Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
బేకింగ్ సోడాతో సౌందర్యం..ఆరోగ్యం.. రెండూ సాధ్యమే...!
మీ ముఖాన్ని స్ర్కబ్ చేయడం లేదా పెడిక్యూర్ చేసుకోవడానికి బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు . ఇందులో ఉండే యంటాసిడ్, బేకింగ్ సోడా ప్రకృతిలో మద్యస్థ ఆమ్లం, కాబట్టి మలినాలను శుభ్రపర్చే సామర్థ్యం ఇందులో పుష్కలంగ
బేకింగ్ సోడాను సోడియం బై కార్బోనేట్ అని కూడా పిలుస్తారు. ఇది వంటలుకు మాత్రమే ఉపయోగించరు. కొన్నివస్తువుల క్లీనింగ్ ఏజెంట్ నుగాను ఉపయోగిస్తారు. అంతే కాదు బ్యూటీ కోసం కూడా దీన్ని ఉపయోగిస్తారు. దీని వల్ల చర్మానికి , కేశాలను అనే ప్రయోజనాలు ఉన్నాయి. మనకు తెలుసు మన బ్యూటీ కోసం ఫేస్ స్ర్కబ్బింగ్ కోసం ఉప్పు, పంచదారను ఉపయోగిస్తుంటాం. వాటితో పాటు ఈ వంటింటి వస్తువును చర్మ మరియు కేశ సంరక్షణలో ఉపయోగించి బ్యూటీని ఇప్రూవ్ చేసుకోవచ్చు.
మీ ముఖాన్ని స్ర్కబ్ చేయడం లేదా పెడిక్యూర్ చేసుకోవడానికి బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు . ఇందులో ఉండే యంటాసిడ్, బేకింగ్ సోడా ప్రకృతిలో మద్యస్థ ఆమ్లం, కాబట్టి మలినాలను శుభ్రపర్చే సామర్థ్యం ఇందులో పుష్కలంగా ఉంది. ఇది ముఖ చర్మం మరియు శరీర చర్మ సంరక్షణకోసం ఒక మంచి ఎక్స్ ప్లోయేట్ గా పనిచేస్తుంది.
మొటిమలు, మచ్చలు నివారించి, స్కిన్ వైట్ గా మార్చే బేకింగ్ సోడా ఫేస్ మాస్క్..!!
ముఖంగా బేకింగ్ సోడాను కడుపు గడబిడగా ఉన్నప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. ఈ బేకింగ్ సోడాను ఆరోగ్యానికి, మాత్రమే కాకుండా ఇతర స్కిన్ కేర్ మరియు బ్యూటీ ట్రీట్మెంట్ లలో కూడా ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే ఆర్గాన్స్ వల్ల అటు బ్యూటీలోనూ, ఇటు ఆరోగ్యానికి చాలా అద్భుతమైన ఫలితాలను అంధించవచ్చు. మీరు కనుక ఖరీదైన బ్యూటీ ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే, ఈ తక్కువ బడ్జెట్ తో బేకింగ్ సోడా ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడాను ఉపయోగించి తల వెంట్రుకల నుండి కాలి గోళ్ళవరకూ హెల్తీ మరియు బ్యూటీ ట్రీట్మెంట్ లో ఉపయోగించవచ్చు . మరియు ఈ బేకింగ్ సోడా ఎలా ఉపయోగించాలో చూద్దాం...

హెయిర్ ట్రీట్మెంట్: ఆయిల్ హెయిర్ లేదా జిడ్డు వెంట్రుకలను తొలగించడానికి ఒక చెంచా బేకింగ్ సోడాను, మీరు వేసుకొనే రెగ్యులర్ షాంపు బాటిల్ లో వేసుకోవాలి. చిటికెడు బేకింగ్ సోడా మీ కేశాల మీదు చిలకరించుకోవడం వల్ల మంచి మెరుపును అందిస్తుంది. అంతే కాదు మీ కేశాల్లో ఉండే క్లోరిన్ తొలగించడానికి బేకింగ్ సోడా బాగా సహాయపడుతుంది. క్లోరినేటెడ్ వాటర్ కు గురియైన కేశాలను మంచి మెరుపునివ్వాలంటే ఈ బేకింగ్ సోడా ఒక మగ్గ్ లో వేసి తలస్నానం తర్వాత తలమీద పోసుకుంటే మంచి షైనింగ్ ఉంటుంది.

