Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అతివల అందానికి ఆకర్షనీయమైన మెడ...!

1. ముఖం కడుకున్న ప్రతీసారి మెడను కూడా శుభ్రం చేసుకోవాలి. అలా వీలుపడకపోతే కనీసం నీటితో అయినా మెడను కడుక్కోవాలి. మెడ దగ్గరే దుమ్ము, ధూళి ఎక్కువగా వచ్చి చేరతాయి.
2. ముఖానికి ఉపయోగించే మాయిశ్చరైజర్ నే మెడకు ఉపయోగించవచ్చు. దీనికోసం ప్రత్యేకించి కొనవలసిన అవసరం లేదు.
3. మార్కెట్ లో ఏ సౌందర్య ఉత్పత్తి కొన్నా అల్కాహాల్ రహిత సాధనాన్నే కొనుగోలు చేయాలి. వీటిని కొనుగోలు చేసేటప్పుడే వాటి తయారీకి ఏవేవి ఉపయోగించారో పరిశీలించాలి. ఉప్పత్తిమీద ఆ వివరాలు లేకపోతే షాపు వారిని తప్పనిసరిగా అడిగి కనుక్కోవాలి.
4. మెడ ప్రభావం భుజాల మీద పడుతుంది. మెడతో పాటు భుజాలు మెరుస్తూ వుంటేనే ఏ డ్రస్ వేసుకున్న నప్పుతుంది.
5. ఫేషియల్ మాయిశ్చరైజర్ నే భుజాలు, మెడకు కూడా ఉపయోగించవచ్చు.
6. ప్రతిరోజూ కొద్దసేపన్నా మెడకు సంబంధించిన వ్యాయామం చేయాలి. దీని వల్ల మెడ కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.
7. వారంలో ఒకటి రెండుసార్లన్నా మెడ, భుజాల మసాజ్ చేసుకోవాలి. ఇంట్లో చేసుకోవడం కుదరని వాళ్ళు పార్లర్లకి వెలితే మంచి ఫలితం వుంటుంది.
8. వారంలో ొకసారన్నా ఫేస్ మాస్క్ ను మెడకు పట్టించి 20నిమిషాల తర్వాత గోరువెచ్చిని నీటితో శుభ్రం చేసుకోవాలి.
9. సూర్య కిరణాల ప్రభావం వలన మెడ దగ్గర చాలా త్వరగా నల్ల మచ్చలు ఏర్పడతాయి. వీటి నివారణకు ఇంటి వైద్యమే మేలు. టమోటా గుజ్జును మెడ, భుజాల దగ్గర పట్టించి కొద్దసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా కొన్ని వారాలపాటు చేసుకుంటే క్రమంగా నలుపురంగు పోయి చర్మం సహజ నిగారింపును సంతరించుకుంటుంది.
10. మెడకు అలంకరించుకునే ఆభరణాల విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. భుజాలు వెడల్పుగా వున్నవారు భారీ ఆభరణాలు ధరించినా బాగుంటుంది కానీ భుజాలు సన్నగా, చిన్నగా ఉన్నవారు నెక్లెస్ లేదా చైన్ వేసుకుంటేనే బాగుంటుంది.
11. మెడచుట్టూ ఉన్న ముడతలు పోవాలంటే ఒక చెంచా కోడిగుడ్డులోని తెల్లసొన చెంచా పాలమీగడ కొంచెం రోజ్‌వాటర్ కలిపిన పేస్టును మెడకు పట్టించాలి.
12. మెడ నలుపుగా మారిన వారు బొప్పాయి గుజ్జు ప్యాక్ వేసుకుంటే తెలుపుదనమే కాకుండా నునుపు దనం కూడా వస్తుందని బ్యూటీషియన్లు చెబుతున్నారు.
13. మెంతి ఆకుల రసాన్ని, శనగపిండి కలిపి మెడకు రాయాలి. 20నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరచుకుంటే మెడ అందంగా మెరిసిపోతుంది.



Click it and Unblock the Notifications