పొడిపాదాలను కాంతివంతంగా, సాఫ్ట్ గా మార్చే నేచురల్ ఆయిల్స్

మీరు పగిలిన పాదాలతో ఇబ్బంది పడుతున్నారా?అయితే, ఈ సమస్య మరింత తీవ్రతరం కాకముందే మరియు పాదులు అస్యహ్యంగా పగులక ముందే మీరు ఏదో ఒకటి చేయాలి. మీ పాదాల పగుళ్ళను నివారించడానికి అనేక హోం రెమడీస్ ను మీరు ఉపయోగించి ఉండవచ్చు. అయితే, ఈ హోం రెమెడీస్ ను ఎంత ఉపయోగించినా, మీరు నేచురల్ ఆయిల్స్ ను ఉపయోగించడం వల్ల మరింత ఉత్తమ ఫలితం లభిస్తుందంటారు. పాదాలు పగుళ్ళను నివారించి పాదాలను తేమగా ఉంచుకోవచ్చు.

ప్రస్తుతం మార్కెట్లో, డ్రై స్కిన్ కు అప్లై చేయడానికి వివిధ రకాల నూనెలో అందుబాటులో ఉన్నాయి. చర్మానికి అప్లై చేసే ఈ నేచురల్ ఆయిల్స్ నే మీరు మీ పాదాలకు కూడా అప్లై చేయవచ్చు. పాదాల పగుళ్ళు ఎందుకు ఏర్పడుతాయంటే, వాతావరణంలో మార్పులు మరియు మీరు కొన్ని మంచి అలవాట్లను పాటించకపోవడం, పాదాల మీద సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం చేత పగుళ్ళకు కారణం కావచ్చు. ఇంకా శరీరములో అధిక వేడి, పొడి చర్మం, ఎక్కువ సేపు నిలబడి పనిచేయువారికి సాదారణంగా వస్తుంటాయి. కఠిన నేలపై నడవడం కూడా ఒక కారణమే. ఎత్తైన చెప్పులు ధరించి నడవడంతో పాదల వద్ద రక్తప్రసరణ సరిగా జరగదు. అలాగే అధిక బరువు కలిగిఉండడం, పాదాల మీద శ్రద్ద తీసుకోకపోవడం, పోషకాహార లోపము పాదాల పగుళ్ళకు కారణమౌతున్నాయి...

ఈ సమస్యను నివారించడానికి మీరు కనుక ఒక మంచి జీవనశైలిని అవలంభిచినట్లైతే ఈ సమస్య నుండి బయటపడవచ్చు. లేదంటే, ఇప్పటికే మీరు ఈ సమస్యతో బాధపడుతుంటే అందుకు కొన్ని హోం రెమడీస్ నేచురల్ ఆయిల్ ను ఉపయోగించాలి. పాదాలను పొడిబారడం, మరియు పగుళ్ళను నివారించడానికి కొన్ని సహజనూనెలతో ట్రీట్ చేవయచ్చు. మీ పాదాలకు నేచురల్ ఆయిల్స్ ను ఉపయోగించడం వల్ల మీ పాదాల చూడటానికి అందంగా మరియు ముట్టుకుంటే సాఫ్ట్ గా ఉంటాయి . ఈ డ్రై ఫీట్ రెమెడీస్ నేచురల్ ఆయిల్స్ ఉపయోగించడానికి ముందు, పాదాలను శుభ్రం చేసుకోవాలి. మీరు స్నానం చేసిన తర్వాత ఆ నేచురల్ ఆయిల్స్ ను ఉపయోగించవచ్చు. మరిన్ని ఉత్తమ ఫలితాలకోసం రాత్రుల్లో నిద్రించే ముందు ఈ నేచురల్ ఆయిల్స్ అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచి, తర్వాత రోజు ఉదయం కడిగేయాలి.

నేచురల్ ఆయిల్ ను ఉపయోగించి డ్రైఫీట్ రెమెడీస్ ఒక సారి పరిశీలించండి...

1. ఆలివ్ ఆయిల్:

1. ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ ను చాలా రకాల బ్యూటీ ట్రీట్మెంట్స్ లో ఉపయోగించి ఉంటారు. ఆలివ్ ఆయిల్ పగిలిన మరియు చీలి పాదలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకు ఆలివ్ ఆయిల్ మరియు బాదాం ఆయిల్ ను రెండింటిని సమంగా తీసుకొని బాగా మిక్స్ చేసి కాళ్ళకు 15నిముషాల పాటు మసాజ్ చేయాలి. అరగంట తర్వాత నీళ్ళతో శుభ్రం చేసుకుంటే పాదాలు సున్నితంగా కనబడుతాయి. కొన్ని వారాల పాటు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 2. లావెండర్ ఆయిల్:

2. లావెండర్ ఆయిల్:

సువాసనభరితమైన ల్యావెండర్ ఆయిల్లో ఉన్న మంచి గుణాలు డ్రైఫీట్ కు చాలా మేలుచేస్తుంది. పొడిబారిన పాదాల మీద ల్యావెండర్ ఆయిల్ వేసి బాగా మసాజ్ లా చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటిలో 10నుండి20నిముషాల పాటు మీ పాదాలను నాననివ్వాలి. తర్వాత స్ర్కబ్ చేసి శుభ్రం చేసుకోవాలి.

