Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మెడ మీద నలుపు, చారలు-గీతలు తొలగిపోయేలా...!

మెడమీది చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి బరబరా రుద్ది శుభ్రం చేయకూడదు. జుట్టునుంచి మెడకు అంటుకునే జిడ్డును తొలగించేందుకు స్నానం చేసేటప్పుడు ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. మెడ మీద చర్మం పలచగా సున్నితంగా ఉంటుంది. దానిని జాగ్రత్తగా కాపాడుకోకపోతే మెడ మీద చారలు, గీతలు పడే ప్రమాదం ఏర్పడుతుంది. సున్నితంగా ఉండే స్క్రబ్‌ను వాడి ఎప్పటికప్పుడు మెడ భాగాన్ని క్ల్లీన్ చేస్తుండాలి. శరీరంలో మిగతా భాగాలకు మాదిరిగానే సరైన ఎక్సర్‌సైజ్ లేకపోతే మెడ మీద కండరాలు కూడా పటుత్వం కోల్పోయి చర్మం వదులుగా తయారయ్యి ముడుతలు, చారలు పడే అవకాశం ఉంది అంటున్నారు స్కిన్ ఎక్స్‌పర్ట్స్. లావు ఎక్కువగా ఉండి సడన్‌గా బరువు తగ్గినట్లయితే కూడా ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన పద్ధతిలో ఎక్సర్‌సైజ్ ద్వారా బరువుతగ్గితే అయితే ఇలా జరగకుండా జాగ్రత్తపడవచ్చు.
ఎండల్లో తిరిగినప్పుడు ఇంటికి రాగానే వేడినీటితో మెడను శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మెత్తని టవల్‌తో తుడుచుకోవాలి. గిల్ట్ నగలు ధరించటంవల్ల నల్లటి మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటివల్ల దురదలు కూడా వస్తాయి. కాబట్టి వేసవికాలంలో గిల్టు నగలను ధరించకపోవటం ఉత్తమం.
మెడ భాగానికి ఆలీవ్ ఆయిల్ రాసి మసాజ్ చేయటంవల్ల ఆ ప్రాంతమంతా నున్నగా, మృదువుగా ఉంటుంది. రాత్రి పడుకోబోయేందుకు ముందుగా ఆలీవ్ నూనెను రాసి, ఉదయాన్నే లేచిన వెంటనే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. గుడ్డులో వుండే పసుపు సొనను మెడను కడిగిన తర్వత రాసుకోండి. 30 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగి వేయాలి.
చిక్కని మజ్జిగ రాసుకుని పది నిమిషాల తర్వాత చల్లిని నీటితో కడిగివేయాలి. పాలలో నిమ్మరసం కలిపి అప్లయిచేసినా కూడా ఫలితం ఉంటుంది. ఇది పూసిన తర్వాత వేడినీటితో కడగాలి. గుడ్డలో ఐస్‌ను వుంచి మెడమీద తుడవాలి. ఇలా చేస్తే మెడమీద ముడతలు పడవు.
రోజుకు కనీసం రెండుసార్లు మూడు లేదా నాలుగు నిమిషాలపాటు మెడను పైకి ఎత్తడం, వంచడం, అటూ ఇటూ తిప్పడం చేయాలి. ఇందువల్ల మెడ కండరాలు చక్కగా పనిచేస్తాయి. కొద్దిగా గ్లిజరిన్ తీసుకుని అందులో కొన్ని నిమ్మరసం చుక్కలు కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట పడుకునేటపుడు మెడకు రాసి, ఉదయాన్నే శుభ్రం చేసుకుంటే, కొద్దిరోజుల్లోనే మెడ మెరిసిపోతుంది.
రోజు చేయవలసిన మెడ ఆసనాలు: తలని వెన్నక్కి 10 సార్లు, ముందుకు 10 సార్లు కదిలించాలి. తలని బాగా వెనుకకి వాల్చి, నోటిని బాగా తెరచి కదిలించి మూయవలెను.
తలని ఒక పక్క నుండి వేరొక్కపక్కకి కదిలించాలి. తరువాత తలని కుడి భుజము తాకు వరకు తీసికెళ్ళి, మళ్ళీ ఎడమ వైపు భుజమువరకు తీసుకొని పోవలెను. ఇదేవిధంగా 10 నుంచి 20 సార్లు చెయ్యాలి.
మెడ జాగ్రత్తలు: నడిచేటప్పడును, కూర్చునేటప్పుడునూ, తలని వెనుకకు వాల్చినట్లు ఉంచవలెను. దుమ్ము, దూళి, ఎండ మొదలగు వాటి నుంచి శరీరమును కాపాడుకొనవలెను. ఈత నేర్చుకునే వారు ఈత తరువాత, మంచి నీటిలో మళ్ళీ స్నానం చేయా లి. ఉప్పు, మరియు క్లోరిన్ నీటి నుండి శరీరమును కాపాడుకొన వలెను.
మెడ భాగమును బిగుతు చేసే క్రీములు వాడవచ్చును. క్రీమ్ ని పైభాగమునకు మసాజ్ చేయు విధముగా వాడవలెను. ముఖానికి ఇచ్చే జాగ్రత్తలు, మెడకు కూడా ఇవ్వ వలెను. మెడకు మాస్క్, మసాజ్ మొదలగు జాగ్రత్తలు చాలా ముఖ్యం.



Click it and Unblock the Notifications