For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొలెస్ట్రాల్ దూరం చేసే పోపుల పెట్టె....!

|

Top 7 Indian spices - Goodness in the kitchen
అల్లం: ప్రతి రోజూ అల్లంను తీసుకోవడం వల్ల కండరాలు పట్టడం..బిగుసుకోవవడాన్ని నిరోధిస్తుంది. నొప్పులను, వాపుల్ని తగ్గించే అల్లం మీ ఆహారం ప్రతి రోజ తీసుకోవడం ఎంతో మంచిది. ఆస్పిరిన్ కన్నా అల్లం కండరాల నొప్పుల తగ్గించి, ఒట్లో ఉన్న కొలస్ట్రాలో తగ్గిస్తుంది. నోటికి రుచి తెలియకున్నా, ముక్కువాసన గుర్తిం చలేక పోయినా చిన్న అల్లంముక్కను పైతోలు తీసేసి పచ్చిది నమిలి మింగి నీరు తాగితే చాలు..

లవంగాలు: లవంగాలు రుచి కోసం కూరలలో వేసుకునే ఒకరకమైన పోపుదినుసులు . వీటిలో వాసనేకాడు .. విలువైన పోషకాలు ఉన్నాయి. మొటిమలు, రాష్‌లు, దద్దుర్లు... వంటి చర్మ సమస్యలకూ లవంగనూనె ఉపయోగపడుతుంది. ఇది దోమల్నీ దరిచేరనివ్వదు. అద్భుత ఔషధం! లవంగాల్లోని యుజెనాల్‌ అనే రసాయనానికి అద్భుత ఔషధ, పోషక విలువలు ఉన్నాయి. యుజెనాల్‌ కఫానికి విరుగుడుగా పనిచేస్తుంది.

పసుపు: పసుపులో యాంటి ఆక్సిడెంట్ గుణాలు గల అత్యంత శక్తివంతమైన కుర్ కుమిన్ సమద్దిగా ఉంది. ఇది కణాల పెరుగదలకు దోహదం చేస్తుంది. కాబట్టి గాయాల అనంతరం కండరాలు కోలుకోవడానికి, కణజాలం పెరగడానికి తోడ్పడుతుంది. పసుపు నీరు, సున్నం, గుడ్డులోని తెల్ల సొన, వాముపొడి సమపాళ్లలో కలిపిన మిశ్రమాన్ని కండరాల నొప్పులకు, బెణుకులుకు పైపూత రాస్తే తగ్గిపోతాయి. ఒక చెంచా మెత్తని పసుపుతో పాలమీది మీగడ, గంధం పొడి,శనగపిండి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే నిగనిగలాడుతుంది.

జీలకర్ర: జీలకర్రను మనం రోజువారీగా వాడుతూనే ఉంటాం. శరీరంలో ఏర్పడే తామర, తెల్లమచ్చలు, బొల్లి వంటివి ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా దెబ్బతీస్తాయి. అందుకనే ఇటువంటి చర్మ వ్యాధులను త్వరిత గతిన గమనించి, వాటి బారి నుండి బయటపడడం చాలా అవసరం. ఇందుకుగాను సులభమైన పెరటి వైద్యం జీలకర్ర - చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలర్జీకి జీలకర్ర గొప్ప ఔషధం. భోజనం తరువాత జీలకర్ర నమిలితే దంతాలు పుచ్చిపోకుండా ఉండటమే కాకుండా అజీర్తి, మలబద్దకం తగ్గిపోతాయి. జీలకర్ర,పసుపు, గంధం సమపాళ్లలో కలిపి మొత్తగా నూరి రోజూ ముఖానికి రాసుకుంటే అందమైన మార్పును మీరే గమనించవచ్చు.

మిరియాలు: రుచికి ఘాటుగానూ, కారంగానూ ఉంటాయి. మిరియాలు ఏదో ఒకరకంగా తీసుకోవడం వల్ల ఉదరంలో పేరుకున్న వాయువును వెలుపలికి నెట్టివేసే శక్తి మిరియాల సొంతం. శరీరంలో రక్తప్రసరణా వేగవంతం అవుతుంది. కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. వీటి వాడకం వల్ల శరీరంలో స్వేద ప్రక్రియ పెరుగుతుంది. మూత్రవిసర్జన సాఫీగా సాగుతుంది. కండర నొప్పులు దూరం... జలుబు, దగ్గు, ఆయాసంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే... గ్రాము మిరియాలు తీసుకుని దోరగా వేయించి పొడిచేసి.. చిటికెడు లవంగాల పొడి, పావుచెంచా వెల్లుల్లి మిశ్రమం తీసుకుని.. గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి.. తేనెతో రోజూ రెండు మూడుసార్లు చొప్పున తీసుకోవాలి

ఆవాలు: చిటపటలాడే అవాలకు అనేక ఔషధ గుణాలున్నాయి. వీటిలో మెగ్నీషియం , కాల్సియం , మాగనీస్ , జింక్ , ఒమెగా 3 ఫ్యాటియాసిడ్స్ , ప్రోటీన్లు , పీచుపదార్దము ఉంటాయి . ఘాటైన వాసనను కలిగి ఉండే ఆవాలు ఆయుర్వేదంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. పైథోన్యూట్రియంట్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్‌ ఎక్కువగా లభిస్తాయి. పంటి నొప్పి ఉన్న వాళ్లు కొద్దిగా అవాలు నమిలితే నొప్పి తగ్గుతుంది. అవాలు మెత్తగా నూరి గజ్జి, తామరకు పైపూతగా రాస్తే త్వరగా తగ్గిపోతాయి.

వెల్లుల్లి: ఘాటైన వాసన ఇచ్చే వెల్లుల్లి గుండెకు నేస్తం, క్యాన్సర్ కు ప్రబల శత్రువు. దీన్ని నేరుగా వేయించకూడదు. వెల్లుల్లిని ఒలిచి పది నిముషాలు అలా ఉంచితే క్యాన్సర్ నిరోధించే ఎంజైమ్ ఎలెనాస్ బాగా మెరుగవుతంది. రోజుకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తిన్నట్లయితే కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది , కాలేయము ఆరోగ్యానికి ,కీళ్ళనొప్పులు తగ్గడానికి పనికివస్తుంది . రిల్లీ కుటుంబానికి చెందిన ఈ వెల్లుల్లి ... నీరుల్లికి దగ్గర చుట్టం .. దానికన్నా ఔషధ గుణాలు ఎక్కువ. అంతే కాకుండా పాదాలకు ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చి బాధ పెడుతుంటే వెల్లుల్లి రెబ్బను చిదిమి దాన్ని ఫంగస్‌ ఉన్నప్రాం తంలో రాసి అరగంట తరువాత కడగాలి. ఈ విధంగా పది రోజులు చేస్తే ఫంగస్‌ మటాష్‌.

English summary

Top 7 Indian spices - Goodness in the kitchen...! | కొలెస్ట్రాల్ దూరం చేసే పోపుల పెట్టె....!

Herbs and spices have been used in cooking for ages, but the usefulness of these are not restricted to just their culinary use. Ten Indian spices - Goodness in the kitchen is intended to bring out natural healing properties of these spices and also the place of a spice in a culture.
Story first published:Friday, April 27, 2012, 15:50 [IST]
Desktop Bottom Promotion