Latest Updates
-
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
టాట్టూ వేయించుకోవాలా? అయితే శరీరంపై ఈ భాగాల్లో వేయించుకుంటే కేక..
ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా సాధారణ యువతీ యువకులే కాదు, సెలెబ్రిటీలూ టాట్టూలు వేయించుకుని ఆనందిస్తున్నారు. ఆమధ్య సైఫ్ అలీఖాన్ కరీనాకపూర్ పేరుతో టాట్టూ వేయించుకునే ఆ అమ్మడినిక ఇంప్రెస్ చేశాడు. నటుడు నాగార్జున కూడా 'టాట్టూ క్లబ్'లో సభ్యుడే. హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీకీ టాట్టూల పిచ్చి ఉంది. ఆమె తన ఒంటిపై దాదాపు డజను టాట్టూలు పొడిపించుకుంది. పది టాట్టూలను చెరిపేసే కళలో కూడా ఆమె ఆరితేరింది.
ఇంతకూ టాట్టూ అంటే ఏంటి? టాట్టూ అంటే తెలుగులో మనం పల్లెటూర్లలో చిన్నప్పుడు వేయించుకునే పచ్చబోట్టు లాంటిదన్నమాట. కానీ టాట్టూ అనేది ఇప్పుడు చాలా పెద్ద ప్యాషన్ అయిపోయింది. ఒక్కసారి మనం మన శరీరం మీద టాట్టూ వేయించుకుంటే కొన్ని రకాల టాట్టూలు చెరిగిపోతాయి, మరికొన్ని రకాల టాట్టూలు చెరిగిపోవు. పచ్చబొట్టు పాతమాట. టాట్టూ అనేది కొత్త బాట. ఈ కాలంలో ఇదో వేలం వెర్రి. చేతిమీదా ఛాతీమీదా ఒళ్లంతా టాట్టూ వేయించుకని సంబరపడే వారి సంఖ్య పెరుగుతోంది. ఎవరిష్టం వాళ్లది.

నెక్ టాట్టూ(మెడ మీద): బాలీవుడ్ సెలబ్రెటీ దీపికా పదుకొనే మెడ వెనుక బాగంలో వేయించుకొన్న టాట్టూ అద్భుతంగా సౌందర్యంగా కనబడుతోంది. మెడ మీద టాట్టూ వేయించుకొన్నప్పుడు అది మరింత అందగా ఇతరకు కనబడాలంటే జడను పైకి కట్టేయడం లేదా, పోనీటైల్ వేసుకోవడం లేదా ముడి వేయడం చేస్తే బాగుంటుంది.

షోల్డర్ బ్లేడ్: మందిరా బేడి హాట్ హాట్ గా తన బ్యాక్ పోర్షన్ లో షోల్డర్ వంపుల్లో శృంగారభరితంగా వేయించుకొని హాట్ హాట్ గా కనబడుతోంది. ఈ టాట్టూ డిజైన్ చూస్తుంటే ‘ఓమ్'ఆకారాన్ని పోలి ఉంది.

లోయర్ బ్యాక్: రీసెంట్ గా బాలీవుడ్ నటి అనుష్క శర్మ ‘దేకో మగర్ ప్యార్ సే'అని ఓ అద్భుతమైన టాట్టూను తన నడుము వంపుసొంపుల్లో వేయించుకొంది. ఈ టాట్టూ డిజైన్ జీన్స్, షార్ట్ వేసుకొన్నప్పుడు ఇంత ఆకర్షణీయంగా కనడుతుంది.

భుజాలా మీద: భుజాల మీద వేసుకొనే టాట్టూలు చాలా రకాలుగా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉన్న హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ తన పిల్లల పుట్టిన రోజు తేదీలను ఇలా తన భుజం మీద పొడిపించుకొన్నది . ఇలా భుజాల మీద పొడుపించుకొనే టాట్టూలు స్లీవ్ లెస్ వేసుకొన్నప్పడు అద్భుతంగా ఆకర్షణీయంగా కనబడుతాయి.

ముంజేయి: జానీ దెబ్బ్ తన ముంజే మీద వివిధ రకాల టాట్టూల పొడిపించుకొని అందగా కనబడుతున్నాడు. అతని ఒక ముంజేయి మీద జాక్ (అది అతని కుమారుడి పేరు)పొడిపించుకొని ఆకర్షింపబడుతున్నాడు.

కండరాల మీద: సాధారణంగా స్త్రీలు కండర పుష్టి కలిగిన మగవారిని ఎక్కువ ఇష్టపడుతుంటారు. అటువంటి వారు ఆ కండరాల మీద టాట్టూలను వేయించుకుంటే ఇక అంతే వారికి ఫ్లాట్ అయిపోవాల్సిందే..

