For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సుంగంధ పరిమిళాలు ఎక్కువ సమయం నిలిచి ఉండాలంటే...!?

|

body care
సాధారణంగా సౌందర్య సాధనాలన్నింటికంటే పెర్‌ఫ్యూమ్స్‌ ఖరీదు అధికం. ప్రతి వారికీ పెర్‌ఫ్యూమ్స్‌ కొనే స్థోమత ఉండదు. కానీ పెర్‌ఫ్యూమ్స్‌ సువాసనను మెచ్చని వారుండరు. శుభ కార్యాలు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కొందరు మహిళలు పెర్‌ఫ్యూమ్స్‌ ఉపయోగిస్తారు. అయితే పెర్‌ఫ్యూమ్స్‌ను ఉపయోగించడంలో కూడా సరైన అవగాహన ఉండాలి.

ముఖ్యంగా వేసవిలో పెర్ ఫ్యూమ్ స్పెల్ ఎక్కువ సేపు ఉండాలా జాగ్రత్తపడాలి. వేసవిలో మన శరీరం గురించి వ్యక్తిగతంగా జాగ్రత్త తీసుకోకపోతే చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. వేసవిలో రోజుకు కనీసం రెండు సార్లైనా స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత పెర్ ఫ్యూమ్ లేదా డియోడరెంట్ వంటివి రాసుకోవాలి. చాలా మంది నేచురల్ డియోడరెంట్స్ ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. నేచురల్ గా దొరికే ఎసెన్సియల్ ఆయిల్స్ లేదా ఎక్సాస్ట్ మంచి సువాసనలు కలిగి ఎక్కువ సేపు నిలిచి ఉంటాయి. ఇవి చెడువాసనలు రానీయకుండా కాపాడుతాయి. డియోడరెంట్స్ అయినా, పెర్ ఫ్యూమ్స్ అయినా సుగంధ పరిమళాలు ఎక్కువ సమయం నిలిచి ఉండి శరీరాన్ని తాజాగా ఉండాంటే కొన్ని సరైన పద్దతులను పాటించాలి.

1. పెర్ ఫ్యూమ్ కానీ, డియోడరెంట్స్ కానీ ఉపయోగించే ముందు బాటిల్ ను బాగా షేక్ చేయాల్సి ఉంటుంది.
2. పెర్ ఫ్యూమ్ ను డైరెక్ట్ గా చంకల క్రింద వాడకూడదు. మీరు డ్రెస్ ధరించిన తర్వాత స్పే చేసుకోవడం వల్ల ఎక్కువ సమయం తాజాగా సువాసనతో నిలిచి ఉంటుంది.
3. మీరు డియోడరెంట్ రోలర్ ను ఉపయోగించినట్లైతే, శరీరం మీద తేమ లేకుండా చేసుకోవాలి. తర్వాత దుస్తులను ధరించాలి.
4. డియోడరెంట్స్ ఇరవై నాలుగు గంటలు శరీరానికి రక్షణ కల్పిస్తుంది. సుంగధ ద్రవ్యాల డియడరెంట్స్ ను ఆ సువాసనలు ఎక్కువ సమయం నిలిచి ఉండేందుకు సాధరణ చిట్కాలేంటో చూద్దాం..

1. శరీరంలో బ్యాక్టీరియాను తొలగించడానికి రోజుకు కనీసం రెండు సార్లైనా స్నానం చేయాల్సి ఉంటుంది. శరీరంపై పడే దుమ్ము ధూలి నుండి ఏర్పడ బ్యాక్టీరియా, క్రిములు దుర్వాసన ఏర్పడటానికి కారణం. ఆ దుర్వాసనను తొలగించడానికి వేడినీళ్ళతో స్నానం చేయడం కంటే గోరు వెచ్చని లేదా చల్లని నీటితో స్నానం చేయాలి. వేడి నీళ్ళతో స్నానం చేయడంతో ఆ వేడికి శరీరంలో మళ్ళీ చెమట పడుతుంది.

