Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
వేసవిలో తినే ఆహారాన్ని బట్టే శరీర సౌందర్యం....

1. ఎండ వేడి వల్ల శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. దీనినే డీ హైడ్రేషన్ అంటారు దీనిని అరికట్టటానికి ఎక్కువ మంచి నీటిని త్రాగాలి. చాలా మంది ఎండ వేడికి తట్టుకోలేక ఏవేవో కూల్ డ్రింక్ సేవిస్తుంటారు. రసాయనాలు కలిపిన కూల్ డ్రింక్స్ శరీరానికి హాని కలిగిస్తాయి కాబట్టి అవి పక్కనపెట్టి సహజసిద్ధంగా లభించే నీరు, కొబ్బరినీరు త్రాగటం స్నేయస్కరం
2. కాఫీ, ఆల్కహాల్ గ్యాస్ ప్రాబ్లమ్ కలగజేస్తుంది. ఇవి తీసుకోకపోవడమే మంచిది. అలాగే ఐస్ వేసిన వాటిని సేవించరాదు. దేహంలో టాక్సిన్లను పెంచుతాయి. లస్సీ, కొబ్బరి బొండాలు, పళ్ల రసాలు మంచివి. ఆరంజ్, యాపిల్, బొప్పాయి తింటే ఆరోగ్యమైన చర్మం ఏర్పడుతుంది. లెమన్ జ్యూస్ లో సి విటమిన్ వుండి చర్మాన్ని ఇన్ ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. మజ్జిగ, వెన్నతీసిన పాలు ఒంటికి మరీ మంచిది.
3. ఎటువంటి ఆహారమైనా సరే మితంగా తినాలి. సాధ్యమైనంత వరకూ ఈ వేసవికాలంలో చల్లటి పదార్థాలను తినడానికి ప్రయత్నించాలి. తినేఆహరంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు ఉండేటట్లు చూసుకోవాలి. ముఖ్యంగా పంచదార ఉపయోగించే వాటికి బదులు తేనెనె వాడితే మంచిది.
4. ప్రతి రోజూ తినే ఆహారంలో పీచు ఎక్కువగా ఉన్నవి తీసుకోవాలి. టమోటోలు, క్యారెట్, దోసకాయలు, ఆకుకూరల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటి ఆహారాన్ని తినాలి. వేసవిలో అరుదుగా లభించే పుచ్చకాయలు, మామిడి పళ్లు, అనాస, కర్బూజ, ద్రాక్ష పళ్లను, ఖర్జూరం, కిస్ మిస్ లను వాడవచ్చు.
5. గ్యాస్ సంబందిత ప్రాబ్లెమ్స్ గనుక వుంటే నూనె పదర్థాలు, శెనగపిండితో చేసేవాటిని తగ్గించాలి. పుదీనా, యాలకులను, జీలకర్రను వాడాలి. అల్లం, పచ్చిమిర్చి, మిరియాలు వంటివాటిని పూర్తి తినకపోవడమే మంచిది.
6. వీటన్నితో పాటు ఇంట్లో వాతావరణం చల్లగా ఉండేలా చూసుకోవాలి. ఎండలోకి వెళ్లటానికి ముందుగానే సన్ స్క్రీన్ లోషన్ ను చర్మానికి రాసుకొని బయటికి వెళ్ళాలి. మరో ముఖ్యమైన విషయం. క్రమం తప్పకుండా వ్యాయామం, వాకింగ్ చాలా ముఖ్యం. తిండి తినకుండా వ్యాయామం చేస్తే మనుషులు బరువు తగ్గుతారనేది సరైనది కాదు. బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి. స్వీట్లు మితంగా తినాలి. ఇక తిండి తినేటప్పుడు పుస్తకాలు చదవడం, టీవి చూడటం చేయకూడదు. వీటన్నింటినీ పాటించటం వల్ల శరీరం సౌందర్యం కూడా తినే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది.



Click it and Unblock the Notifications