ఆర్మ బ్యాండ్: భుజాల దగ్గర ఒక బ్యాండ్ తరహాలో వేయించికొని ఆకర్షణగా నిలిచింది ఈ సెలబ్రెటీ. ఈమె పమేలా ఆడర్ సన్ తన భుజాల మీద చైన్ లేదా రింగ్ ఆకారంలో ఇలా పచ్చబొట్టు పొడిపించుకొని చూపరులను ఆకర్షింపబడుతోంది.

చీలమండము(ankle): Ankle టాట్టూ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది ఇక్కడున్న సెలబ్రెటీ పెనిలోప్ క్య్రూజ్ తన చేతి చీల మండము మీద ‘883'అనే టాట్టూతో అలరిస్తోంది. అయితే 883 ఏమిటో చెప్పడానికి నిరాకరిస్తోంది.

నాభి: నాభి(బొడ్డు)చుట్టూ వేయించుకొన్న ఈ టాట్టూ హాట్ హాట్ గా కనబుడుతోంది. ఇండియన్ అవుట్ ఫిట్స్ లో, శారీ, లంగాఓనీల్లో ఆకర్షణీయంగా కనబడే ప్రదేశం అది.

చెస్ట్(ఛాతీ): సాధారణంగా పురుషుల ఛాతీ ప్రదేశం చాలా వెడల్పుగా ఉంటుంది కాబట్టి, ఆ ప్రదేశంలో టాట్టూ వేయించుకొన్నా మరింత ఆకర్షణీయంగా పెద్దదిగా కనబడుతుంది. కాబట్టీ ఏదైనా ఫ్యాన్సీ టాట్టూను పెద్దదిగా వేయించుకోవాలనుకొన్నప్పుడు ఇలా ప్రయత్నించవచ్చు .
పచ్చబొట్టు శరీరానికి రక్షణ కల్పిస్తుందని, శరీరానికి భౌతికమైన శక్తి సమకూరుస్తుందని, శరీరపు నొప్పులను నయం చేస్తుందన్న విశ్వాసం ఈ నాటిది కాదు... నాటి గిరిజనం తమ తెగకు గుర్తుగా.... పచ్చబొట్టును ఉపయోగించగా... తరువాతి కాలంలో నక్షత్రాలను, దేవు ళ్ల రూపాలను పచ్చబొట్లుగా పొడిపించుకోవటం ప్రారంభమైంది. అయితే నటి నాగరికత యువత ఫ్యాషన్‌గా పచ్చబొట్లు స్ధానంలోకి టాట్టూలని తీసుకువచ్చారు. తమ రొమ్ములపైన, వెనక వైపున, ముంజేతుల మీద ముఖాలపైన వీటిని పొడిపించుకునేందుకు ఇష్టపడుతున్నట్లు... వారికి ఎక్కువ బాధ కలిగించకుండా బేటరీతో నడిచే పెన్నులతో ఈ రూపాలను చర్మంపైన ముద్రిస్తామని వీటిని వేసే నిపుణులు చెప్తున్నారు.
ఇవి పచ్చ బొట్ల నైపుణ్యం వృద్ధి లో మరో భాగమే... పాశ్చాత్య దేశాలలో పెదవులపై లిప్‌స్టిక్ రంగు శాశ్వతంగా ఉండి పోయే విధంగా మేకప్ లాగా కొంతమంది టాట్టూలు వేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. టాట్టూల వేయించుకోవడంలో ముఖ్యంగా రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి టాటు డిజైన్, రెండవది టాట్టూ వేసుకొనే ప్రదేశం. ఈ రెండింటిలో అవగాహన కల్పించుకుంటే టాటు వేయించుకొన్న ప్రదేశం చాలా అందంగా కనిపిస్తుంది. ఇతరులను ఆకర్షించగలుగుతుంది. డెవిడ్ బెక్ హామ్ టాటులు వేయించుకోవడంలో చాలా ఫేమస్. అలాగే మందిరా బేడి తన బ్యాక్ పోర్షన్ లో టాట్టూ వేయించుకొని సెక్సీగా కనబడుతుంది. కాబట్టి కొంత మంది సెలబ్రెటీలు వేయించుకొన్న టాట్టూలను గమనించినట్లైతే ఇతరులను ఇట్టే ఆకర్షించేయవచ్చు. మరి టాట్టూలను వేయించుకొనే సీక్రెట్ ప్లేస్ లు ఏంటో చూద్దాం...



Click it and Unblock the Notifications