చేతులు: బ్యూటీ పార్లర్ కు వెళ్ళి మానిక్యుర్ చేయించుకోవడం కంటే, ఈ బ్యూటీ వంటింటి వస్తువును ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడాను నీళ్ళల్లో లేదా లిక్విడ్ సోపులో వేసి మిక్స్ చేసి, చేతులకు వేసుకొని బాగా రుద్దాలి. దాంతో చేతులు శుభ్రపడటమే కాక, గరుకు తనం పోయి, చేతులు సున్నితంగా కనబడుతాయి. అంతే కాదు బేకింగ్ సోడాను మోచేతులకు రుద్దడం వల్ల గరుకు తనం పోయి చర్మం నునుపుగా తెల్లగా మారుతుంది.

నెయిల్ కేర్: కాళ్ళు, చేతి వేళ్ళు, గోళ్ళు శుభ్రంపడి మంచి షైనింగ్ తో మెరవాలంటే నెయిల్ బ్రష్ తీసుకొని బేకింగ్ సోడాలో ముంచి రుద్దడం వల్ల వేళ్ళు గోళ్లు శుభ్రపర్చటమే కాకుండా షైనింగ్ తో సున్నితంగా మార్చుతుంది.

పాదాలు: పాదాలు తరచూ చీలడం లేదా పగుళ్ళు ఏర్పడం వంటివి ఉన్నట్లైతే బేకింగ్ సోడా బాగా సహాయపడుతుంది. అలసిన మీ పాదాలను బేకింగ్ సోడా వేసిన గోరువెచ్చని నీటిలో కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఇది పగిలిన లేదా చీలిన పాదాలకు ఉపశమనం కలిగించడమే కాదు, దురద, మంట నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇంకా కాలు చూడటానికి సున్నితంగా మార్చుతుంది.

సన్ బర్న్: సూర్య రశ్మివల్ల మీ ముఖం నల్లగా మరియు నిర్జీవంగా మరినట్లైతే?బేకింగ్ సోడ, నీళ్ళు సమంగా తీసుకొని మెత్తని పేస్ట్ లా తయారు చేసి ముఖానికి అప్లై చేయాలి. దాంతో నల్లని నిర్జీవ చర్మాన్ని ఉపశనమనం కలిగించి సున్నితంగా మార్చుతుంది. అయితే ఈ బేకింగ్ సోడా పేస్ట్ ను పగిలిన చర్మానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.

స్నానానికి: బేకింగ్ సోడా ఇదొక సౌదర్యపు ఉపయోగం. స్నానం చేసే నీళ్ళలో బేకింగ్ సోడా వేయడం వల్ల చర్మ మృదువుగా మారుతుంది. శరీర సంరక్షణలో దీన్ని ఉపయోగించడం ఎలా? బేకింగ్ సోడాను, కార్న్ స్ట్రాచ్ ను సమంగా తీసుకొని మెత్తని పేస్ట్ గా చేసి దీన్ని శరీరానికంతటికి పట్టించి స్నానం చేసుకోవాలి. ఇది బాడీ స్ర్కబ్ వల్ల చర్మం మీద దురద వంటివి లేకుండా చర్మాన్ని మృదువుగా మార్చుతుంది.

డియోడరెంట్: చెమట మరియు దుర్గంధం నుండి బయటపడాలంటే బేకింగ్ సోడాను అంతే పరిపమానంలో టాల్కమ్ పౌడర్ ను తీసుకొని బహుమూలల్లో స్ప్రే చేసుకోవడం వల్ల తాజాదనం ఎక్కువ సమయం ఉంటుంది. శరీరం నుండి వెలువడే దుర్వాసనను దూరం చేయడానికి స్నానపు నీటిలో వేసి స్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

టూత్ పేస్ట్: దంతాలు మిళమిళ మెరవాలంటే రెండు చెంచాల బేకింగ్ సోడ, అర టీస్పూన్ ఉప్పు, కొన్ని చుక్కల గ్లిజరిన్, కొద్దిగా నీళ్ళు తీసుకొని పేస్ట్ తయారు చేయాలి. ఈ పేస్ట్ ను పళ్ళు రుద్దడానికి ఉపయోగించాలి. నోటి దుర్వాసనను పోగొట్టడానికి ఇది ఉపయోగపడుతుంది.

ఫేస్ ప్యాక్: చర్మ సంరక్షణలో స్క్రబ్బింగ్ కు మాత్రమే కాకుండా ఫేస్ మాస్క్ లో కూడా ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడా, ఓట్ మీల్, తేనె, నీళ్ళు తీసుకొని బాగా మిక్స్ చేసి, ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

షేవింగ్ తర్వాత: షేవింగ్స్ కు ఉపయోగించే క్రీమ్స్ చాలా సైడ్ ఎఫెక్ట్ ఇస్తాయి. ముఖ్యంగా సున్నితమైన చర్మం కలిగిన వారికి బేకింగ్ సోడాను నీళ్ళలో వేసి షేవింగ్ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ముఖం సున్నితంగా ఉంటుంది. ఇది రేజర్ బర్న్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications











