Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
వాలెంటైన్ డే రొమాంటిక్ గా కనిపించండిలా...

మేకప్ వేసుకొనేటప్పుడు బ్రైట్ మేకప్ నైట్ పార్టీని మరింత కాంతివంతం చేస్తుంది. మేకప్ చేసుకొని షిమ్మర్ బాడీ ఫౌండేషన్ వాడితే చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. ఐ షాడోకి బ్రైట్ కలర్స్ వాడి, షిమ్మర్ లిపిస్టిక్ తో పెదాలను తీర్చిదిద్దుకోవాలి. హెయిర్ స్టైల్ విషయంలో మంచి స్ట్రెయిట్ షోల్డర్ లైన్ ఉన్నవారు జుట్టును పైకి మడిచేలా హెయిర్ స్టైల్ చేసుకోవాలి. లావు చేతులు ఉన్నవారు జుట్టును వదిలేసుకుంటే బాగుంటుంది. చెవులకు... వేలాడే షాండ్లియర్స్, పెద్ద పెద్ద రింగులు పెట్టుకోవాలి. వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు మెడలో ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. చెప్పులు హై హీల్స్ అదీ సౌకర్యంగా ఉండేవి ఎంచుకోవాలి. పంఫ్ షూస్, శాండల్స్ కూడా పార్టీకి బాగుంటాయి. హ్యాండ్‌బ్యాగులకు బదులుగా డ్రెస్ కి మ్యాచింగ్ ఉండే ఎంబ్రాయిడరీ క్లచ్‌లు పట్టుకోవాలి.
సాధారణంగా ప్రేమికుల రోజును ప్రేమకు గుర్తుగా ఎరుపు, పచ్చరంగులను ధరిస్తారు. ఇలా కాకుండా మరే డ్రెస్ ధరించినా మంచి కాంతివంతమైన రంగులు ఉన్నవి, లేత రంగులు ఇష్టపడేవారైతే అందులోనే బ్రైట్ షేడ్స్ ఉన్నవి ఎంపిక చేసుకోవాలి. స్టోన్, సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ ఉన్న గౌన్లు లైట్ వెలుతురులో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. శరీరాకృతికి తగ్గ డ్రెస్: హాల్టర్ నెక్, ఆప్ షోల్డర్స్, సింగిల్ షోల్డర్, స్లీవ్‌లెస్, స్పగెట్టి లైన్స్ ఉన్న ఈవెనింగ్ గౌన్లు పార్టీకి ఆధునిక కళను తీసుకొస్తాయి. వెస్ట్రన్ గౌన్లు శరీరానికి అతుక్కుపోయినట్టు ఉంటాయి. అలాగే పాశ్చాత్య దుస్తులు వేసుకున్నప్పుడు లో దుస్తుల విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటేనే డ్రెస్ పర్ ఫెక్ట్‌గా ఉంటుంది. పొట్ట కొద్దిగా ఎత్తున్నవారు డ్రెస్సులకు నెట్టెడ్ మెటీరియల్ ను వాడకూడదు. లాంగ్, నీలెంగ్త్ గౌన్లకు శాటిన్, షిఫాన్, జార్టెట్ మెటీరియల్ ను ఎంచుకోవాలి. బ్లేజర్స్ అయితే లెనిన్ వి ఎంచుకోవాలి.



Click it and Unblock the Notifications