Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వేసవిలో చీకాకు పెట్టే చెమట...నివారణోపాయాలు...

మనిషి శరీరంలో వేడి, ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు చెమట ఎక్కువగా ఉత్పత్తి కావడం సహజం. అది ఆవిరి అయ్యే ప్రక్రియలో భాగంగా శరీరాన్ని చల్లబరుస్తుంది. అంటే వేడిగా ఉన్న శరీరాన్ని చల్లబరిచేందుకు చెమట పట్టడం సహజం. చెమట అధికంగా పట్టేవారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కొంతమేరకు ఉపశమనం పొందవచ్చు.
1. ముఖ్యంగా చెమట ఎక్కువగా పట్టేవారు రోజూ రెండుసార్లు స్నానం చేస్తే మంచిది. శరీర శుభ్రతపై ప్రత్యేక శ్రద్ద కనబరచండి
2. అలాగే, తేమ కలిగిన సబ్బులకు బదులు సాధారణ సబ్బులు వినియోగించడం మంచిది. వేపతో తయారు చేసిన సబ్బులను వినియోగిస్తే శరీరం నుంచి వచ్చే చెమట దుర్వాసన మటుమాయమౌతుంది.
3. పరిశుభ్రమైన దుస్తులు, కాటన్ దుస్తులు ధరించడం వల్ల కొంత మేరకు చెమటను నివారించవచ్చు. ఉతకని దుస్తులను అల్మారాలో ఉంచితే మరింత దుర్గంధం వ్యాపిస్తుంది. దీంతో బ్యాక్టీరియా మరింతగా రెచ్చిపోయి విపరీతమైన దుర్గంధాన్ని పుట్టిస్తుంది.
4. ఒక్క రోజు వాడిన బట్టలను అల్మారాలో పెట్టకండి.. ముఖ్యంగా మీరు ధరించే దుస్తుల్లో సింథటిక్ వస్త్రాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
5. ఆహారం విషయంలో నూనె పదార్థాలు, వేపుళ్లు, కారం మసాలాలు వీలైనంతగా తగ్గించాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు నాన్ వెజ్ తినకపోవడమే ఆరోగ్యకరం. పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. మసాలా దినుసులతో కూడిన ఆహారం లేకుండా చూసుకోవాలి.
6. వేసవితాపాన్ని తగ్గించడం లోనూ, దప్పికను తీర్చడంలోనూ మజ్జిగ ఎంతో ఉపయోగ పడుతుంది. ప్రతిరోజూ గ్లాసెడు మజ్జిగ తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే వేసవి వాతావరణానికి తగ్గ పండ్లను తినాలి. ఇటువంటి జాగ్రత్తలతో వేసవితాపం నుండి బయట పడవచ్చు...



Click it and Unblock the Notifications