For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోళ్ళను అందంగా..ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా?

|

స్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, ఒక రోజులో ఎన్నో పనులు. వీటిలో 50శాతానికి పైగా చేతులే చేస్తుంటాయి. అన్ని పనులను చేసే చేతులను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో ఎప్పుడైనా ఆలోచించారా?ముఖ్యంగా మహిళలు. ఇంటి పనుల్లో భాగంగా తుడవడం, కడగడం, రుద్దడం...వీటి కోసం చర్మానికి హాని కలిగించే రకరకాల రసాయనాలను రోజూ నేరుగానే ఉపయోగిస్తుంటారు. వీటి వల్ల చేతులపై చర్మమే కాదు, వేలి కొసల్లో ఉండే గోళ్లూ ఎంతగానో దెబ్బ తింటుంటాయి.

పసుపు రంగులో, పాలిపోయి, పలచగా, అక్కడక్కడా విరిగిపోయి, మరికిగా...‘మమ్మల్ని కాస్త పట్టించుకోవూ' అన్నట్టు చూస్తుంటాయి. కాని ‘తీరిక' లేదు అనే నెపంతో ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ, అప్పుడప్పుడు వాటికి రంగు వేస్తూ ఉంటారు. ‘ఇది శుభ్రతలో అతి పెద్ద లోపం' అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గోళ్లు అందానికే కాదు మన ఆరోగ్యాన్ని ఎదుటివారికి తెలియజేస్తుంటాయి. పాలిష్ తో గోళ్లను మభ్య పెట్టకుండా ఇంట్లోనే ‘నఖ' సొగసుకు ఏమేం చేయవచ్చో తెలుసుకుందాం.

10 Tips for Care Your Nails at Home

1. 20 నిముషాలు చాలా:
ముందుగా దూదితో కొద్దిగా పాలిష్ రిమూవర్ ని అద్దుకొని అప్పటికే గోళ్లకు ఉన్న రంగును తొలగించాలి. నెయిల్ పాలిష్ ఉన్నా లేకపోయినా ఇలాగే చేయాలి. దీని వాల్ల కంటికి కనిపించని క్రిములు కూడా తొలగిపోతాయి

2. వేళ్ళ చర్మం భరించగలిగేటంత నీటిని ఒక గిన్నెలోకి, చల్లని నీటి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. (వీలైతే కొద్దిగా మైల్డ్ షాంపూ నీటిలో కలపవచ్చు) వేడినీటి గిన్నెలో 5-8నిముసాల గోళ్ళు మునిగేలా వేళ్లను ఉంచాలి. తర్వాత చల్లటి నీటిలో ఉంచాలి. తర్వాత మెత్తటి పొడి టవల్ తో తడి లేకుండా తుడవాలి.

3. నెయిన్ కటర్ తో మీడియం లెంగ్త్ లో గోళ్లను కట్ చేసుకోవాలి. మెత్తబడిన గోరును సరైన షేప్ లో కట్ చేసుకోవాలి. మెత్తబడిన గోరును సరైన షేప్ లో కట్ చేసుకోవడం చాలా సులువు.

4. నెయిల్ ఫిల్లర్ తో ఒక్కో గోరు చివర భాగంలో రబ్ చేయాలి.

5. క్యూటికల్ ఆయిల్ ను గోరుచుట్టూ రాయాలి. ఇందుకోసం ఆలివ్ లేదా జొజొబా నూనెను వాడవచ్చు. వేలితో నూనె అద్దుకుని గోరు మీద, చుట్టూత క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మసాజ్ చేయాలి.

6. గోరుచుట్టూ ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ (క్యుటికల్స్)పుషర్ తో తొలగించాలి. (నెయిల్ కిట్ లో లేదా షాపులో విడిగానూ క్యూటికల్ పుషర్ లభిస్తుంది)ఆరోగ్యకరమైన గోళ్ళకు క్యుటికల్స్ చాలా ముఖ్యమైనవి. ఈ ప్లేస్ లోనే బ్యాక్టీరియా, ఫంగస్ చేరే అవకాశాలు ఉంటాయి. అందుకే అత్యంత జాగ్రత్తగా చర్మానికి హాని కలగకుండా క్యూటికల్స్ ను శుభ్రపరచాలి(అందుకోసం మరో పదినిముషాల సమయం పడుతుంది)

7. హ్యాండ్ లోషన్ ని వేళ్లకు, చేతులకు మాత్రమే ఉపయోగించాలి. పొరపాటును గోళ్ళ మీద నూనె, మాయిశ్చరైజర్ ఉంటే తుడిచేయాలి.

8. క్లియర్ బేస్ కోట్ ని ప్రతి గోరుకు వేయాలి తర్వాత నచ్చిన నెయిల్ పాలిష్ ను బ్రష్ తో తీసుకొని గోరు మధ్యన ఆ తర్వాత సైడ్స్ పాలిష్ వేసుకోవాలి.

9. టాప్ కోట్ ని ప్రతి గోరు మీద వేస్తే నెయిల్ పాలిష్ ఎక్కువ సమయం ఉంటుంది.

10. ఇలాగే కాలి గోర్లకూ చేయాలి.

English summary

10 Tips for Care Your Nails at Home

Fingernails or toenails really are very important segments connected with our hands and feet so that perfect care concerning nails is actually required.
Story first published: Saturday, October 19, 2013, 12:32 [IST]
Desktop Bottom Promotion