2. చెమటలు పట్టించేలా ఉండే దుస్తులను ధరించకపోవడమే మంచిది. పాలిస్టర్, థిక్ ఫ్యాబ్రిక్ దుస్తులు వేసుకోకూడదు. వీటి ద్వారా చెమట తొందరగా పడుతుంది.

3. వేసవిలో కాటన్ దుస్తులు ధరించడం ఉత్తమం. చెమట పట్టినా కూడా కాటన్ దుస్తులు చెమటను పీల్చుకొంటాయి.

4. డియోడరెంట్ రోలర్ ను ఉపయోగించేట్లైతే టాల్కమ్ పౌడర్ ను కూడా అప్లై చేస్తే సుగంధపరిమళాల వాసనలు ఎక్కువ సేపు నిలిచి ఉంటాయి.

5. చంక క్రింది ఎప్పటికప్పడు హెయిర్ ను తొలగిస్తుండాలి. లేదంటే చెమటకు బ్యాక్టీరియా చేరి దుర్వాసను పెంచుతుంది.

6. డియోడరెంట్ వాసనలు ఎక్కువ సేపు నిలిచి ఉండాలంటే స్నానానికి ముందే చంకల కింద టూత్ పేస్ట్ అప్లై చేసి, పది నిమిషాల తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది.

7. ఫుల్ స్లీవ్స్ లేదా ఫుల్ షర్ట్స్ ధరిస్తున్నట్లైతే పెర్ ఫ్యూన్ దుస్తులపై పూర్తిగా అప్లై చేసుకోవాలి.

8. పన్నీటిలో సువాసన కలిగిన పెర్‌ఫ్యూమ్‌ను ఒకటి రెండు చుక్కలు కలిపి, శరీరం మీద చల్లుకోవచ్చు.

9. పెర్‌ఫ్యూమ్‌ కొనబోయేముందు ఆ పెర్‌ఫ్యూమ్‌ను చేతిమీద రాసుకుని, ఆ వాసన నచ్చిందా, అది తమ చర్మానికి పడిందా అని చెక్‌ చేసుకోవాలి. పెర్‌ఫ్యూమ్‌ వాసన మారకుండా అలాగే ఉంటే, ఆ పెర్‌ఫ్యూమ్‌ను ఉపయోగించవచ్చు.

10. పెర్‌ఫ్యూమ్‌ సువాసనలో తేడాలుంటాయి. రకరకాల మూలికలతోనూ, పరిమళాల పుష్పాలతోనూ, సుగంధాలు కలిగిన ఆకులతోనూ కూడా పెర్‌ఫ్యూమ్స్‌ను తయారుచేస్తారు. స్త్రీలకు, పురుషులకు ప్రత్యేకంగా తయారు చేయబడిన పెర్‌ఫ్యూమ్స్‌ను వాడటంవల్ల సువాసన కాకుండా దుర్వాసన కలుగుతుంది. అంతే కాకుండా చర్మానికి ఎలర్జీ కలుగుతుంది. ఎవరి శరీరతత్వాన్ని బట్టి వారు, చర్మానికి సరిపడే పెర్‌ఫ్యూమ్‌ను ఎన్నుకోవాలి. అంతే కానీ, తోటివారు ఉపయోగిస్తున్నారు కదాని, దాన్నే వాడకూడదు.

English summary

Tips To Make A Deodorant Last Longer...! |సుంగంధ పరిమిళాలు ఎక్కువ సమయం నిలిచేలా...|

Smelling good all day long is the main motto during summers. Maintaining personal hygiene by bathing twice a day and applying perfumes or deodorants becomes the basic necessity of this hot season. Many people try making natural deodorants or perfumes at home by using essential oils and extracts. To socialize on a summer day without being uncomfortable and the urge to smell good keeps attacking you. So, we give you some of the proper techniques to apply a deodorant to feel fresh for 24 hours.
Story first published:Saturday, August 11, 2012, 15:30 [IST]
Desktop Bottom Promotion