For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో ఎలాంటి దుస్తులు ధరించాలి...?

|

చినుకులు పడ్డాయంటే చాలు ప్రతి ఒక్కరిలో ఎంతో ఆనందం చిన్నారుల నుంచి పెద్దల వరకూ అందులో తడిసి ముద్దవ్వాలని కోరుకుంటారు. కారు మబ్బులు.. చల్లని పిల్ల గాలులలో సందడి చేసే చిటపట చినుకులు ప్రతి ఒక్కరినీ పరవశింపచేస్తాయి. ఈ కాలంలో ప్రమోదంతో పాటు ప్రమాదాలు ఉన్నాయి. చిన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కుటుంబమంతా ఆరోగ్యంగా ఆనందంగా గడపవచ్చు.

What to wear during Rainy Season...?

డ్రస్సింగ్‌లో ఎంతో కేర్‌...వర్షాకాలంలో యువతరం బట్టల గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఇక కాలేజీకి వెళ్లే విద్యార్ధులకు దీని పట్ల కేర్‌ అవసరం. ఎండల్లో పల్చని రంగులు వాడిన ప్పటికీ ఇప్పుడు ముదురు రంగులు వాడాలి. వాతావరణం డల్‌గా ఉంటుంది కనుక ముదురు రంగు బట్టలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. తేలికపాటి బట్టలు వాడితే ఎంతో మంచిది. తెలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం ఈ కాలంలో ఎంతో శ్రేయస్కరం.

బట్టలు పొడిగా వుంచుకోవాలి. తడి వల్ల బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది. అందుకే ఎక్కువసేపు తడిగా వుండకూడదు. తడికాలంలో బట్టల గురించి శ్రద్ధ పెట్టాలి. నిన్నటి వరకు ఎండలు కాబట్టి పల్చటి రంగుల బట్టలు వాడాం. ఇప్పుడు ఎంచక్కా ముదురు రంగు బట్టలు వేసుకోవచ్చు. బయట వాతావరణం డల్‌ గా వుంటుంది కనుక ముదురు రంగు బట్టలు మనలో కొంత ఉత్సాహాన్ని తీసుకొస్తాయి. పైగా మురికి వదిలించడం తేలిక.

మరీ ముఖ్యంగా తెలుపు రంగు బట్టలను దూరంగా వుంచడమే మంచిది. మురికి పట్టిందంటే వదలదు. ఏ చిన్న మరక పడ్డా అల్లంత దూరానికి కూడా కనిపించి అసహ్యంగా వుంటుంది. తేలికపాటి బట్టలు వాడితే మంచిది. తడిచినా త్వరగా ఆరతాయి. ఉతికినా తేలిగ్గా ఆరతాయి. ముసురు తగ్గాక దుప్పట్లు, రగ్గులు, బొంతలు, దిళ్లు, పరుపులు, మందపాటి బట్టలను కాసేపు అలా ఎండలో వేస్తే బావుంటాయి. వాసన కూడా రాదు.

శరీరం ఎప్పుడూ సాధారణ ఉష్ణోగ్రతలో వుండేలా చూసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు క్రిములు దాడి చేసే ప్రమాదం ఎక్కువ. వానాకాలం అన్నాళ్లూ బయటికెళ్లేటప్పుడు గొడుగు/రెయిన్‌కోట్‌ వెంట వుండాలి.

ఒకవేళ వానలో తడిచినా ఇంటికి రాగానే తలస్నానం చేయాలి. 'వానలో తడిచాం కదా. ఇంకా ఇదెందుకు?' అనుకుంటే పొరబాటే. ముందే చెప్పుకున్నాంకదా. బయట రోడ్లమీద నీళ్లు ఎంత మురికిగా వుంటాయో! అందుకన్నమాట. తల, శరీరం పొడిగా తుడుచుకోవాలి.

English summary

What to wear during Rainy Season...? | వర్షాకాలం డ్రెస్సింగ్ కేర్....?

During the rainy season, it’s quite a problem for some getting dressed up for school or for the office. Of course, they still want to look good despite the downpour. sunny or rainy days. Have a sturdy umbrella, something that won’t break on heavy rain and strong wind. Pick a design that would take away the gloominess on a rainy day.
Story first published: Thursday, July 19, 2012, 16:54 [IST]
Desktop Bottom Promotion