Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఉల్లాసం... ఉత్సాహం తోడైతే ఆరోగ్యం మీ వెంటే...!
Body Care
oi-Saraswathi
By Sindhu

2. కొద్దిగా ఆకలిగా ఉండగానే తినడం ఆపేయండి. భోజనానికి ముందు కాస్త సూప్ తీసుకోండి. దాంతో మీరు తక్కువ తింటారు. ఆ సూప్ వెజిటబుల్ సూప్ అయితే ఒకే అంశంతో రెండు ప్రయోజనాలు.
3. ముఖ్యంగా ఆహారంలో ఆకపచ్చటి ఆహార పదార్థాలు (గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్), యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వు పదార్థాలు తగ్గించాలి.
4. తాజా కూరగాయలు, పండ్లు రోజూ తీసుకొండి. ఫ్రిజ్ లో పెట్టిన వాటిల్లో 50-60శాతం పోషకాలు నశిస్తాయి. కాబట్టి తాజావే తీసుకోవడం మంచిది.
5. రోజూ మంచినీళ్లు రెండు నుంచి మూడు లీటర్లు వరకు తాగాలి. దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా నివారించడం, చర్మం ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుంది. శరీరంలోని ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కు నీరు ఉపయోగపడుతుంది.
6. రోజూ కూరగాయలు, పళ్లు తీసుకుంటే వాటిల్లోని పోషకాలు, పీచు పదార్థాల వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గడమే కాదు. విరేచనం సాఫీగా అవుతుంది.
7. మీరు ఇష్టపడే ఆహారపదార్థాల విషయంలో నోరుకట్టేసుకోవద్దు. కాస్తంత సంయమనం చాలు. అంటే రోజూ తీసుకునే బదులు, అప్పుడప్పుడూ తింటే చాలు.
8. చేపల్లో ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ అనే పోషకాలు ఉన్నాయి. వీటితో గుండెకు మంచి ఆరోగ్యం.
9. రోజూ 30నిమిషాల పాటు కనీసం వారంలో 5రోజులు వ్యాయామం చేయాలి. ఏదైనా ఆటలో పాల్గొంటే, అదే వ్యామాయ ప్రక్రియ మరింత ఉత్సాహభరితమవుతుంది.
10. ఉల్లి, వెల్లుల్లి లాంటి ఘాటైన పదార్థాలు క్యాన్సర్ ను నివారించే సహజమైన ఆహారం.
11. ఒక సారి ఉపయోగించిన నూనెను మళ్లీ వాడకూడదు. ఒకసారి కాచిన నూనె ఇంకోసారి ఉపయోగిస్తే, అది క్యాన్సర్ కారకంగా మారుతుంది.
12. పరిమితమైన ఒత్తిడి వల్ల కాస్తంత ప్రయోజనం ఉండవచ్చు. కాని మితిమీరిన ఒత్తిడి ఎప్పుడూ హానికరం. అందుకే ప్రశాంతగా ఉండాలి.
13. భావోద్వేగాలను అణచుకోకండి, ప్రేమ, బాధ, విచారం, కోపం, నవ్వు... ఇలాంటి ఫీలింగ్ లను చాలా సేపు నియంత్రించుకోవద్దు. అలా చేయడం వల్ల అంతర్గతంగా స్ట్రెస్ పెరుగుతుంది.
14. సెల్ ఫోన్ పరిమితంగా వాడాలి. మొబైల్ నుంచి వెలువడే తరంగాల దుష్ప్రభావం మెదడుతోపాటు ఇతర అవయవాల మీద ఉండొచ్చు కాబట్టి పడుకునేటప్పుడు దగ్గరగా ఉంచుకోకూడదు.
15. ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబంతో గడపటం, పెంపుడు జంతువులను పెంచుకోవడం, అక్వేరియంలో చేపలు చూస్తూ ఉండటం కూడా ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యాన్ని పెంచే అంశాలే.
16. ప్రకతి సౌందర్యాన్ని ఆరాధించండి. అప్పుడప్పుడైనా ప్రకతికి దగ్గరగా ఉండండి. అందుకోసం కనీసం నెలలో ఒక్కసారైనా ప్రకతికి దగ్గరగా గడపండి. స్వాభావికత ఏదైనా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
17. రాత్రి వేళ ప్రశాంతంగా కనీసం 7-8గంటలు నిద్రపోవాలి. రాత్రి నిద్రను అవాయిడ్ చేయకూడదు. నిద్రతో రోగ నిరోధక వక్తి పెరుగుతుంది. అయితే మరీ ఎక్కువగా నిద్రపోవద్దు. అది డిప్రెషన్ కి సూచిక. వీలైతే మధ్యహ్ననం పూట ఒక చిన్న కునుకు తీయండి. దాని వల్ల సామర్థ్యం జ్ఞాపక శక్తి పెరుగుతాయి.
18. ట్రాఫిక్ చప్పుళ్లను అవాయిడ్ చేయండి. ఆహ్లాదకరమైన సంగీతం వినండి. రణగొణధ్వనులతో ఉండే మెటాలిక్ మ్యూజిక్ వద్దు.
19. క్రమం తప్పకుండా సెక్స్ లో పాల్గొనండి. దాంతో ఒంట్లో పెరిగే ఒత్తిళ్లను సెక్స్ దూరం చేస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందించే, ఎముకలను బలంగా చేసే హార్మోన్లను పెంచుతుంది.
20. ఆత్మవిశ్వాసంతో ఉండటం రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండేవాళ్లలో ఎండార్ఫిన్స్ తయారై ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే.. నిత్యం ఉల్లాసంగా ఉండండి.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: body care skin care food water health శరీరం సంరక్షణ చర్మ సంరక్షణ ఆహారం నీళ్లు ఆరోగ్యం
English summary
Simple Tips to Enjoy The Life Every Day...! | రోజంతా ఉల్లాసంగా...ఉత్సాహంగా...
Story first published: Thursday, June 14, 2012, 17:24 [IST]
Other articles published on Jun 14, 2012



Click it and Unblock the Notifications











