Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
గోళ్ళు అందంగా.. ఆకర్షణీయంగా మెరుస్తుండేందకు లెమన్ మేనిక్యూర్

నిమ్మకాయ: నిమ్మకాయతో ఇతర వస్తువులను మిక్స్ చేసి మేనిక్యూర్ గా ఉపయోగించుకోవచ్చు. అయితే మీకు సమయం లేదనో, బిజిగా ఉన్నా, నిమ్మ కాయతో మాత్రమే మేనిక్యూర్ చేసుకోవచ్చు. మేనిక్యూర్ చేసే ముందు చేతులను రెండింటిని వేళ్ళు మునిగేలా వేడి నీళ్ళలల్లో రెండు మూడు నిమిషాల ముంచి, తర్వాత నిమ్మకాయను స్లైస్ గా కట్ చేసి వేళ్ళు చివరలు, గోళ్ళను బాగా రుద్దాలి. ఐదునిమిషాల తర్వాత తిరిగి వేడినీళ్ళలో చేతులను శుభ్రం చేసుకొని, మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి. దీన్నే లెమన్ మేనిక్యూర్ అంటారు. ఇలా చేయడం వల్ల చేతి వేళ్ళు మీద, జాయింట్స్ లో నలుపు దనం పోయి చేతి వేళ్ళు, గోళ్ళు ప్రకాశవంతంగా మారుతాయి.
నిమ్మకాయ - ఉప్పు: ఇది మొదట చేసిన లేమన్ మేనిక్యూర్ లాగేనే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా చాలా సులభమైన మేనిక్యూర్ పద్దతి. మేనిక్యూర్ చేసే ముందుగా వేళ్ళు, గోళ్ళు మీద సాల్ట్(ఉప్పు)ను చిలకరించి, ఆ తర్వాత నిమ్మకాయ చెక్కతో బాగా రుద్దాలి. తర్వాత గోరు వేచ్చని నీటితో, సోప్ వాటర్ తో చేతులను శుభ్రం చేసుకొని, మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చేతి వేళ్ళు, గోళ్ళు సహజంగా మెరుస్తుండటమే కాకుండా, మృత చర్మాన్ని తొలగించి వేళ్ళు సున్నితంగా కనబడుతాయి. అలాగే మరో చిన్న పద్దతితో కూడా మేనిక్యూర్ చేసుకోవచ్చు. నిమ్మరసం, ఉప్పును గోరువెచ్చని నీటిలో వేసి అందులో పదినిమిషాల పాటు చేతులను ముంచి, తర్వాత బ్రష్ తో బాగా రుద్ది, మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.
లెమన్ - పంచదార: హోం మేనిక్యూర్ లో నిమ్మకాయ ప్రధానంగా పనిచేస్తుంది. ఇది గోళ్ళను శుభ్రపరచడంలో అతి సులభమైన పద్దతి. కాబట్టి నిమ్మకాయతో పంచదారను చేర్చి సహజ పద్దతిలో వేళ్ళు, గోళ్ళను స్ర్కబ్ చేయాలి. లేదంటే నిమ్మరసం, పంచదార నీళ్ళలో వేసి చేతులను అందులో పదినిమిషాలు ముంచి బయటకు తీసి రుద్ది కడగాలి. ఇలా చేయడం వల్ల గోళ్ళు మెరుస్తూ అందంగా, శుభ్రంగా ఉంటాయి.
లెమన్ - గ్లిజరిన్: నిమ్మకాయ గోళ్ళను శుభ్రపరిచి, తెల్లగా, మెరుస్తుండేట్లు చేస్తుంది. అలాగే చర్మ పొడిబారేట్లు చేస్తుంది. ఒక వేళ మీరు పొడి చర్మతత్వం కలవారైతే, నిమ్మరసంలో కొన్ని చుక్కల గ్లిజరిన్ కలిపి అందులో చేతును పదినిమిషాల పాటు ముంచి ఉండాలి. తర్వాత బ్రెష్ తో స్ర్కబ్ చేస్తే చేతి గోళ్ళ చుట్టూ ఉన్నమృత చర్మాన్ని తొలగించడమే కాకుండా, జాయింట్స్ లో ఉన్న నలుపు పోతుంది.



Click it and Unblock the Notifications