి కాటన్ దుస్తులు ధరించవడం మంచిది. ముఖ్యంగా లోదుస్తులు కాటన్‌వే ఉపయోగించాలి.
3. బిగుతుగా ఉండే దుస్తుల కన్నా లూజుగా ఉండేవి వేసుకోవడం వల్ల గాలి ప్రసరించేందుకు ఆస్కారం ఉంటుంది.
4. డియోడరెంట్స్ ను ఉపయోగించేవారు కొంచెం ఖరీదు ఎక్కువైనా ఎక్కువసేపు తాజాగా ఉంచే వాటిని కొనుక్కోవాలి.
5. రోజుకు రెండు కప్పుల కాఫీ, టీ మాత్రమే తాగాలి. కాఫీలో ఉండే కెఫిన్ చెమటకు కారణమయ్యే గ్రంధులను ప్రేరేపిస్తుంది.
6. స్నానం చేసేటప్పుడు చివర రెండు మగ్గుల నీళ్ళలో ఒక టీస్పూన్ తేనె కలిపి శరీరాన్ని తడిపితే చాలా సేపు ఫ్రెష్ గా ఉంటారు.
7. పుదీనా ఆకులు వేసి కాచిన నీళ్ళతో స్నానం చేసినా ఫలితముంటుంది. తినే ఆహారంలో వెల్లులి, మసాలాలు తక్కువగా ఉండాలి. రోజుకు కనీసం ఐదు లీటర్ల నీటిని తాగాలి.
8. స్నానానికి ఎప్పుడూ కూడా చల్లని నీటినే వాడాలి. ఎందుకంటే చల్లని నీటిలో అమ్లజని ఎక్కువ కరిగి ఉంటుంది. చలికాలంలో మాత్రం గోరువెచ్చని నీటితో స్నానం చేయవలెను. స్నానపుగదికూడా శుభ్రంగా వుండాలి. స్నానం చేసేటప్పుడు మొదట సబ్బుతో ఒళ్ళు రుద్దుకోవలెను. ఆ తర్వాత తగినంత నీటిలో సబ్బు పూర్తిగా పోయేంత వరకు నీళ్ళు పోసుకోవలెను. సబ్బు పూర్తిగా శరీరం నుండి తొలగకపోయినచో సబ్బు చెమట గ్రంధులను మూసివేస్తుంది.
9. చవకబారు సబ్బులను వాడటం వల్ల అవి చర్మానికి హాని కల్గిస్తాయి. వాటిలో కాస్టిక్ సోడా ఎక్కువగా ఉంటుంది. బట్టల సబ్బులను ఒళ్ళు రుద్దుకోవడానికి వాడకూడదు. ఎందుకంటే బట్టల సబ్బులలో కూడా కాస్టిక్ సోడా ఎక్కువ పరిమాణంలో వుంటుంది. శరీరానికి స్నానపు సబ్బులను మాత్రమే వాడాలి.
10. వేపుళ్లు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసం, కెఫిన్ ఉన్న పానీయాలను తగ్గించాలి.
Comments
English summary
Natural and Important Body Cleansing Tips | పరిమళ భరితమైన శరీరం కోసం..వ్యక్తిగత పరిశుభ్రత
Story first published: Monday, January 30, 2012, 17:21 [IST]
Other articles published on Jan 30, 2012



Click it and Unblock the Notifications