For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెయిల్ పాలిష్ త్వరగా ఆరాలంటే...?

|

మన చేతికి అందమైన గోళ్ళు కలిగి.. ఆకర్షణీయమైన నెయిల్ పాలిష్ పెట్టుకొంటే ఎంత అందంగా ఉంటాయి. ఆ అందం మన వేసుకొనే నెయిల్ పాలిష్ కలర్ మీద, వేసుకొనే విధానం మీద ఆధారపడి ఉంటుంది. నెయిల్ పాలిష్ వేసుకొన్నాకా త్వరగా ఆరబెట్టుకోవాలి. దాని మీద మళ్ళీ డబుల్ కోట్ ఇవ్వడానికి కొద్దిగా సమయం తీసుకోవాల్సి వస్తుంది. ఒక వేళ మీరు ఉద్యోగస్తురాలైయుండి లేదా ఇంట్లో బిజీగా ఉన్నా, లేదా ఓపికలేని, కాలేజ్ గర్ల్స్ అయినా సరే గోళ్ళు కు పాలిష్ పెట్టుకోవడంలో కొంచెం బద్దకించి ఎలాగంటే అలా పెట్టేసుకొనే అది ఆరక ముందే వారి వారి పనులు మొదలెట్టేస్తుంటారు. దాంతో నెయిల్ పాలిష్ చెదిరిపోవడం వల్ల అసహ్యంగా కనబడుతుంది. అలా జరగకుండా గోళ్ళు ఉపయోగించిన నెయిల్ పాలిష్ త్వరగా ఆరి, గోళ్ళు అందంగా, మెరిసిపోయే విధంగా కనబడాలంటే కొన్ని చిట్కాలు పాటించడం అవసరం...

Tips To Dry Nail Polish Quickly....!

1. నెయిల్ పాలిష్ బాటిల్ ను షేక్ చేయాలి: నెయిల్ పాలిష్ ను ఉపయోగించే ముందు బాటిల్ ను షేక్ చేయాల్సి ఉంటుంది. ఎందకంటే నెయిల్ పాలిష్ ను ఎప్పుడో ఉపయోగించి పక్కన పెట్టేసుంటాము. దాంతో పాలిష్ గట్టిగా, లేదా చిక్కబడి బాటిల్ చివరలో ఉండిపోయుంటుంది. కాబట్టి, షేక్ చేయడం వల్ల పాలిష్ పలచబడుతుంది.ఇంకా అవసరం అనిపిస్తే అందుంలో కొంచెం అసిటోన్ వేసి ఇంకా పలుచగా తయారువుతుంది. దాంతో మీరు అప్లై చేసిన వెంటనే ఒక పక్క నుండి ఆరుతూ వస్తుంది.

2. ఒక కోటింగ్ : ఒక కోటింగ్ కి ఒక సారి మాత్రమే పాలిష్ అప్లై చేయాలి. ఒక వేళ లైట్ కలర్స్ అప్లై చేసేట్లైతే నెయిల్ పాలిష్ ను వెంటవెంటనే రెండు లేదా మూడు సార్లు కోటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో మీకు కావల్సిన పర్ఫెక్ట్ షేడ్ వస్తుంది. ఇలా మూడు సార్లు నెయిల్ పాలిష్ ను కోట్ చేయడం వల్ల త్వరగా ఆరదు. అటువంటప్పుడు ఫస్ట్ కోట్ ఆరిన తర్వాత సెకండ్ కోట్ తర్వాత థర్డ్ కోట్ అప్లై చేయాల్సి ఉంటుంది.

3. హెయిర్ డ్రయ్యర్: మనం వెంట్రుకలను తడి ఆర్పుకోవడానికి హెయిర్ డ్రయ్యర్ ను ఉపయోగిస్తాం. ఇంట్లో పెయింట్ వేసేటప్పుడు ఇంట్లో కిటికీ విండోలు, డోర్లు ఎందుకు తెరచి ఉంచుతాం. తాజా గాలితో పెయింట్ త్వరగా ఆరడానికి. అదే విధంగా హెయిర్ డ్రయర్స్ నుండి వచ్చే తాజా గాలి కూడ్ నెయిల్ పాలిష్ ను త్వరగా ఆరేట్లు చేస్తుంది.

4. చల్లటి నీళ్ళు: చాలా మంది నెయిల్ పాలిష్ అప్లై చేసిన వెంటనే ఆరిందా లేదా అని గోళ్ళు ముట్టుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే పాలిష్ చెతులకు అంటుకుంటుందని. పొడి చెతులతో నెయిల్స్ ను టచ్ చేయడం కంటే, వేళ్ళను చల్లటి నీటిలో ముంచి తర్వాత నెయిపాలిష్ అప్లై చేసుకొన్న గోళ్ళును టచ్ చేస్తే అది చేతికి అంటుకోకుండా ఉంటుంది.

వీటన్నింటితో పాటు ఫాస్ట్ డ్రయింగ్ నెయిల్ పాలిష్ ను కూడా ఉపయోగించి చేతి గోళ్ళును అందంగా ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. అటువంటి సౌందర్య సాధనాలు మార్కెట్లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి మరీ మీరు ప్రయత్నించి చూడండి.

English summary

Tips To Dry Nail Polish Quickly....! | నెయిల్ పాలిష్ త్వరగా ఆరాలంటే...?


 We love to adore our painted nails. How classy your slender fingers look after you apply nail paint on the them carefully? But the long period of time you spend to dry your nail paint is very bugging. You could be either a busy working woman or a busy homemaker. You could also be an impatient college student but the thing that is common among all women is that they hate to wait for their nail polish to dry.
Story first published: Tuesday, August 14, 2012, 12:33 [IST]
Desktop Bottom Promotion