For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెడ సౌందర్యం మీ సొంతం కావాలంటే....

|

Natural and Simple Tips for beautiful Neck
సాధారణంగా మెడ అందంగా ఉంటే మీ మెడ శంఖంలా ఉందంటూ పొగడుతుంటారు కొందురు. అలాంటి ఆకృతి అందరికి లేకపోయినా చిన్న పాటి జాగ్రత్తలతో మెడ అందంగా కనిపిస్తుంది. ముఖ సౌందర్యంలో మెడ కూడా ఒక భాగమే. మెడ అందంగా కనిపించడానికి మెడనిండా అధికంగా నగలను వేసుకోకూడదు. మెడ అంద విహీనంగా కనిపించకుండా జాగ్రత్తపడాలి.

1. మెడ సాధ్యమైనంత వరకూ నిటారుగా ఉండటం, ప్రాధమికంగా తీసుకోవాల్సిన జాగ్రత్త. ఇది మెడ కండరాలను భిగుతుగా ఉంచుతుంది.
2. గుడ్డులోని తెల్లసొన పెరుగు, తేనె, బాదం నూనె కలిపి మెడకు రాసి, అది బాగా ఆరాక గోరు వెచ్చని నీటితో కడిగేస్తే మెడ అందంగా కాంతివంతంగా కనిపిస్తుంది.
3. మృతకణాలను తొలగించేందుకు వాడే నలుగును..ముఖానికే కాదు..మెడ ప్రాంతంలోనూ రాస్తుండాలి. దానివల్ల అక్కడి చర్మం తేటగా మారుతుంది.
4. కీరా, నిమ్మరసం రెండూ కలపి అందులో పసుపును వేసి మెడ చుట్టూరా రాసి, పావు గంట తర్వాత నీటితో శుభ్రపరిస్తే మెడ నలుపు తొలగిపోయి, వర్చస్సుగా ఉంటుంది.
5. కలబంద గుజ్జులో పసుపు, శెనగపిండి కలిపి మెడ చుట్టురా ప్యాకలాగా పట్టించాలి. ఆ తర్వాత మెత్తని బట్టను వేడి నీటిలో ముంచి, ఆ ప్యాకను పూర్తిగా తీసేసి, నీటితో కడిగితే చర్మానికి వర్చస్సు ఏర్పడి, మెడ సౌందర్యం పెరుగుతుంది.
6. వారానికి రెండు సార్లు గుడ్డులోని తెల్లసొనను మెడ వెనుక బాగాన రాసి చేతులతో సున్నితంగా రుద్ది, కాసేయిన తర్వాత గోరువెచ్చని నీటితో చర్మాన్ని శుభ్రపరుచుకోవాలి.
మెడమీద మట్టి, జిడ్డు, దుమ్మ నల్లగా పేరుకోకుండా సాన్నం చేసే సమయంలో క్లీనింగ్‌ క్రీమ్‌తో చర్మాన్ని శుభ్రపరచాలి.
7. వేడి నీటిలో తడిపిన చిన్న టవల్‌ ను మెడ చుట్టూ చుట్టి ఓ పదినిమిషాలపాటు అలాగే ఉంచాలి. అలా చేస్తే చర్మం శుభ్రపడటమే కాకుండా రక్తప్రసరణ మెడకు చక్కగా జరుగుతుంది.
8. నిమ్మరసంలో ఉప్పు, పసుపు కలిపి పేస్టులా చేసి దాన్ని మెడకు పట్టించి మసాజ్‌ చేసినట్లయితే, అది స్క్రబ్‌ లాగా పనిచేస్తుంది.

English summary

Natural and Simple Tips for beautiful Neck | మెడ సౌందర్యం మీ సొంతం కావాలంటే....

Many women care for their facial skin, but avoid neck skin. In fact dust, sweat, pollution, germs, and bacteria get deposited in larger proportion on our neck. It is the most neglected part of the body. Even harmful sunrays emitted by sun affects the skin on neck. Neck is the most sensitive part of the body. Persisting neglection will lead to early aging of the skin on neck.
Story first published:Tuesday, January 31, 2012, 11:51 [IST]
Desktop Bottom Promotion