For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవి వేడిలో తిండి పదార్థాల జాగ్రత్తలు...!

|

Tips to a Healthy Summer Diet..
గతంలో జీవన విధానంతో ప్రస్తుత జీవన విధానం పోల్చుకుంటే ఎన్నోఎన్నెన్నో మార్పు. గతంలో పని చేసి సంపాదించాలంటే అందుకు ఒక సమయం ఉండేది. అయితే ఇప్పుడు రేయింబవళ్లు కష్టపడి పనిచేసినాన బ్రతకడం కష్టమవుతోంది. ఉరుకుల పరుగుల ఉద్యోగ వ్యాపారాల్లో శరీర స్థితిని పట్టించుకోకుండా ఉండిపోతే ప్రమాదమే. ముఖ్యంగా వేసవిలో శరీరంలోని ద్రవాలన్నీ ఆవిరైపోయి హఠాత్తుగా నేలకూలిపోయే ప్రమాదం ఉంది. వేసవిలోనూ శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి కొన్ని మెలకువలు గమనించండి.
ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ భూమిలో ఉన్న తేమంతా ఆవిరైపోయినట్లే, ద్రవాలన్నీ ఆవిరైపోతూ శరీరమంతా పొడిబారిపోతుంది. తిరిగి శరీరం తేమగా మారడానికి నీటిని అధికంగా తీసుకుంటూ ఉండాలి. వృక్షాలకూ మనిషికీ ఎంతో తేడా ఉంది. భూమితో అంటిపెట్టుకుని ఉండడం వల్ల వృక్షాలు ఎలాగోలా అవసరమైన పోషకాలు, ద్రవాలన్నీ అందుకుంటూనే ఉంటుంది. మనిషి అలా భూమితో కలిసి ఉండకపోవడం వల్ల అతని శరీరంలోని ద్రవాలన్నీ ఆవిరైపోతూ ఉంటాయి.

అయితే వేసవిలో అంతా పొడిబారిపోతున్నా, తర్బూజా, కీరా లాంటి పళ్లల్లో నీరు ఉంటుంది. మామిడి పళ్లు తప్ప వేసవిలో వచ్చే అన్ని రకాల పండ్లను విరివిగా తీసుకోవాలి. పండ్లలో ఉండే ఈ నీరు శరీరాన్ని చల్లబరచడానికి బాగా తోడ్పడతాయి. గ్లూకోజ్ ఎక్కువగా ఉండడం వల్ల మామిడి పండ్లే వేడి చేస్తాయి. కానీ మామిడి కాయలు శరీరానికి చలువ చేస్తాయి. ఆ మాటకొస్తే ఎక్కువ శక్తి నిచ్చేవి ఏవైనా శరీరానికి వేడి చేస్తాయి. అందుకే మామిడి పండ్లను చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. అలాగే శరీర సంరక్షణ తో పాటు వేసవిలో చర్మం, జుట్టు విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం.

1. నిమ్మరసం వేసవి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. నీటితో గానీ, మజ్జిగతో గానీ కలిపి తీసుకోవడం మేలు.
2. ద్రాక్షపండ్లు, ద్రాక్షరసం, తేనె కలిపిన నీళ్లు తాగవచ్చు. అలాగే పావు చెంచా మోతాదులో గంధం రసాన్ని నీళ్లలో కలుపుకుని తాగినా శరీరం చల్లబడుతుంది.
3. పెరుగుకు వేడి చేసే గుణం ఉంది. అందుకే ఒక భాగం పెరుగు, మూడు భాగాలు నీళ్లు కలిపి చిలికి మజ్జిగ చేసుకుని తాగడం మేలు.
4. ఉల్లిపాయలో సగభాగాన్ని రెండు గ్లాసుల నీటిలో వేసి మరగించి తాగితే శరీరం చల్లబడుతుంది. అవసరమైతే అందులో బెల్లం గానీ, చక్కెరగానీ కలిపి తీసుకోవచ్చు.
5. వేసవిలో జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి మాంసాహారం, చిక్కుడు దాన్యాలు తక్కువగా తీసుకోవాలి. ఉప్పు, పులుపు, కారం వినియోగం బాగా తగ్గించాలి.
6. ఉసిరికాయ పొడిని ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా నీళ్లలో కలుపుకుని తాగితే చలువ చేస్తుంది.
7. ఎండు ద్రాక్ష, క ర్బూజాలు శరీరానికి మేలు చేస్తాయి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే వడదెబ్బ తగిలే ప్రమాదం కూడా ఉండదు.

English summary

Tips to a Healthy Summer Diet...! | అలవాట్లు మార్చుకుంటే ఎంతో హాయి...!

It is a key ingredient in keeping the body cool. With high humidity levels, sweat will not evaporate quickly. This prevents the body from releasing heat in an efficient manner. This is why it is necessary to hydrate and drink water, even when you are not thirsty. Increase water intake regardless of your activity levels.
Story first published:Saturday, April 28, 2012, 15:40 [IST]
Desktop Bottom Promotion