For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అతివల అందానికి ఆకర్షనీయమైన మెడ...!

|

Tips for Beautiful Neck...!
అతివలు ముఖానికి, చేతులకు, వేళ్లకు చూపింనతం శ్రద్ద మెడ మీద చూపించరు. శంఖం లాంటి మెడ అంటూ కవులు ఎంతగా అభివర్ణించినా దీని గురించి పట్టించుకునేవారు తక్కువే. రోజు మొత్తం మీద ముఖం, కాళ్ళు, చేతులు అదే పనిగా శుభ్రం చేసుకునేవారు ముఖానికి కొద్దిగా కిందగా వున్న మెడని మాత్రం కనీసి నీటితో కూడా కడుక్కోరు. వాస్తవానికి మెడ మీద పడే ముడతుల వృద్యప్యాన్ని త్వరగా తెలియజేస్తాయని నిపుణులు అంటున్నారు. చందమామ లాంటి మోము ఉన్నా దాని కింద ముడతలు పడి లూజ్‌గా వేలాడుతున్న మెడ చర్మం ఉంటే దాని విలువ అమావాస్య చంద్రుడికున్నంత. కూర్చున్నా, నిల్చున్నా, పడుకున్నా, నడిచినా, తింటున్నా...ఏ పనినీ మెడ సహాయం లేకుండా చేయలేం! ఆరోగ్యంతో పాటు అందాన్నిచ్చే మెడకి తగినంత విలువనివ్వండి... ప్రేమగా చూసుకోండి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే కవులు వర్ణించినట్లు శంఖం లాంటి మెడను సొంతం చేసుకోవచ్చు. ఆ జాగ్రత్తలేమిటో మీ కోసం...

1. ముఖం కడుకున్న ప్రతీసారి మెడను కూడా శుభ్రం చేసుకోవాలి. అలా వీలుపడకపోతే కనీసం నీటితో అయినా మెడను కడుక్కోవాలి. మెడ దగ్గరే దుమ్ము, ధూళి ఎక్కువగా వచ్చి చేరతాయి.
2. ముఖానికి ఉపయోగించే మాయిశ్చరైజర్ నే మెడకు ఉపయోగించవచ్చు. దీనికోసం ప్రత్యేకించి కొనవలసిన అవసరం లేదు.
3. మార్కెట్ లో ఏ సౌందర్య ఉత్పత్తి కొన్నా అల్కాహాల్ రహిత సాధనాన్నే కొనుగోలు చేయాలి. వీటిని కొనుగోలు చేసేటప్పుడే వాటి తయారీకి ఏవేవి ఉపయోగించారో పరిశీలించాలి. ఉప్పత్తిమీద ఆ వివరాలు లేకపోతే షాపు వారిని తప్పనిసరిగా అడిగి కనుక్కోవాలి.
4. మెడ ప్రభావం భుజాల మీద పడుతుంది. మెడతో పాటు భుజాలు మెరుస్తూ వుంటేనే ఏ డ్రస్ వేసుకున్న నప్పుతుంది.
5. ఫేషియల్ మాయిశ్చరైజర్ నే భుజాలు, మెడకు కూడా ఉపయోగించవచ్చు.
6. ప్రతిరోజూ కొద్దసేపన్నా మెడకు సంబంధించిన వ్యాయామం చేయాలి. దీని వల్ల మెడ కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.
7. వారంలో ఒకటి రెండుసార్లన్నా మెడ, భుజాల మసాజ్ చేసుకోవాలి. ఇంట్లో చేసుకోవడం కుదరని వాళ్ళు పార్లర్లకి వెలితే మంచి ఫలితం వుంటుంది.
8. వారంలో ొకసారన్నా ఫేస్ మాస్క్ ను మెడకు పట్టించి 20నిమిషాల తర్వాత గోరువెచ్చిని నీటితో శుభ్రం చేసుకోవాలి.
9. సూర్య కిరణాల ప్రభావం వలన మెడ దగ్గర చాలా త్వరగా నల్ల మచ్చలు ఏర్పడతాయి. వీటి నివారణకు ఇంటి వైద్యమే మేలు. టమోటా గుజ్జును మెడ, భుజాల దగ్గర పట్టించి కొద్దసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా కొన్ని వారాలపాటు చేసుకుంటే క్రమంగా నలుపురంగు పోయి చర్మం సహజ నిగారింపును సంతరించుకుంటుంది.
10. మెడకు అలంకరించుకునే ఆభరణాల విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. భుజాలు వెడల్పుగా వున్నవారు భారీ ఆభరణాలు ధరించినా బాగుంటుంది కానీ భుజాలు సన్నగా, చిన్నగా ఉన్నవారు నెక్లెస్ లేదా చైన్ వేసుకుంటేనే బాగుంటుంది.
11. మెడచుట్టూ ఉన్న ముడతలు పోవాలంటే ఒక చెంచా కోడిగుడ్డులోని తెల్లసొన చెంచా పాలమీగడ కొంచెం రోజ్‌వాటర్‌ కలిపిన పేస్టును మెడకు పట్టించాలి.
12. మెడ నలుపుగా మారిన వారు బొప్పాయి గుజ్జు ప్యాక్‌ వేసుకుంటే తెలుపుదనమే కాకుండా నునుపు దనం కూడా వస్తుందని బ్యూటీషియన్లు చెబుతున్నారు.
13. మెంతి ఆకుల రసాన్ని, శనగపిండి కలిపి మెడకు రాయాలి. 20నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరచుకుంటే మెడ అందంగా మెరిసిపోతుంది.

English summary

Tips for Beautiful Neck...! | అతివల అందానికి ఆకర్షనీయమైన మెడ...!

Many women care for their facial skin, but avoid neck skin. In fact dust, sweat, pollution, germs, and bacteria get deposited in larger proportion on our neck. It is the most neglected part of the body. Even harmful sunrays emitted by sun affects the skin on neck. Neck is the most sensitive part of the body. Persisting neglection will lead to early aging of the skin on neck.
Story first published:Tuesday, June 5, 2012, 17:42 [IST]
Desktop Bottom Promotion