For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందమైన శరీరానికి సొగసైన మెడ

|

Very Simple Tips for Beautiful Neck...!
స్త్రీ అందంగా కనబడాలంటే ముఖం చేతులు, కాళ్ళు మాత్రమే కాదు. అందమైన శరీర ఆకతి, శంకం లాంటి కంఠం ఉన్నప్పుడు ఆ అందం మరింత ఇనుమడింప చేస్తుంది. కొందరికి వీపు ప్రాంతంలో మొటిమల మచ్చలు ఏర్పడతాయి. మరికొందరికి పొడిబారేతత్వం వల్ల చర్మం పొట్టురాలడం జరుగుతుంటుంది. అలా జరగకుండా, శంఖంలాంటి మృదువైన మెడ, అందమైన వీపు మీ సొంతం కావాలని అనుకుంటే.. జాగ్రత్తలు తప్పనిసరి.

1. మెడచర్మం సున్నితం కాబట్టి బరబరా రుద్ది శుభ్రం చేయకూడదు. జుట్టునుంచి మెడకు అంటుకునే జిడ్డును తొలగించేందుకు స్నానం చేసేటప్పుడు ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి.

2. మిలమిల మెరిసే ఛాయ, మృదువైన చర్మం కోసం బొప్పాయి గుజ్జును పది నిమిషాల పాటు ప్యాక్‌గా వేసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.

3. మెడ నలుపుగా మారిన వారు బొప్పాయి గుజ్జు ప్యాక్‌ వేసుకుంటే తెలుపుదనమే కాకుండా నునుపు దనం కూడా వస్తుంది.

4. ఎండల్లో తిరిగినప్పుడు ఇంటికి రాగానే వేడినీటితో మెడను శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మెత్తని టవల్‌తో తుడుచుకోవాలి.

5. మెడచుట్టూ ఉన్న ముడతలు పోవాలంటే ఒక చెంచా కోడిగుడ్డులోని తెల్లసొన చెంచా పాలమీగడ కొంచెం రోజ్‌వాటర్‌ కలిపిన పేస్టును మెడకు పట్టించాలి.

6. మెంతి ఆకుల రసాన్ని, శనగపిండి కలిపి మెడకు రాయాలి. 20నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరచుకుంటే మెడ అందంగా మెరిసిపోతుంది.

7. వేడినీటిలో టవల్ ముంచి, గట్టిగా పిండి, దానిని మెడకు చుట్టుకొని పదినిమిషాల పాటు అలాగే ఉంచాలి. దానివల్ల చర్మానికి ఆవిరిపట్టి రక్తవూపసరణ మెరుగవుతుంది.

8. కలబంద గుజ్జు, పసుపు, శనగపిండి కలిపి మెడ నుంచి భుజాల కింద వరకు ప్యాక్ వేయాలి. తర్వాత వేడినీటిలో ముంచిన దూదితో ప్యాక్‌ను పూర్తిగా తీసేయాలి.

9. రోజుకు కనీసం రెండుమూడు సార్లు, నాలుగు నిమిషాలపాటు మెడను పైకి ఎత్తడం, వంచడం, అటూ ఇటూ తిప్పాలి. దానివల్ల మెడ కండరాలు చక్కగా పనిచేస్తాయి.

10. గిల్ట్ నగలు ధరించటంవల్ల నల్లటి మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటివల్ల దురదలు కూడా వస్తాయి. కాబట్టి వేసవికాలంలో గిల్టు నగలను ధరించకపోవటం ఉత్తమం.
మెడ భాగానికి ఆలీవ్ ఆయిల్ రాసి మసాజ్ చేయటంవల్ల ఆ ప్రాంతమంతా నున్నగా, మృదువుగా ఉంటుంది. రాత్రి పడుకోబోయేందుకు ముందుగా ఆలీవ్ నూనెను రాసి, ఉదయాన్నే లేచిన వెంటనే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

English summary

Very Simple Tips for Beautiful Neck...! | అందమైన శరీరానికి సొగసైన మెడ

A beautiful neck supported with a beautiful shoulder makes a woman look elegant and tall. Beautiful, long and smooth neck has always been considered an emblem of beauty in women, Although neck is one part of the body where age shows its quick effects. Along with that chubbiness has its first effects on one’s neck.
Story first published:Friday, April 13, 2012, 16:27 [IST]
Desktop Bottom Promotion