3. కొబ్బరి నూనె:

3. కొబ్బరి నూనె:

ఇది ఒక సహజనూనె. పొడిబారిన పాదాలకు చాలా బెస్ట్ హోం రెమెడీ . డ్రై ఫీట్ నివారించడానికి ముందుగా మీ కాళ్ళను శుభ్రంగా కడిగి తర్వాత కొబ్బరి నూనెను మీ పాదాలకు అప్లై చేయాలి. ఇలా ప్రతి రోజూ రాత్రి నిద్రించే ముందు చేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

4. బాదం ఆయిల్:

4. బాదం ఆయిల్:

చర్మ సంరక్షణకు బాదం ఆయిల్ చాలా మేలు చేస్తుంది. ఇది పొడిబారిన చర్మాన్ని నయం చేయడమే కాదు, కాళ్ళ మీద ఉన్న స్కార్స్ ను కూడా మాయం చేసేస్తుంది. కాబట్టి, మీరు నిద్రించే ముందు బాదం ఆయిల్ ను మీ పాదాలకు అప్లై చేయండి.

5. జీడిపప్పు ఆయిల్ (క్యాష్వ్ ఆయిల్):

5. జీడిపప్పు ఆయిల్ (క్యాష్వ్ ఆయిల్):

క్యాషవనట్ ఆయిల్ ఒక బెస్ట్ డ్రై ఫీట్ హోం రెమెడీ అని చాలా మందికి తెలియదు . ఈ క్యాషవనట్ ఆయిల్ చాలా ఖరీదైనది మరియు ఈ నూనెను ఎక్కువ మంది ఉపయోగించరు. కానీ పొడి బారిన పాదాలకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి, నిద్రించే ముందు ఈ నూనెను కాళ్ళకు అప్లై చేయండి.

 6. అలోవెరా జెల్:

6. అలోవెరా జెల్:

మీరు పొడిబారి పాదాల సమస్యతో బాధపడుతున్నట్లైతే మరో సహజ హోం రెమెడీ కలబంద, మీ సమస్యను ఇది చాలా సులభం నయం చేస్తుంది. అలొవెరా ఆయిల్ మీ చర్మాన్ని తేమగా మరియు సాఫ్ట్ గా చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. కాబట్టి, ఈ నూనెను ప్రతి రెండు సార్లుకొకసారి ఉపయోగించండి.

7. పుదీనా ఆయిల్:

7. పుదీనా ఆయిల్:

ఈ పుదీనా ఆయిల్ మీ పాదాలకు అప్లై చేయడం వల్ల ఇది ఒక సున్నితమైన మరియు విశ్రాంతి అనుభూతిని కలిగిస్తుంది. పగిలిన, పొడి బారిన పాదాలకు ఈ నూనెను అప్లై చేయడం వల్ల పగుళ్ళు తొలగిపోతాయి.

8. లవంగాల నూనె:

8. లవంగాల నూనె:

నిపుణుల అభిప్రాయం ప్రకారం లవంగాల నూనె మీ పాదాలను మరియు చర్మాన్ని చాలా కాంతివంతంగా మరియు సెస్సిటివ్ గా, సాఫ్ట్ గా ఉంచుతాయి. దంతసంరక్షణకు మాత్రమే కాకుండా, ఈ క్లోవ్ ఆయిల్ ను డ్రై ఫీట్ ను నివారించడానికి కూడా, నేచురల్ రెమెడీగా ఉపయోగిస్తున్నారు.

9. యూకలిప్టస్ ఆయిల్:

9. యూకలిప్టస్ ఆయిల్:

ఘాటైన సువాసన కలిగిన ఈ యూకలిప్టస్ ఆయిల్ చర్మానికి చాలా మంచిది. ఒకటి రెండు చుక్కల యూకలిప్టస్ ఆయిల్ తో మీ పాదాలను మసాజ్ చేయండి. ఇలా వారానికి మూడు సార్లు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

10. సాండిల్ వుడ్ ఆయిల్:

10. సాండిల్ వుడ్ ఆయిల్:

మీ డ్రై ఫీట్ ను నివారించడం కోసం సాండిల్ వుడ్ ఆయిల్ ను ఉపయోగించండి. ఈ సాండిల్ ఉడ్ ఆయిల్ ఉపయోగించిన తర్వాత మీ పాదాలలో కాంతివంతమైన చర్మాన్ని మీరు గమనించగలరు. సాండిల్ వుడ్ ఆయిల్ టాన్ ని నివారిస్తుంది మరియు డ్రై స్కిన్ నయం చేస్తుంది .

Desktop Bottom Promotion